మేక్ ఎ విష్ చిత్రం విడుదలకు సిద్ధం
త్వరలో మేక్ ఎ విష్ చిత్రం
AKAM ఫిలిమ్స్ పతాకామ్ పై కిరణ్ కస్తూరి నిర్మాతగా సంధ్య బయిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం మేక్ ఎ విష్.ఈ చిత్రం సస్పెన్స్ డ్రామాతో ఇది ముగ్గురు స్త్రీల కథ, వారి ప్రేమ కథలు పాటు వారి సంబంధాల సమస్యల చుట్టూ తిరుగుతుంది, కథ మొత్తం వారి జీవితంలోకి చొరబడిన వ్యక్తితో టైమ్‌లైన్‌లో ముందుకు వెనుకకు తిరుగుతుంది. ఈ చిత్రం వాషింగ్టన్ డీసీ, యు ఎస్ ఎ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో మీ ముందుకు రాబోతుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్రం యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియ చేశారు.
నటీనటులు :
సంధ్య బాయిరెడ్డి, కిరణ్ కస్తూరి, అభిషేక్ సబ్బే, వరుణ్ వేగినాటి, కార్తీక్ కందాళ
సాంకేతికవర్గం :
స్టోరీ:కిరణ్ కస్తూరి & సంధ్య బయిరెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రణీత్
సినిమాటోగ్రఫీ : మహావీర్ అభిమన్యు & అడ్రిఎన్ రిలే
ప్రొడ్యూసర్: కిరణ్ కస్తూరి
డైరెక్టర్: సంధ్య బయిరెడ్డి
నిర్మాణ నిర్వహణ: జి శ్రీనివాస్ (భవాని శ్రీను)