మేఘా ఆకాశ్ ఇంటర్వ్యూ
రాజరాజ చోర’లో ప్రతి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది: మేఘా ఆకాశ్
శ్రీవిష్ణు, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రాజరాజ చోర’. హితేశ్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆగస్ట్ 19న సినిమా విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ మేఘా ఆకాశ్ ఇంటర్వ్యూ విశేషాలు…
లాక్‌డౌన్‌లో ‘రాజరాజ చోర’ కథను విన్నాను. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సినిమాలో ప్రతి పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించింది. పాత్రలు చాలా రియల్‌గా ఉంటాయి. ఇందులో సంజన అనే పాత్ర చేశాను.
శ్రీవిష్ణు కొత్త వాళ్లతో అంత త్వరగా కలిసిపోడు. సిగ్గరి. నేను కూడా కొత్తవాళ్లతో అంత ఈజీగా కలిసిపోను. అయితే నా కంటే తను చాలా సైలెంట్‌గా ఉంటాడు. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడుతూ తనతో కలిసిపోయే ప్రయత్నం చేశాను. కానీ ఓసారి శ్రీవిష్ణు ఎదుటి వ్యక్తులతో కలిసిపోయిన తర్వాత, చాలా ఫన్నీగా మాట్లాడుతుంటాడు.
కావాలనే తెలుగులో గ్యాప్ రాలేదు. మంచి స్క్రిప్ట్స్ రాలేదు. అందుకే ఏదీ ఒప్పుకోలేదు. భాషను బేస్ చేసుకుని స్క్రిప్ట్స్ ఎప్పుడూ ఒప్పుకోను. మంచి స్క్రిప్ట్ కోసం చూడటమే. మధ్యలో తమిళంలో మంచి స్క్రిప్ట్స్ రావడంతో సినిమాలు చేస్తూ వచ్చాను. ఇప్పుడు తెలుగులో చాలా మంచి స్క్రిప్ట్స్ వచ్చాయి. డిఫరెంట్ సినిమాలు చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తు న్నాను. కథలు ఎక్కువగా వింటున్నాను. అమ్మ, నాన్నలు నా సినిమాల ఎంపికలో జోక్యం చేసుకోరు.
ఎంటర్‌టైనింగ్ మూవీ. ఇప్పుడున్న పరిస్థితులు ప్రేక్షకులు ఎంటర్‌టైనింగ్ సినిమాలు చూడాలనుకుంటున్నారు. అలాంటి ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
ప్రస్తుతం తెలుగులో డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం, మనుచరిత్ర, మరో సినిమా చర్చల దశలో ఉంది.