మొక్కలు నాటిన సంపూర్ణేష్ బాబు

Published On: September 29, 2020   |   Posted By:
మొక్కలు నాటిన సంపూర్ణేష్ బాబు
 
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన  హీరో సంపూర్ణేష్ బాబు.
 
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్  భాగంగా మూడు మొక్కలు నాటానని హీరో సంపూర్ణేష్ బాబు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి  ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ కమెడియన్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం లో  మొక్కలు నాటిన హీరో సంపూర్ణేష్ బాబు … అనంతరం మరో ముగ్గురు ( బిగ్ బాస్ సమీర్ , సినీ దర్శకుడు స్టీల్ శంకర్ , బిగ్ బాస్ జ్యోతి )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని  కోరారు.