మొక్కలు నాటిన హీరోలు చిరంజీవి పవన్ కళ్యాణ్
*గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి ; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్*
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా అద్భుతం గా ముందుకు కొనసాగుతుంది దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందించడం జరుగుతుంది
అందులో భాగంగా జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి గారి నాయకత్వంలో ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారితో కలిసి సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రారంభించిన ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ; దర్శకులు బోయపాటి శ్రీను; అనిల్ రావిపూడి
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు దూసుకుపోతున్న మా హీరో రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు కరోనా వైరస్ వల్ల మానవ శరీరం లో మొదటగా దెబ్బ తినేది ఊపిరితిత్తులు గాలి పీల్చుకో లేక మనిషి చనిపోతున్నారని ప్రాణవాయువు ఊపిరితిత్తులకు అంత ప్రాధాన్యం ఉండదని ఈ కరోనా సమయం లో సామాన్యులకు కూడా ప్రాణవాయువు విషయం తెలియ వచ్చిందని ఈ భూమి తల్లి గూడా అడవులు వృక్షాలు ప్రాణవాయువు అందిస్తాయని భూమికి ఊపిరితిత్తులు చెట్లు అని అలాంటిలాంటి ప్రాణవాయువును అందించే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు.
మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు అందించే గొప్ప సంపద అని మొక్కలు మనం ఇచ్చే కాలుష్యాన్ని పిలుచుకొని మనకు ప్రాణవాయువు అందిస్తున్నాయని దానిని గుర్తించిన సంతోష్ గారు గత మూడు సంవత్సరాల నుండి ఆయన చేస్తున్న కార్యక్రమం లో గతంలో కూడా ఒక సారి పాల్గొనడం జరిగింది అని. ఇప్పుడు కూడా పాల్గొని మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని జూబ్లీ హిల్స్ సొసైటీ ఒక లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని వారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మెగా అభిమానులందరూ కూడా మొక్కలు నాటాలని అదే మనం ఈ భూమికి తిరిగి ఇచ్చే ప్రతి ఉపకారం అని తెలిపారు.
*పవర్ స్టార్ పవన్ కళ్యాణ్*
జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు సంతోష్ గారి సహకారంతో ఆకుపచ్చ గా ఉండాలని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిన వారికి కృతజ్ఞతలు పచ్చదనం లేకపోతే చాలా కష్టం దుబాయ్ లాంటి దేశంలో పచ్చదనం కోసం చాలా కష్టపడతారు.
సౌత్ ఆఫ్రికా లాంటి దేశంలో గడ్డి మొక్కలను కూడా చాలా అపురూపంగా పెంచుకుంటారు మనం దేశంలో మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది ఆ స్ఫూర్తిని మనకు కలిగిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు నీను కూడా చాలా ప్రకృతి ప్రేమికుడిని పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆలోచన ఉన్న వాడిని పచ్చదనాన్ని పెంచాలని గృహ ఉన్నవాడిని మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టం నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి NTV చౌదరి గారికి కృతజ్ఞతలు ప్రతి ఒక్కరు ఈ మొక్కలు పెంచే ఈ కార్యక్రమాన్ని బాధ్యత తీసుకోవాలని నా అభిమానులు అందరూ కూడా మొక్కలు నాటి పెంచాలని కోరుతున్నాను అని పిలుపునిచ్చారు.
దర్శకులు బోయపాటి శ్రీను* మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక మంచి కార్యక్రమాన్ని దీన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు అని ఈ సందర్భంగా నేను చిరంజీవి అభిమానులకు పవన్ కళ్యాణ్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు అదేవిధంగా బోయపాటి కుటుంబ సభ్యులకు మొక్కలు నాటాలని పిలుపునిస్తున్నారు అని తెలిపారు
దర్శకుడు అనిల్ రావిపూడి* మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది అదే విధంగా ముందుకు కొనసాగాలని ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు ఈ చాలెంజ్ స్వీకరించి అందరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు నరేంద్ర చౌదరి; సెక్రెటరీ హనుమంతరావు; జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షులు చలసాని దుర్గ ప్రసాద్; సెక్రటరీ సురేష్ రెడ్డి ;సభ్యులు చలసాని శ్రీనివాస్; విద్యాసాగర్; బాలకృష్ణ; అట్లూరి సుబ్బారావు తదితరులు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.