మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ రివ్యూ

Published On: October 15, 2021   |   Posted By:

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ రివ్యూ


  అఖిల్‌  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రివ్యూ

 Emotional Engagement Emoji (EEE) : 

👍

అఖిల్ కు , బొమ్మరిల్లు భాస్కర్ కు డెస్పరేట్ గా హిట్ కావాలి. అందుకు దగ్గట్లుగా కథ రెడీ చేసి, పూజ వంటి స్టార్ హీరోయిన్ ని సీన్ లోకి తీసుకొచ్చి ప్రాజెక్టు పట్టాలెక్కించారు. కానీ ఇది ఎప్పటి సంగతి. చాలా కాలం అయ్యిపోయింది. ఈ లోగా ఈ సినిమా ఫలానా షాదీ ముబారక్ అనే చిన్న సినిమాకు సిమిలర్ కథతో ఉంది అనే టాక్. రీషూట్ అన్నారు. రిలీజ్ లేటు. ఇలా ఎన్నో  సమస్యలను దాటుకుని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్స్ తో కొంత ఊపు తీసుకురావటంతో సినిమాపై అంచనాలు ఉన్నాయి. వాటిని ఈ సినిమా ఏ మేరకు రీచ్ అయ్యింది…అఖిల్ కు ఫైనల్ గా ఈ సినిమా అయినా హిట్ ఇచ్చిందా..నిజంగానే షాదీ ముబారక్ తో పోలిక ఉందా…అసలు కథ ఏంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

అమెరికాలో ఉంటున్న  హ‌ర్ష‌(అఖిల్‌) లైఫ్ లో పెళ్లి అధ్యాయంలోకి ప్రవేశించాలనుకుంటాడు. అందుకోసం ఇండియాకు ఓ ఇరవై రోజులు ఉండి, అమ్మాయిలను చూసుకోవాలని వస్తాడు. ఆ క్రమంలో విభ‌(పూజా హెగ్డే) పరిచయం అవుతుంది. ఆమె ఓ స్టాండప్ కమిడియన్. ఆమెను పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడతాడు. ప్రపోజల్ పెడదామనుకుంటాడు. కానీ ఆమె తండ్రికి మాత్రం హర్ష నచ్చడు. ఆ తర్వాత ఆమె ఇండిపెండెంట్ అభిప్రాయాలు అతనికి నచ్చవు. దాంతో ఆమెకు బై చెప్పి అమెరికా వెళ్లిపోతాడు. కానీ అక్కడికి వెళ్లినా ఆమె ఆలోచనలే వెంబడిస్తాయి. దాంతో ఇంట్లో వాళ్ళు వేరే సంబందం  ఓకే చేసినా, ఆమె కోసం ఇండియా వచ్చేస్తాడు. ఇప్పుడు ఆమెను  త‌న‌తో పెళ్లికి హర్ష ఎలా ఒప్పించాడు? అసలు ఆమె సమస్య ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


స్క్రీన్ ప్లే  ఎనాలసిస్ ..

ఏ అమ్మాయికైనా ఓ పద్దతి కల అబ్బాయి తన జీవితంలోకి వస్తే చాలనుపిస్తుంది అనుకుంటాం. కానీ నిజానికి అమ్మాయిల మనస్సులో రకరకాల ఆలోచనలు ఉంటాయి. వారికి తమకు కావాల్సింది ఏమిటో తెలుసు. ఆ భర్త ఎలా ఉండాలో అవగాహన ఉంటుంది. అలాంటి అమ్మాయి పాత్రనే  ఈ సినిమాలో భాస్కర్ పరిచయం చేసారు. ఆమెను అందుకోవాలంటే తను ఆమె స్దాయికి ఎదగాలి. అదే హీరో చేస్తాడు. అయితే ఆ చేసే క్రమంలో స్క్రిప్టు పేపరుపై ఉన్నంత ఈజిగా తెరపై జరగలేదు. అనేక అప్ అండ్ డౌన్స్ తో సాగింది. దాన్ని అధిగమించటానికి ఫస్టాఫ్ ఫన్ తో లాగారు. కానీ సెకండాఫ్ వచ్చేసరికి ఆ అవకాసం లేదు. దాంతో బాగా డ్రై అయ్యిపోయింది.  వైవాహిక జీవితంలో భాగస్వామి ‘పక్కన’ ఉండటానికి, ‘దగ్గర’ ఉండటానికి మధ్య తేడాను డైరక్టర్ చూపించే ప్రయత్నంలో తడబడ్డా ఓ మంచి ప్రయత్నం చేసాడనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో హీరోకు ఉన్న ఆర్క్ …తన జీవితాన్ని, తన ఆలోచనలను అన్వేషించుకోవటం.

చివరకు ఓ స్పష్టత రావటం. దాంతో ఫస్టాఫ్ లో ఉన్న ఫన్,జోష్ సెకండాఫ్ లో మిస్సైంది. అయితే హీరోయిన్ విభా  క్యారక్టర్ రాసినంత బలంగా హీరోని క్రియేట్ చేయలేదు. దాంతో హీరోయిన్ ముందు తేలిపోతాడు. అయితే రొమాంటిక్ కామెడీ సిమిమాల్లో అలాంటిది జరగటం సహజమే. ఇద్దరినీ బాలెన్స్ చేస్తే చాలాసార్లు మెకానికల్ అయ్యిపోతూంటుంది. అలాగే హీరోయిన్ ని స్టాండప్ కమిడియన్ చేయటం మాత్రం సాహసమే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టాండప్ కామిడీలు ప్రాచుర్యం పొందుతున్నాయి.  ఓవరాల్ గా ఈ సినిమా ఓ డీసెంట్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. అయితే కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. కానీ పండగ సీజన్, స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. దర్శకుడుగా బొమ్మరిల్లు భాస్కర్ ..కథలో అనేక సబ్ ప్లాట్స్ పెట్టి కథను నడిపించే ప్రయత్నం చేసారు కానీ గ్రిప్పింగ్ గా చేయలేకపోయారు. మరింత బెటర్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాని నేరేట్ చేసి ఉంటే ఖచ్చింతగా వేరే స్దాయిలో ఫలితం ఉండేది.  

 నచ్చినవి :
 పూజా హెగ్డే పర్ఫార్మెన్స్
సంగీతం
క్లైమాక్స్ డైలాగులు

నచ్చనవి:
సెకండ్ హాఫ్  
రొటీన్ రొమాంటిక్ కామెడీ
కొన్ని సిల్లీ ఎపిసోడ్స్

సాంకేతికంగా:
టెక్నీషియన్స్ ఫెరఫెక్ట్ అవుట్ ఫుట్ ఇచ్చారు. ప్రదీశ్ వర్మ సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయ్యింది.  గోపీసుందర్ ఇచ్చిన పాటల్లో ‘లెహరాయీ’ సూపర్బ్ గా ఉంది.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు. మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఇంకాస్త లాగ్ లు తగ్గించాల్సింది. ఆర్ట్ డైరెక్టర్ అవినాశ్ కొల్లా తన వర్క్ ని తెరపై స్పష్టంగా గమనించేలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ నెక్ట్స్ లెవిల్ లో ఉన్నాయి. డైలాగులు బాగున్నాయి.  

ఇక నటీనటుల్లో ..

 అఖిల్ నటనలో చక్కని మెచ్యూరిటీతో చేసారు. పూజా హెగ్డే  విభా గా జీవించింది! హీరోయిన్ అమ్మా,నాన్న లుగా వేసిన ప్రగతి, మురళీశర్మ; అఖిల్ తల్లి,తండ్రులుగా చేసిన ఆమని, జయప్రకాశ్ తమ పాత్రల్లో ఒదిగారు. హీరో ప్రెండ్స్ గా సుడిగాలి సుధీర్, ‘వెన్నెల’ కిశోర్ ఓకే అనిపించారు. మిగతా కీలక పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, మణిచందన, సత్య, అజయ్, అమిత్ తివారి, పోసాని, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, చైతన్య కృష్ణ, అభయ్ తదితరులు నటించారు.  

చూడచ్చా?
 ఓ సారి ట్రై చేయచ్చు. నచ్చచ్చు కూడా

తెర వెనక..ముందు
తారాగణం: అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే, ఈష రెబ్బ, ఫరియా అబ్దుల్లా, ఆమని, మురళి శర్మ, వెన్నెల కిషోర్, ప్రగతి, పోసాని, సుడిగాలి సుధీర్, చిన్మయి, రహుల్ రవీంద్రన్ తదితరులు
కెమెరా: ప్రదీష్ వర్మ
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం: గోపీ సుందర్
నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ
కథ- దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
రన్ టైమ్: 2 గంటల, 30 నిముషాలు
విడుదల తేదీ: 15 అక్టోబర్ 2021