మౌనమే ఇష్టం చిత్రం సెన్సార్ పూర్తి
మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు చిత్రంలోని చార్మినార్ సెట్ తో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కోరాలత్ తాజాగా మౌనమే ఇష్టం అనే చిత్రాన్ని రూపొందించారు. తను దాదాపు 150 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి లొకేషన్లను చక్కటి కలర్స్ తో ఎంత అందంగా తీర్చిదిద్దారో అంతే దీక్షతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రతి ఫ్రేము ఒక పెయింటింగ్ లాగా వుంటుంది.
ప్రస్తుతం మౌనమే ఇష్టం చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ యు సొంతం చేసుకుంది.
రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా అశోక్ కోరాలత్ దర్శకత్వంలో ఏకే మూవీస్ పతాకంపై ఆశా అశోక్ నిర్మించిన చిత్రం మౌనమే ఇష్టం. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యు సొంతం చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు అశోక్ కొరాలత్ మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు 150 చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాను. ఒక్కడు, అరుంధతి, అంజి, రామ్ చరణ్ హీరోగా నటించిన గోవిందుడు అందరివాడే వరకు బారీ సెట్స్ నిర్మించాను. సెట్ కు నేను ఉపయోగించే కలర్ కాంబినేషన్ ను ప్రముఖ దర్శకులందరూ మెచ్చుకుంటారు. అంతే కాన్పిడెన్స్ తో మౌనమే ఇష్టం చిత్రాన్ని రూపొందించాను. చక్కటి కథాంశంతో ప్రేక్షకుల మనసు దోచేలా ప్రతి ఫ్రేము వుంటుంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖులు మీరు వేసిన సెట్ ఎంత ఆహ్లాదంగా వుందో సినిమా చూస్తున్నంత సేపూ అంతే ఫీలింగ్ కలిగింది అని అప్రిషియేషన్ అందుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఈ చిత్రాన్ని మార్చి రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. యువ జంట రామ్ కార్తీక్, పార్వతి చక్కగా నటించారు. నాజర్ తన పాత్రకు ప్రాణం పోశారు. భిన్న మనస్తత్వాలున్న హీరో హీరోయిన్లు చివరి కి ఎలా కలిశారు అనే అంశాన్ని వినోదాత్మకంగా, పోయెటిక్ స్టైల్లో చూపించాము అన్నారు. నిర్మాత ఆశా అశోక్ మాట్లాడుతూ దర్శకుడు చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంతసేపూ నిర్మాణ ఖర్చుకు చక్కటి న్యాయం చేశారు అనిపించింది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని ఒక ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంది అని చెప్పారు.
ఈ చిత్రానికి కథః సురేష్ గడిపర్తి, ఎడిటర్ః మార్తాండ్ కే వెంకటేష్, కెమెరాఃజె.డి.రామ్ తులసి, సంగీతంః వివేక్ మహాదేవా, ప్రొడక్షన్ డిజైనర్ః రాజీవ్ నాయర్, నిర్మాతః ఆశ అశోక్, స్కీన్ ప్లే, దర్శకత్వంః అశోక్ కోరాలత్