మ్యూజిక్‌ స్కూల్‌ నాలుగో షెడ్యూల్‌ గోవాలో పూర్తి

Published On: April 19, 2022   |   Posted By:

మ్యూజిక్‌ స్కూల్‌ నాలుగో షెడ్యూల్‌ గోవాలో పూర్తి

శ్రియ శరణ్‌, శర్మణ్‌ జోషి, షాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా మ్యూజిక్‌ స్కూల్‌. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ని ఇటీవల గోవాలో పూర్తి చేశారు పాపారావు బియ్యాల. బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేసుల్లోనూ, బీచ్‌ బ్యాక్‌డ్రాప్‌లలోనూ ఈ సినిమాలోని కీలకమైన టాకీ పోర్షన్‌ని కంప్లీట్‌ చేశారు డైరక్టర్‌.

గోవాలో పూర్తి చేసిన ఈ షూటింగ్‌తో దాదాపు 95 శాతం చిత్రీకరణ పూర్తయినట్టే.

మ్యూజిక్‌ స్కూల్‌లో తన పోర్షన్‌ని పూర్తి చేసిన షాన్‌ మాట్లాడుతూ ”మ్యూజిక్‌ స్కూల్‌కి షూటింగ్‌ చేస్తున్నంత సేపు చాలా అద్భుతంగా అనిపించింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం పెద్ద కుటుంబంలోని వ్యక్తుల్లాగా కలిసిపోయాం. సరదాగా గడిపాం. ముఖ్యంగా, మాతో పనిచేసిన పిల్లలు ఎప్పుడూ ఉత్సాహంగా, ఉరకలేస్తూ ఉండేవారు. వాళ్లందరినీ మిస్‌ అవుతానని మాత్రం కచ్చితంగా చెప్పగలను. సినిమా రూపుదిద్దుకున్న విధానాన్ని తెరమీద చూడాలనే ఆతృత ఉంది. సినిమా రిలీజ్‌కి రెడీకాగానే పనిచేసిన అందరినీ రీ యూనియన్‌ పార్టీలో కలుసుకోవాలని ఉంది. అప్పటిదాకా పాపారావుగారికి, మిగిలిన టీమ్‌ అందరికీ నా బెస్ట్ విషెస్” అని అన్నారు.

ఇళయరాజా రికార్డింగ్‌ స్టూడియోలో ఓ పాట పాడుతున్న సమయంలోనే ఈ సినిమాలోని పాత్రకు షాన్‌ పర్ఫెక్ట్ గా సూట్‌ అవుతారనే అభిప్రాయానికి వచ్చారు డైరక్టర్‌ పాపారావు బియ్యాల. ఫ్లామ్‌బోయ్‌ తరహా వ్యక్తి కేరక్టర్‌కి షాన్‌ పర్ఫెక్ట్ గా సూటయ్యారు. ఈ చిత్రంలో సెకండ్‌ లీడ్‌గా చేస్తున్న ఓజు బారువా, గ్రేసీ గోస్వామి కూడా ఈ షెడ్యూల్‌లోనే తమ పార్ట్ ని కంప్లీట్‌ చేశారు. ఈ టీన్‌ డుయోకి సినిమాలో చాలా స్పెషల్‌ ప్లేస్‌ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వాళ్లని అభినందిస్తారనేది దర్శకుడి మాట.
వెటరన్‌ కేరక్టర్‌ ఆర్టిస్టులు బెంజమిన్‌ గిలానీ, సుహాసిని మూలేని డైరక్ట్ చేసిన అనుభూతి గొప్పదని అంటారు దర్శకుడు పాపారావు. ఆయన మాట్లాడుతూ ”గొప్ప విషయపరిజ్ఞానం కలిగిన వారిద్దరితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గోవా సీనిక్‌ బ్యూటీని మా సినిమాటోగ్రాఫర్‌ కిరణ్‌ డియోహాన్స్ అత్యంత సుందరంగా కేప్చర్‌ చేశారు. మా సినిమాలో ఈ ఫోర్త్ షెడ్యూల్‌ చాలా స్పెషల్‌. అంత ప్రత్యేకమైన షెడ్యూల్‌ని గోవాలో చిత్రీకరించడం చాలా ఆనందంగా అనిపించింది. మన దేశంలో చూడగానే ఆకట్టుకునే విజువల్‌ స్ట్రైకింగ్‌ స్టేట్స్ లో గోవా తొలి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఆ అందాన్నంతా మా సినిమాలో చూపించాం. హైదరాబాద్‌లో ఫైనల్‌ పాటను ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తామా? అని ఆతృతగా వెయిట్‌ చేస్తున్నాం” అని అన్నారు.

యామిని ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే రచయిత. మ్యూజిక్‌ స్కూల్‌ని హిందీ, తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. కిరణ్‌ డియోహాన్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

షర్మన్‌ జోషి, శ్రియా శరణ్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్‌, బెంజిమిన్‌ గిలాని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వినయ్‌ వర్మ, మోనా అంబెగోయెంకర్‌, గ్రేసీ గోస్వామీ, ఓజు బారువా, బగ్స్ భార్గవ, మంగళ భట్‌, ఫణి ఎగ్గొట్టి, వాక్వర్‌ షేక్‌, ప్రవీణ్‌ గోయల్‌, రజినీష్‌, కార్తికేయ, రోహన్‌ రాయ్‌, ఒలివియ చరణ్‌, వివాన్‌ జైన్‌, సిదీక్ష, ఆద్య, ఖుషీ నటీనటులు.