మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చిత్రం
సూపర్‌స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన `అతడు` 16ఏళ్లుగా, `ఖలేజా` 11ఏళ్లుగా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి.
రిపీటెడ్‌గా ఈ ఎవర్‌గ్రీన్ బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్స్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నవారందరూ ఈ సూపర్ కాంబినేషన్‌లో రాబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. 11ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ రాబోతుందన్న న్యూస్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేపుతోంది.
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే31న పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యే ఈ చిత్రం 2022 సమ్మర్ స్పెషల్‌గా రిలీజవుతుంది.
ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలతో మహేష్-త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. రాబోయే చిత్రాల్లో ఒక స్పెషల్ క్రేజ్ ఉన్న #SSMB28కి సమర్పణ: శ్రీమతి మమత, నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు), రచన, దర్శకత్వం: త్రివిక్రమ్.