యక్షిణి వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్
ఘనంగా సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ యక్షిణి ట్రైలర్ లాంఛ్, జూన్ 14 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వస్తున్న యక్షిణి
ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కాంబినేషన్ లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యక్షిణి. ఈ వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు తేజ మార్ని యక్షిణి సిరీస్ ను రూపొందిస్తున్నారు. జూన్ 14న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో యక్షిణి వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు యక్షిణి వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
నిర్మాత ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ పరంపర తర్వాత డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ తో కలిసి మేము చేస్తున్న రెండో సిరీస్ ఇది. రొమాన్స్, కామెడీ, డ్రామా వంటి అంశాలతో యక్షిణి ఆకట్టుకుంటుంది. డిస్నీ మాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో మేము బడ్జెట్ విషయంలో యక్షిణి టీమ్ కు అంత ఫ్రీడమ్ ఇచ్చాం. ఈ సిరీస్ పూర్తిగా దర్శకుడు తేజ మార్ని విజన్ అని చెప్పాలి. మా ఆర్కా టీమ్ కు, డిస్నీ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. యక్షిణిలో మంచి కాస్టింగ్ ఉన్నారు. వారంతా సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. యక్షిణి పరంపరను మించిన సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. యక్షిణి సీజన్ 2 కోసం కూడా ప్లానింగ్ మొదలుపెట్టాం. అన్నారు.
నటి మంచు లక్ష్మి మాట్లాడుతూ యక్షిణి వెబ్ సిరీస్ లో జ్వాల క్యారెక్టర్ లో కనిపిస్తాను. ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ క్యారెక్టర్ నేను తప్ప మరెవరు చేస్తారు అనిపించింది. షూటింగ్ లో ప్రతి రోజూ కొత్తగా అనిపించేది. నేను ఈ సిరీస్ చేయాలని రాసిపెట్టి ఉందని భావిస్తాను. ఆర్కా మీడియా, డిస్నీతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. వేదిక రోజూ ఏం తింటుందో గమనించేదాన్ని. అజయ్ అలా నిల్చుని ఉంటే చాలు పర్ ఫార్మ్ చేసినట్లే. తోటి ఆర్టిస్టులంతా అతనితో పోటీ పడాల్సిఉంటుంది. రాహుల్ విజయ్ ఫాదర్ , మా నాన్న కలిసి సినిమాలు చేశారు. ఇప్పుడు మేము కలిసి సిరీస్ చేయడం సంతోషంగా ఉంది. నేను ఎవరో అవకాశాలు ఇస్తారని వేచి చూడను. అవకాశాలు క్రియేట్ చేసుకుంటా. అందుకే సిరీస్ లు, షోస్ అంటూ ఏదో ఒక వర్క్ లో బిజీగా ఉంటాను. యక్షిణి మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. తప్పకుండా చూడండి. అన్నారు.
నటుడు అజయ్ మాట్లాడుతూ వెబ్ సిరీస్ లు నటీనటులకు ఒక వరం లాంటివి. ఒక పాత్రను అర్థం చేసుకుని వీలైనంత బాగా పర్ ఫార్మ్ చేసే అవకాశం వెబ్ సిరీస్ లలో దొరుకుతుంది. ఎక్కువకాలం ఆ క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేయగలుగుతాం. యక్షిణి నాకు అలాంటి అవకాశం ఇచ్చింది. ఫాంటసీ ఎలిమెంట్స్ తో వచ్చే కమర్షియల్ వెబ్ సిరీస్ లు తెలుగులో చాలా తక్కువ. యక్షిణి అలాంటి జానర్ తో తెరకెక్కింది. ప్రేక్షకులకు మంచి ఫీల్ ఇచ్చే సిరీస్ ఇది. కన్ఫర్మ్ గా బాగుంటుంది. మా టీమ్ అందరి ముఖాల్లోని కాన్ఫిడెన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. విరూపాక్ష తర్వాత మాంత్రికుడి క్యారెక్టర్స్ చాలా వచ్చాయి కానీ అవన్నీ రిజెక్ట్ చేశాను. దానికి కాస్త దగ్గరగా ఉన్న రోల్ యక్షిణిలో చేశాను. అన్నారు.
హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ తేజ మార్ని నేను కలిసి కోటబొమ్మాళి చేశాం. ఆ టైమ్ లో హాట్ స్టార్ సిరీస్ గురించి చెప్పారు. ఆర్కా మీడియా, హాట్ స్టార్, తేజ మార్ని కాంబోలో సిరీస్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. స్క్రిప్ట్ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. అయితే నాకు పురాణాలపై అవగాహన తక్కువ. అదొక్కటే భయపెట్టింది. సోషియో ఫాంటసీని అందరికీ నచ్చేలా మా డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేస్తారో అనే సందేహం ఉండేది కానీ ఔట్ పుట్ చూశాక ఈ సిరీస్ తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అనిపించింది. బ్యూటిఫుల్ గా యక్షిణిని రూపొందించారు తేజ మార్ని. మేము యక్షిణి సిరీస్ విజయం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
హీరోయిన్ వేదిక మాట్లాడుతూ ప్రపంచ సినిమాపై గుర్తుండిపోయే బాహుబలి లాంటి ప్రాజెక్ట్ చేసిన ఆర్కా మీడియా సంస్థలో యక్షిణి వెబ్ సిరీస్ తో నేను డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఆర్కా టీమ్, డిస్నీ టీమ్ కు నా థ్యాంక్స్ చెబుతున్నా. వంశీ రాసిన ఈ స్క్రిప్ట్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. ఆయన కొన్ని నెలల టైమ్ ఈ స్క్రిప్ట్ కోసం తీసుకుని ఉంటారు. క్యారెక్టర్స్ లో ఎంతో డెప్త్, వేరియేషన్ ఉంది. యక్షిణి మా ప్రతి ఒక్కరి కెరీర్ లో ఎంతో స్పెషల్. ప్రతి రోజూ షూటింగ్ లో ఛాలెంజింగ్ గా అనిపించేది. మా టీమ్ మెంబర్స్ అంతా తమ బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చారు. నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాను. మా డైరెక్టర్ తేజ మార్నికి మేకింగ్ పట్ల చాలా క్లారిటీ ఉంది. ఇలాంటి సిరీస్ లో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నా. థ్రిల్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. లక్ష్మీ, అజయ్, రాహుల్ విజయ్ తో కలిసి పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. అన్నారు.
దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ సినిమా చేయడానికి సిరీస్ మేకింగ్ కు చాలా తేడా ఉంటుంది. సినిమాను రెండున్నర గంటల్లో చెబితే సిరీస్ లో ప్రతి ఎపిసోడ్ డిజైన్ చేయాలి. ఆ ఎపిసోడ్ లో రెండు మూడు చోట్ల ఎగ్జైట్ చేయించాలి. నేను యక్షిణి చేసే ప్రాసెస్ లో దర్శకుడిగా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది ఫస్ట్ వెబ్ సిరీస్. ఆర్కా లాంటి బిగ్ బ్యానర్ లో నేను ఈ సిరీస్ చేయడం హ్యాపీగా ఉంది. రైటర్ రామ్ వంశీ కృష్ణ నా ఫస్ట్ మూవీ జోహార్ నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన ఒక సోషియో ఫాంటసీ లైన్ తో యక్షిని స్క్రిప్ట్ చెప్పాడు. లైన్ గా చెప్పాలంటే అలకాపురి అనే లోకం నుంచి ఒక శాపం వల్ల భూమ్మీదకు వచ్చిన యక్షిణి వంద మందిని చంపితేగానీ శాపవిముక్తి కాదు. ఆ వంద మందిని ఎలా చంపింది. వందో వ్యక్తి ఎవరు అనేది ఈ సిరీస్ స్టోరి. నాకు వండర్ ఫుల్ టీమ్ దొరికింది. మంచు లక్ష్మి గారు మేకప్ తో రోప్స్ తో సీన్స్ చేస్తుంటే దగ్గరకు వెళ్లాలంటే భయం వేసేది. ఆమె చాలా సపోర్ట్ చేశారు. వేదిక గారికి ప్రతి సీన్ చేసేప్పుడు ఎంతో క్లారిటీగా ఉండేవారు. ముందు సీన్ తర్వాత సీన్ నోట్ చేసుకునేవారు. ఆమెకు మేకప్ కు కొన్ని గంటల టైమ్ పట్టేది. ఎంతో ఓపికగా వర్క్ చేశారు. యక్షిణి ఎంటైర్ టీమ్ కు నా థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.