Reading Time: 3 mins

రాక్షస కావ్యం మూవీ ట్రైలర్ ఈవెంట్

ఆడియెన్స్ కు కావాల్సిన పర్పెక్ట్ మూవీ రాక్షస కావ్యం. – నిర్మాత దిల్ రాజు

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాక్షస కావ్యం. ఈ చిత్రాన్ని గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రాక్షస కావ్యం చిత్రాన్ని దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందిస్తున్నారు. అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు. అనంతరం

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – రాక్షస కావ్యం ట్రైలర్ చూశాను. ఇండస్ట్రీలోని కొత్త వాళ్లు, చిన్న వాళ్లు చేసిన ప్రయత్నమిది. ట్రైలర్ చూసిన తర్వాత దర్శకుడిలో విషయం ఉందని అర్థమైంది. దర్శకుడి మేకింగ్, టేకింగ్ బాగుంది. మంచి కథతో వస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. కొత్త వాళ్లతో ప్రొడ్యూసర్ దాము మంచి ప్రయత్నం చేశాడు. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. పాండమిక్ తర్వాత ఓటీటీలో ఎక్కువగా నెగిటివ్ కంటెంట్ బాగా పెరిగింది. నెగిటివ్ క్యారెక్టర్స్ తో వస్తున్న కంటెంట్ సక్సెస్ అవుతోంది. నేను సినిమా చేసినా పాజిటివ్ కథతో సినిమా చేసినా చూడరేమో అనే భయం కలుగుతోంది. మీరు ఆ ట్రెండ్ పట్టుకున్నారు. ఇవాళ్టి ఆడియెన్స్ కు కావాల్సిన సినిమా చేశారు. ఎప్పుడు హీరోలే గెలవాలా, విలన్స్ విన్ అవొద్దా అనే పాయింట్ చెబుతున్నారు. అక్టోబర్ ఆరో తారీఖు సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈలోగా ప్రేక్షకుల దగ్గరకు మీ సినిమాను తీసుకెళ్లడం పెద్ద ఛాలెంజ్ గా తీసుకోండి. మీరు థియేటర్స్ కు జనాల్ని రప్పించగలిగి సినిమా బాగుంటే ప్రేక్షకులతో పాటు మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. అన్నారు.

నిర్మాత దామురెడ్డి మాట్లాడుతూ – మా రాక్షస కావ్యం సినిమా ట్రైలర్ లాంఛ్ కు అతిథిగా వచ్చిన నిర్మాత దిల్ రాజు గారికి థాంక్స్. ఆయన రావడంతో మా సినిమా రిలీజై, సక్సెస్ అయిన ఫీలింగ్ కలుతోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న బిగ్ డైరెక్టర్స్, హీరోలు దిల్ రాజు గారి సంస్థ నుంచి వచ్చినవాళ్లే. ఆయన మా ట్రైలర్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఫీలవుతున్నాం. రాక్షస కావ్యం సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కడా రొటీన్ గా అనిపించదు. ట్రైలర్ లో మీకు యాక్షన్ ఎక్కువ కనిపించవచ్చు కానీ ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమన్ రిలేషన్స్ తో ఆకట్టుకునేలా సినిమా సాగుతుంది. అక్టోబర్ 6న మీ ముందుకు వస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మా సినిమాకు మొదటి నుంచీ సపోర్ట్ చేస్తున్న మధుర శ్రీధర్ రెడ్డి గారికి, మా పార్టనర్ శింగనమల కల్యాణ్ గారికి థ్యాంక్స్. అన్నారు.

దర్శకుడు శ్రీమాన్ కీర్తి మాట్లాడుతూ – తన బిజీ షెడ్యూల్స్ లో కూడా మా సినిమా వేడుకకు అతిథిగా వచ్చిన దిల్ రాజు గారికి థ్యాంక్స్. ట్రైలర్ లాంఛ్ చేయడమే కాదు మా ట్రైలర్ బాగుందని ఆయన స్పందన తెలిపారు. దిల్ రాజు గారి ఆర్య, దిల్ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూసిన ఇన్సిపిరేషన్ ఎక్కడో నా మైండ్ లో ఉండిపోయింది. రాక్షస కావ్యం కథకు ఆ ఇన్సిపిరేషన్ తప్పకుండా ఉందని చెప్పగలను. మా సినిమా ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ ఇస్తుంది. అక్టోబర్ 6న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

హీరో అభయ్ నవీన్ మాట్లాడుతూ – దిల్ రాజు గారు మా సినిమా ఫంక్షన్ కు వచ్చారంటే ఆ సినిమాలో ఏదో మంచి కంటెంట్ ఉంటుందనే టాక్ బయటకు వెళ్తుంది. రాజు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. రాక్షస కావ్యం సినిమా నా కెరీర్ లో స్పెషల్ గా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దాము అన్నకు, శ్రీమాన్ కు థ్యాంక్స్. రెండు గంటలు మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఒక ఆడియెన్ గా ఈ సినిమా చూశా కాబట్టి మీకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఏర్పడింది. మా ట్రైలర్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అన్నారు.

హీరో అన్వేష్ మైఖేల్ మాట్లాడుతూ – రాక్షస కావ్యం కథ విన్నప్పుడే మేమంతా షాక్ అయ్యాం. అంత బాగా మాకు నచ్చిందీ స్క్రిప్ట్. ప్రతి క్యారెక్టర్ మీకు గుర్తుండేలా ఉంటుంది. ఈ సినిమాను స్క్రీన్ మీద ఎప్పుడు చూద్దామా అనేంత క్యూరియాసిటీతో ఉన్నాం. దాము అన్న నేను షార్ట్ ఫిలింస్ చేసినప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో మంచి అవకాశం ఇచ్చారు. రాక్షస కావ్యం థియేటర్ లో చూడండి. మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ కుశాలిని మాట్లాడుతూ – రాక్షస కావ్యం మూవీలో నటించే అవకాశం ఇచ్చిన దాము గారికి, శ్రీమాన్ కు థ్యాంక్స్. ఈ జర్నీలో మా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. రాక్షస కావ్యం కొత్తగా ఉంటుంది. మీరంతా అక్టోబర్ 6న థియేటర్స్ లో చూడండి. అని చెప్పింది.

నటీనటులు –

అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి, యాదమ్మ రాజు, శివరాత్రి రాజు, ప్రవీణ్ దాచరం, కోట సందీప్, విజయ్ అంబయ్య, వినయ్ కుమార్ పర్రి తదితరులు

టెక్నికల్ టీమ్ :

ఎడిటర్ అండ్ కలరిస్ట్ – వెంకట్ కళ్యాణ్
సినిమాటోగ్రఫీ – రుషి కోనాపురం
సంగీతం – రాజీవ్ రాజ్, శ్రీకాంత్
నిర్మాతలు – దాము రెడ్డి, శింగనమల కల్యాణ్
రచన, దర్శకత్వం – శ్రీమాన్ కీర్తి