Reading Time: < 1 min

రాజయోగం సినిమా పాట విడుదల

రాజయోగం సినిమాలోని చూడు చూడు పాటను విడుదల చేసిన హీరో శ్రీకాంత్
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రాజయోగం . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మిస్తున్నారు. ఒక వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు రామ్ గణపతి రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

తాజాగా ఈ సినిమాలోని చూడు చూడు పాటను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా అరుణ్ మురళీధరన్ స్వరపర్చారు. కౌషిక్ మీనన్, నిత్యా మమ్మెన్ పాడారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ .రాజయోగం టైటిల్ చాలా బాగుంది. ట్రైలర్ చూశాను గ్రాండ్ గా సినిమాను తెరకెక్కించారు. చూడు చూడు పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. పాట సౌండింగ్, పిక్చరైజేషన్ ఆకట్టుకున్నాయి. పేరుకు తగ్గట్లే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ఇటీవల దర్శకుడు మారుతి విడుదల చేసిన రాజయోగం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పాటలు, ట్రైలర్ బాగుండటంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి.

నటీనటులు:

అజయ్ ఘోష్, ప్రవీణ్, గిరి, భద్రం, షకలక శంకర్, తాగుబోతు రమేష్, చిత్రం శ్రీను, సిజ్జు, మధునందన్ తదితరులు

సాంకేతికవర్గం :

సినిమాటోగ్రఫీ – విజయ్ సి కుమార్
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్
సంగీతం – అరుణ్ మురళీధరన్
డైలాగ్స్ – చింతపల్లి రమణ
పీఆర్వో – జీఎస్కే మీడియా
సహ నిర్మాతలు – డాక్టర్ శ్యామ్ లోహియా, నందకిషోర్ దారక్
నిర్మాత – మణి లక్ష్మణ్ రావు
రచన దర్శకత్వం – రామ్ గణపతి.