రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి ఎంపికైన ప్రేమ విమానం మూవీ
ZEE5 ఒరిజినల్ మూవీ ప్రేమ విమానంకి అరుదైన గుర్తింపు రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి ఎంపికైన చిత్రం
ప్రముఖ ఓటీటీ మాధ్యమం ZEE5 రూపొందించిన ఒరిజినల్ మూవీ పేమ విమానంకు అరుదైన గుర్తింపు దక్కింది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి ఈ చిత్రం ఎంపిక కావటం విశేషం. 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోన్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పింక్ సిటీగా పేరున్న జైపూర్‌లో జనవరి 27 నుంచి 31 వరకు జరనుంది.
అనుభవజ్ఞులైన జ్యూరీ కమిటీ సభ్యులు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఐదు జాతీయ చిత్రాలను, ఏడు ప్రాంతీయ చిత్రాలను, మూడు అంతర్జాతీయ చిత్రాలను ఎంపిక చేసింది. ప్రేమ విమానం చిత్రంతో పాటు తెలుగు నుంచి మంగళవారం, మధురపూడి గ్రామం అనే నేను సినిమాలు కూడా ఈ ఫెస్టివల్‌కి ఎంపిక కావటంపై తెలుగు సినీ లవర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో మెప్పించిన సంగీత్ శోభన్ మరోసారి తనదైన నటనతో ప్రేమ విమానం చిత్రంలో అలరించారు. ఈయనకు జోడీగా సావ్వి మేఘన నటించింది. వీరితో పాటు అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తనయులు అనిరుద్, దేవాంశ్ చక్కటి నటనతో సినిమాలోని భావోద్వేగాలను మరింతగా కనెక్ట్ అయ్యేలా చేశారు. ఈ చిత్రానికి సంతోష్ కాటా దర్శకత్వం వహించారు. ప్రేమ విమానం చిత్రంలోని పాత్రల మధ్య ఉండే ఎమోషన్స్ ఆడియెన్స్‌ని అలరించాయి. ప్రేమను బతికించుకోవటానికి ప్రేమ జంట చేసే పోరాటం, విమానం ఎక్కాలనుకునే చిన్న పిల్లలు, వారికి తల్లితో ఉన్న అనుబంధం ఇలాంటి పాత్రల చుట్టూ సినిమా రన్ అవుతుంది.
దేవాంశ్, అనిరుధ్‌లు వారి అమాయకమైన నటన, ఎమోషన్స్‌తో హృదయాలను ఆకట్టుకున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత అద్భుతంగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి రియలిస్టిక్, నేచురల్‌గా సన్నివేశాలను తెరకెక్కించిన తీరు చక్కటి విజువల్ అప్పియరెన్స్‌నిచ్చింది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు.
వైవిధ్యమైన పాత్రల మధ్య ఉండే భావోద్వేగాల ప్రయాణంగా చిత్రీకరించిన ప్రేమ విమానం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. చక్కటి కథ, కథనం ఉంటే బడ్జెట్, స్కేల్‌తో సంబంధం లేకుండా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందనే విషయాన్ని ప్రేమ విమానం సినిమా రుజువు చేసింది. జీ 5 ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింది. జీ5లో ఈ చిత్రం విడుదలవగానే సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. 150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను రాబట్టకుని ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
క్వాలిటీ కంటెంట్‌ను అందించటానికి జీ 5 ఎప్పుడూ ముందుంటుంది. ఈ కోవలో పలు ఒరిజినల్స్‌ను ఈ సంస్థ ప్రేక్షకులకు అందించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి రెక్కి, హల్ వరల్డ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఏటీఎం, మా నీళ్ల ట్యాంక్, మాయాబజార్ ఫర్ సేల్ లతో పాటు పులి మేక, వ్యవస్థ వంటి సిరీస్‌లను కూడా జీ 5 అందించింది. తిరుగులేని ఎంటర్టైన్మెంట్, ఎక్స్‌పీరియెన్స్‌ని అందిస్తూ జీ 5 తన పోర్ట్ ఫొలియోను రోజు రోజుకి బలంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. .
ఇంకా మనోజ్ బాజ్‌పాయ్ నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై సిరీస్‌ను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ZEE5 స్ట్రీమింగ్ ల్యాండ్‌స్కేప్‌లో ముందంజలో ఉంది, విభిన్నమైన మరియు అధికనాణ్యత కంటెంట్‌కు ప్రాధాన్యతన ఇస్తూ దాన్ని పటిష్టం చేస్తుంది. రాబోయే రోజుల్లో జీ 5 తన ప్రేక్షకులకు మరింత ఆకర్షణీయమైన ఒరిజినల్స్‌ను తీసుకురావడానికి ఎదురు చూస్తున్నంది. అందువల్ల ఇది డిజిటల్ ఎంటర్టైన్మెంట్ యొక్క భవిష్యత్తును రూపొందిస్తూనే ఉంది.