Reading Time: < 1 min

రామన్న యూత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 11

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అతిథిగా ఈ నెల 11న రామన్న యూత్ ప్రీ రిలీజ్ ఈవెంట్

టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా రామన్న యూత్. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. రామన్న యూత్ సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 11న సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ఫంక్షన్ కు అతిథిగా హాజరుకానున్నారు.

రామన్న యూత్ సినిమా నుంచి రీసెంట్ గా హీరో సిద్ధార్థ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బలగం వంటి సహజమైన మన నేటివ్ కథలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రామన్న యూత్ సినిమా కూడా ఆకట్టుకుంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 15న రామన్న యూత్ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు :

అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు.

సాంకేతిక నిపుణులు :

ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్
సంగీతం – కమ్రాన్
సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్
రచన దర్శకత్వం – అభయ్ నవీన్