Reading Time: 2 mins

రావే నా చెలియా లోగో లాంచ్

రాజ్ కందుకూరి చేతుల మీదుగా  ‘రావే నా చెలియా’ లోగో లాంచ్

సూర్య చంద్ర ప్రొడక్షన్ లో నెమలి సురేశ్ సమర్పణలో నెమలి అనీల్, నెమలి శ్రవణ్ నిర్మాతలు గా నెమలి అనిల్, సుబాంగి పంథ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రావే నా చెలియ’. ఎన్. మహేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమవేడుక శుక్రవారం జరుపుకుంది. ఈ లోగో ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమాల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా చేరింది. రావే నా చెలియ అనే టైటిలే అట్ట్రాక్టివ్ గా ఉంది. కంటెంట్ కూడా బాగుంటుందనె అనుకుంటున్నా.. కథలో కంటెంట్ ఉంటే తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎంటైర్ టీమ్ కు నా బెస్ట్ విషస్ టెలియచెస్థున్నా అన్నారు. హీరో నెమలి అనిల్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా.. మా బ్యానర్ కూడా  మొదటిధే .. మా నాన్న,బాబాయి ఇద్దరూ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించి ఎంతో నమ్మకంతో సపోర్ట్ చేశారు. టీమ్ అందరం కూడా కష్టపడి ప్రాణం పెట్టి సినిమా చెసాము. చిన్న సినిమా అయినా మంచి సినిమా కనుక ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. నిర్వాహకుడు నెమలి సురేశ్ మాట్లాడుతూ..సబ్జెక్ట్ బాగుంటే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని తెలుసు.. అందుకే మంచి కథతో వస్తున్నాం.. నచ్చి తీరుతుందని భావిస్తున్నాం అన్నారు. దర్శకుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ విరాజ్ వలనే ఈ సినిమా మొదలైంది. నిర్మాతలు,మరియు హీరో అనిల్ కూడా నన్ను చాలా నమ్మి సపొర్ట్ చేశారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము      చెయనని ఈ సందర్బంగా తెలియ చేస్తున్నా.. ఈ సినిమా కు కెమెరా వర్క్ చాలా బాగొచ్చింది.. డిఫరెంట్ లవ్ స్టోరీ తో వస్తున్నాం ఆదరించండి అని తెలిపారు.                   

 శ్రవణ్, రవి ఎన్. విరాజ్,సుబాంగి,విజయ్ దగ్గుబాటి,    ఎమ్ ఎమ్. కుమార్,కృష్ణ మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.                                   

నెమలి అనిల్,సుబాంగి,విరాజ్,కవిత,రచ్చ రవి,రోలర్ రఘు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎమ్ ఎమ్ కుమార్,కెమెరా: విజయ్ దగ్గుబాటి,ఎడిటర్: రవి మాన్ల,డాన్స్: త్రిపాల్, నిర్మాతలు: నెమలి అనిల్, నెమలి శ్రవణ్,         

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎన్. మహేశ్వర రెడ్డి.