రిపబ్లిక్ ట్రైలర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయితేజ్, దేవ కట్టా ‘రిపబ్లిక్’ ట్రైలర్
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బుధవారం ‘రిపబ్లిక్’ ట్రైలర్ విడుదలైంది. సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ను దేవ కట్టా డైరెక్ట్ చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు.
సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా…
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘సాయిధరమ్ తేజ్ ఆ భగవంతుడు దీవెనలతో, ప్రేక్షకాభిమానులందరి ఆశీస్సులతో హాస్పిటల్‌లో త్వరగా కోలుకుంటున్నాడు. తను హీరోగా చేసిన రిపబ్లిక్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం కాస్త ఎమోషనల్, హెవీగా అనిపిస్తుంది. త్వరలోనే సాయితేజ్ మన మధ్యకు వస్తాడు. ఇక దేవ కట్టాగారు డైరెక్షన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. చూస్తుంటే నాకు గూజ్‌బంప్స్ వస్తున్నాయి. ఓ యంగ్ కలెక్టర్ రౌడీయిజాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయడం, ప్రజలకు ఎలాంటి రాజకీయ వ్యవస్థను ఎన్నుకోవాలో తెలియజేప్పే ప్రయత్నం చూస్తుంటే అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్న సినిమాలా అనిపిస్తుంది. సబ్జెక్ట్ విషయంలో దేవ కట్టాగారి నిజాయతీ సుస్పష్టంగా తెలుస్తుంది. సాయితేజ్ డైనమిక్‌గా, సెటిల్డ్‌గా కనిపిస్తున్నాడు. కమర్షియల్‌గా సినిమా అందరినీ మెప్పిస్తుందని అర్థమవుతుంది. ఇలా హానెస్ట్ సినిమాకు నిర్మాతలు పుల్లారావుగారు, భగవాన్‌గారు కూడా పూర్తి సహకారం అందించారు. వ్యాపారత్మకంగానే కాదు, వినోదాత్మకంగానే కాదు, అందరినీ అలరించే ఎడ్యుకేటివ్ మూవీగా వారు రిపబ్లిక్‌ను అందరినీ అలరించేలా రూపొందించి మన ముందుకు తీసుకువస్తున్నారు. నిర్మాతల ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజలు, ప్రేక్షకులు కూడా వారి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఆలోచన రేకెత్తించే ఇలాంటి సినిమాలు రావాలి. ఓటర్స్‌లో ఓ రెవల్యూషన్ రావాలని యూనిట్ చేసిన ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. రిపబ్లిక్ ట్రైలర్‌ను విడుదల చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. జీ తరపున ఇలాంటి సినిమాకు బ్యాకింగ్‌గా నిలబడ్డ నా చిరకాల మిత్రుడు ప్రసాద్‌గారికి థాంక్స్. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్’’ అన్నారు.
ట్రైలర్ విషయానికి వస్తే…
‘సమాజంలో తిరగడానికి అర్హతే లేని గూండాలు పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్లకి కొమ్ముకాస్తున్నాయి’ అంటూ సాయితేజ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్, సంబంధించిన సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభమైంది.
‘‘ఆ రాక్షసులు ప్రపంచం అంతటా ఉన్నార్రా, కానీ వాళ్లని ఈ వ్యవస్థ పోషిస్తుందా.. శిక్షిస్తుందా?’’ అన్నదే తేడా అని జగపతిబాబు చెప్పే ఎమోషనల్ డైలాగ్
‘‘జిల్లాకు సుప్రీమ్ అథారిటీ కలెక్టర్.. నేను ఆ సుప్రీమ్ అథారిటినీ’’ అని సాయితేజ్ తన క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని ట్రైలర్‌లోనే రివీల్ చేశారు.
‘‘రాజ్యాంగం ప్రకారం చట్ట సభల ఆదేశాల మేరకే ఉద్యోగస్థలు పనిచేయాలనే విషయం మరచిపోయినట్లున్నావ్’’ అని రాజకీయ నాయకురాలైన రమ్యకృష్ణ, సాయితేజ్‌ను ఉద్దేశించి అంటే,
‘‘అదే రాజ్యాంగం ప్రకారం చట్టసభల ఆదేశాలు మారణహోమానికి దారి తీస్తే, ఉద్యోగస్థులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.. ఫాలో అయితే మీలాంటోళ్లు హిటర్లవుతారు’’ అంటూ సాయితేజ రివర్స్ కౌంటర్ ఇచ్చే డైలాగ్‌తోనే సినిమా ప్రధానాంశం ఏంటో క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది.
‘‘మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగు కాళ్లు’’
‘‘అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్డు పెడుతుంది’’ వంటి కొన్ని డైలాగ్స్ ట్రైలర్ మధ్య మధ్యలో టెంపోని క్యారీ చేశాయి.
గాడి తప్పిన లేజిస్లేటివ్ గుర్రాన్ని ఈరోజు ఎదిరించి ప్రశ్నిస్తోంది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ.. న్యాయవ్యవస్థ కూడా తన కాళ్ల మీద నుంచోని ఆ గుర్రానికి కళ్లమయినప్పుడే ఇది అసలైన రిపబ్లిక్
అని ట్రైలర్ చివర్లో టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చేలా సాయితేజ్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది.
హీరో సాయితేజ్, హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్, కీలక పాత్రల్లో నటించిన జగపతిబాబు, రమ్యకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, నాజర్ తదితరుల్ని ట్రైలర్‌ను చూడొచ్చు.
రాజకీయ నాయకులు వారు కొమ్ము కాచే గూండాలకు, నిజాయతీకి మారు పేరైన ఓ యువ కలెక్టర్‌కు జరిగే పోరాటమే రిపబ్లిక్ సినిమా అని స్పష్టంగా తెలియజేసేలా ట్రైలర్ ట్రెమెండెస్‌గా ఉంది.
మణిశర్మ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి.
నటీనటులు:
సాయితేజ్
ఐశ్వర్యా రాజేశ్
జగపతిబాబు
రమ్యకృష్ణ
సుబ్బరాజు
రాహుల్ రామకృష్ణ
బాక్సర్ దిన
సాంకేతిక వర్గం:
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, జీస్టూడియోస్, జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్
కథ, మాటలు, దర్శకత్వం: దేవ కట్టా
స్క్రీన్‌ప్లే: దేవ కట్టా, కిరణ్ జయ్ కుమార్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
మ్యూజిక్: మణిశర్మ
ఎడిటర్: కె.ఎల్.ప్రవీణ్