రిలీజ్ కి సిద్దమవుతున్న నేనేనా చిత్రం
జూలై చివరి వారంలో రిలీజ్ కి సిద్దమవుతున్న రెజీనా నేనేనా చిత్రం.
2012లో రిలీజైన ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా . తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ముఖ్యంగా రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి పేరును సాధించుకుంది.
రెజీనా ప్రస్తుతం ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో సూర్పనగై అనే సినిమాను చేస్తుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు.
అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం. ఈ నెల చివరివారంలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది.