రుద్రవీణ చిత్రం ప్రి లుక్ పోస్టర్ విడుదల

Published On: May 14, 2022   |   Posted By:

రుద్రవీణ చిత్రం ప్రి లుక్ పోస్టర్ విడుదల

యమ్.యల్.ఏ కంచర్ల భూపాల్ రెడ్డి చేతులమీదుగా విడుదలైన “రుద్రవీణ” ప్రి లుక్ పోస్టర్

ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘రుద్రవీణ’.రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “రుద్రవీణ’.

ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ చిత్రం ప్రి లుక్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి నల్గొండ యమ్.యల్.ఏ కంచర్ల భూపాల్ రెడ్డి గారు,తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా లు ముఖ్య అతిధులుగా వచ్చి “రుద్ర వీణ” ప్రి లుక్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.

అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

యమ్.యల్.ఏ కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. “రుద్రవీణ” ప్రి లుక్ చాలా బాగుంది.ఆనాడు సాఫ్ట్ గా చేసిన “రుద్ర వీణ” ఎంత హిట్ అయ్యిందో.. ఇప్పుడు రౌద్రం తో వచ్చే “రుద్రవీణ” కూడా అంతే పెద్ద సక్సెస్ కావాలి. తెలంగాణ లో ఉన్న దర్శకులు మంచి సినిము తీసి సక్సెస్ అయితేనే తెలంగాణ తెచ్చుకున్న దానికి అర్థం. చిన్న దర్శక, నిర్మాతలే రేపు పెద్ద దర్శక,నిర్మాతలు అవుతారు. రాజమౌళి కూడా ఒకప్పుడు చిన్న దర్శకుడే మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని కథలో న్యాచురాలిటీతో ముందుకు వెళితే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే రుద్రవీణ పెద్ద సినిమాలకు దీటుగా ఈ సినిమా గొప్ప విజయం సాధించి ఎంతో ప్రేక్షకాదరణ పొందుతారు.

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. రుద్రవీణ అనగానే అందరికీ మెగాస్టార్ చిరంజీవి సినిమా గుర్తుకు వస్తుంది. అయితే రుద్రవీణ అంటే అందరూ మ్యూజికల్ సినిమా అనుకుంటారు. కానీ ఇందులో ఫుల్ ఫైట్స్ తో రివెంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా 100 డేస్ ఆడాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమాను తెలంగాణ ప్రజలే కాక ఆంద్రప్రదేశ్ ప్రజలు కూడా ఆశీర్వదించాలి.పెద్ద దర్శకులను, పెద్ద సినిమాలనే కాకుండా చిన్న సినిమాలను కూడా మనమంతా ఎంకరేజ్ చెయ్యాలి. కె.సి.ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత సినీ ఫీల్డ్ కు మంచి రోజులు వచ్చాయి.అయితే ఈ రాష్ట్రం లో ఇంకా థియేటర్స్ వ్యవస్థ కూడా ముగ్గురు చేతుల్లోనే ఉన్నది.ఆ వ్యవస్థ మారాలి.కరోనా దేశంలో వుండే చిత్ర పరిశ్రమ ఎంతో ఇబ్బంది పడ్డా తెలుగు పరిశ్రమ మాత్రం ఓటిటి ద్వారా కావచ్చు,ఆహా ద్వారా కావచ్చు అలాగే కరోనా తర్వాత టికెట్ రేట్లు కూడా పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ ఇలా అన్ని విధాలుగా మన ప్రభుత్వం అండగా నిలబడింది.అలాగే షూటింగ్స్ కొరకు తెలంగాణ లో కూడా లక్కవరం, సోమశిల, యాదాద్రి, కాళేశ్వరం రిజర్వాయర్స్,లెక్స్, ఇలా అనేకమైన మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయని తెలియజేస్తూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ వచ్చిన తరువాత తెలంగాణ నుండి నిర్మాతలు ముందుకు వచ్చి మంచి సినిమాలు తీస్తున్నారు.ఈ మధ్య ప్రపంచమే తెలుగు సినిమా వైపు చూస్తోంది.ఎందుకంటే తెలుగులో మంచి దర్శకులు, నటులు వున్నారు.అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయిన “రుద్రవీణ” టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ..ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్. రుద్రవీణ కు నాకు ఒక చిన్న లింక్ ఉంది. నాకు చినప్పటినుండి చిరంజీవి అంటే ఎంతో ఇష్టం.పక్కన 175 డేస్ సినిమాలు వున్నా చూసే వాన్ని కాదు.మారుమూల గ్రామంలో వుండే నేను గత 30 సంవత్సరాల నుండి సినిమా తీయాలని ఉండేది.దానికోసం నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను.అయినా కూడా నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ గా నిలిచారు.వారందరికి ధన్యవాదాలు. అలాగే మెగాస్టార్ కు కూడా థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు రుద్రవీణ టైటిల్ వచ్చినందుకు. చిరంజీవి అంటే నాకు ఎంతో సెంటిమెంట్. అందుకే నా మొదటి సినిమాను ఆయన నటించిన “రుద్రవీణ” టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను.ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా మెచ్చుకుంటారు. ఈ సినిమాకు నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ ఎంతో సపోర్ట్ చేశారు అని అన్నారు.

చిత్ర దర్శకుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ..ఇక్కడకు పెద్దలందరికీ ధన్యవాదాలు.ఇది నా రెండవ సినిమా చిరంజీవి గారి రుద్రవీణ సినిమా వచ్చినపుఫు నేను పుట్టాను.ఈ చిత్రాన్ని టివి లో చూస్తున్నపుడు నాకు బాగా కనెక్ట్ అయ్యింది.దాంతో రుద్రవీణ టైటిల్ తో డీఫ్రెంట్ గా మంచి యాక్షన్ సినిమా తీయాలని ఈ కథ రాయడం జరిగింది.ఇందులో రఘు గారు,చంటి, హీరో,హీరోయిన్ ఇలా అందరూ చాలా చక్కగా నటించారు. జి ఎల్ బాబు గారు తన కెమెరా పనితనంతో ఈ కథకు చాలా న్యాయం చేశాడు.తరువాత నేను ఏ సినిమా తీసిన బాబన్న నే కెమెరామెన్ గా పెట్టుకుంటా. ఇందులో బంగారు బొమ్మ అను పాటకు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువైనా ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు లక్ష్మణ్ గారు చిత్ర యూనిట్ అంతా సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది.అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

ఈ సినిమాలో విలన్ గా నటించిన రఘు కుంచే మాట్లాడుతూ.. పలాస సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన తరువాత నాకు విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి.ఈ సినిమాకు చాలా మంది ఆర్టిస్టులు పనిచేశారు. చక్కటి కథను సెలెక్ట్ చేసుకుని సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు దర్శకుడు. నిర్మాత ఖర్చుకు వెనుకడకుండా అద్భుతంగా నిర్మించారు.ఫుల్ ప్యాకేజ్డ్ గా వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా చిన్న సైజు అఖండ లా అద్భుతంగా తీశారు. యాక్షన్ కూడా ఇందులో భారీగా ఉంటుంది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. పాటలు, సినిమా చాలా బాగా వచ్చాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు

లైన్ ప్రొడ్యూసర్ శ్రీను మాట్లాడుతూ.. మా యూనిట్ అంతా ఎంతో కష్టపడి వర్క్ చేసిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అన్నారు

కమెడియన్ చలాకీ చంటి మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ వినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరో శ్రీరామ్ నిమ్మల మాట్లాడుతూ..ఈ కథ చాలా బాగుంది.ఈ సినిమా ద్వారా నటుడుగా మంచి గుర్తింపును తీసుకువస్తుంది. రఘు కుంచే గారు, చలాకీ చంటి గారు అద్భుతంగా నటించారు.జి ఎల్ బాబు ,నాగేశ్వర్రెడ్డి, వంటి టెక్నీషియన్స్ అద్భుతంగా వర్క్ చేశారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ శుభశ్రీ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి నన్ను లుక్ టెస్ట్ చేసి హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. నటిగా నేను కొత్త అయినా చిత్ర యూనిట్ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు రుద్రవీణ వంటి మంచి వినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు

మహావీర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పాటలు చాలా బాగా వచ్చాయి.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

రాంబాబు గోశాల మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రఘు కుంచే గారు నాతో పాట రాయించడం జరిగింది. అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పుడు 100 పాటలు పూర్తి చేసుకున్నాను. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు
శ్రీరామ్ నిమ్మల,ఎల్సా, శుభశ్రీ , రఘు కుంచే (విలన్) చలాకి చంటి,సోనియా, రమణారెడ్డి తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత : లక్ష్మణ రావు రాగుల,
డైరెక్టర్ : మధుసూదన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్ : శ్రీను రాగుల
మ్యూజిక్ డైరెక్టర్ : మహావీర్
డి ఓ పి : జి ఎల్ బాబు
ఎడిటర్ : నాగేశ్వర్ రెడ్డ్
ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్
కొరియోగ్రాఫర్ : మోహిన్,పైడిరాజు
ఆర్ట్ : గిరి