Reading Time: < 1 min

రేచెల్ మూవీ టీజర్ విడుదల

ఏ వైలెంట్ టేల్ అఫ్ బ్లడ్ షెడ్: హనీ రోజ్ రేచెల్ తెలుగు టీజర్ రిలీజ్

హనీ రోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న రేచెల్ టీజర్ విడుదలైంది. వైలెన్స్, బ్లడ్ షెడ్ తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్‌ హిట్ ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా , సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు. యాక్టింగ్ ఫీల్డ్ లో హనీ రోజ్‌కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్‌ చూస్తే అర్ధమౌతోంది.

ఈ చిత్రంలో బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టిల్, జోజి, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు. రాహుల్ మణప్పట్టు కథను అందించగా, స్క్రీన్ ప్లే రాహుల్ మణప్పట్టు, అబ్రిడ్ షైన్ అందించారు.

తారాగణం :

హనీ రోజ్, బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టి, జోజీ, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్

టెక్నికల్ టీం :

దర్శకత్వం: ఆనందిని బాల
నిర్మాతలు: బాదుషా ఎన్ ఎం, రాజన్ చిరాయిల్, బ్రిడ్ షైన్
డీవోపీ: స్వరూప్ ఫిలిప్
మ్యూజిక్ & బీజీఎం: ఇషాన్ ఛబ్రా
ఎడిటర్: మనోజ్