రొరి చిత్రం మొదటి లుక్ విడుదల
భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ సినిమా తో అందరికి సుపరిచితుడైన చరణ్ హీరోగా కరిష్మా హీరోయిన్ గా చరణ్ రొరి దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈచిత్రం లో లెజెండ్ కొటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ లాంటి ప్యాడింగ్ నటీనటులతో అత్యంత భారీగా తెరకెక్కించారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు నిర్మాత హీరో చరణ్ రోరి పుట్టినరోజు సందర్బంగా చిత్రం మొదటి లుక్ ని క్రేజి దర్శకుడు మారుతి గారు విడుదల చేసారు. మారుతి గారికి చిత్ర యూనిట్ అంతా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా చరణ్ రోరి మాట్లాడుతూ.. ఈ చిత్రం మోదటిలుక్ ని మా శ్రేయాభిలాషులు క్రేజి దర్శకుడు మారుతి గారు విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్ర కథ విషయానికోస్తే హైదరాబాద్ పోలిటికల్ బ్యాక్ డ్రాప్ ఓ జరిగే కుర్రాడి కధ, అనుకోని పరిస్థుతుల్లో ఆ కుర్రాడు పాకిస్థాన్ ని వెళ్ళాల్సివచ్చింది, అక్కడ కొంతమంది హిందువులని కలిసి వారి కష్టాలు తెలుసుకుని వారితో ఇండియాకి క్షేమంగా వచ్చాడా లేదా అనేది ఈ చిత్ర కథ, ఈ చిత్ర కథనం ఆద్యంతం ఉత్కంఠ భరితం గా వుంటుంది. త్వరలో టీజర్ ని ట్రైలర్ ని విడుదల చేస్తాము అని అన్నారు.
నటీనటులు..
చరణ్ రొరి, కరిష్మా, కొటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్, కాదంబరి కిరణ్కుమార్, సూర్య, ముఖ్తార్ఖాన్, బ్యాంక్ సూర్య, చరణ్దీప్, ఫణికాంత్, వేణుగోపాల్, ప్రసన్న, రవిప్రకాష్,ఆలీ రెజా, సమ్మెట గాంధి, రాజశేఖర్ తదితరులు
సాంకేతికనిపుణులు..
మ్యూజిక్.. భీమ్స్ సెసిరొలియో
ఫోటోగ్రఫి.. ధాశరది శివేంద్ర
ఎడిటర్.. కార్తిక్ శ్రీనివాస్
ఆర్ట్.. హరిక పొట్ట
నిర్మాత, దర్శకత్వం.. చరణ్ రోరి