రౌడీభాయ్ చిత్రం ట్రైలర్ విడుదల
మానస్, షిప్రా కౌర్ జంటగా ఉదయ్‌భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీభాయ్’. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారామణ నిర్మాత. ఇటీవల ఆయన నిర్మించిన ‘రహస్యం’ చిత్రం మూడువారాలు విజయవంతంగా ఆడిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రాల నిర్మాతల్లో తక్కువ బడ్జెట్ సినిమా తీసి మార్కెట్ చేసుకోగలిగే సత్తా ఉన్న నిర్మాతల్లో రామసత్యనారాయణ మొదటివరుసలో ఉంటారు. ఆయన ఎంచుకునే కథాంశాలు కూడా వినూత్నంగా ఉంటాయనడానికి ఆయన తీసిన సినిమాలే ఓ ఉదాహరణ.
ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘రౌడీభాయ్’ సినిమా ట్రైలర్‌ను హాస్య చిత్రాల దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ ‘‘రామసత్యనారాయణ నాకు చిరకాల మిత్రుడు. సినిమా నిర్మాణంలో ఆయన పక్కా ప్లాన్‌గా ఉంటారు. ఈ ట్రైలర్ నచ్చింది. టీమ్‌కి శుభాకాంక్షలు’’ అని అన్నారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘నా నిర్మాణంలో వస్తున్న 97వ చిత్రమిది. ప్రేక్షకుల నాడిని బట్టి కథాంశాలు ఎంచుకోవడమే నా సక్సెస్‌కి కారణం. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. మా బ్యానర్‌లో మరో మంచి సినిమా అవుతుంది. యూత్‌ఫుల్ ఆర్టిస్ట్‌గా పేరుపొందిన మానస్ హీరోగా చక్కని పాత్ర పోషించారు. ఫిఫ్రా చక్కని నటనతో గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది’’అని చెప్పారు.”