రౌడీ బాయ్స్ మూవీ హీరో ఆశిష్ ఫస్ట్‌లుక్ విడుదల
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి ‘రౌడీ బాయ్స్’తో ఎంట్రీ ఇస్తున్న హీరో ఆశిష్.. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల
దిల్‌రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’.
తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు).
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేయగా, మోషన్ పోస్టర్‌ను మాస్టర్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్‌గా పిలుచుకునే డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు.
ఈ సందర్బంగా…
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఈరోజు చాలా ఎగ్జయిట్‌మెంట్‌గా ఉంది. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మాకు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్. ఈ జర్నీలో ఎన్నో అనుభూతులున్నాయి. ఇప్పుడు 50వ సినిమా చేస్తున్నాం. నేను వినాయక్ కంటే ముందు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న సమయంలో ఆది సినిమాను పంపిణీ చేస్తున్నాను. ఆ సమయంలో వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు. నిర్మాత కావాలని అనుకుంటున్న సమయంలో వినాయక్ తన తొలి సినిమాను మా బ్యానర్లో చేసి రాజును కాస్త దిల్‌రాజుగా మార్చేశాడు. ఆ క్రెడిట్ వినాయక్‌కి మాత్రమే దక్కుతుంది. సినిమా తీయడమే కాదు.. స్క్రిప్ట్‌ను ఎలా తయారు చేయాలనేది వైజాగ్‌లో మాట్లాడుకున్నాం. ఆ జర్నీ ఓ బ్యూటీఫుల్. దిల్‌తో నిర్మాతగా సక్సెస్ కావడమే కాదుఓ సినిమాను ఎలా తీయాలనేది కూడా నేర్చుకున్నాను. ఈరోజు మేం ఎంత సాధించినా నువ్వు మొదలు పెట్టిన దిల్ నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తుంది. మేం ఇతర భాషల్లో సినిమాలు చేస్తామని, మా ఆశిష్ హీరో అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు. టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్, ఇటు కోలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్నాం. ఈ జర్నీ ఓ అద్భుతం. ఎంతో మంది కొత్త దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, శ్రీకాంత్, భాస్కర్, వాసు వంటి వారిని పరిచయం చేశాం. ఇంకా ఐదారుగురు కొత్త దర్శకులు స్క్రిప్ట్ వర్క్‌లో ఉన్నారు. ప్రొడక్షన్ హౌస్‌గానే కాదు.. డిస్ట్రిబ్యూటర్స్‌గా, ఎగ్జిబిటర్స్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణించడం గొప్ప జర్నీ. మా ఇంట్లో నుంచి ఆశిష్ హీరో అవుతాడని అనుకోలేదు. అయితే తనలో ఓ ఫైర్ ఉండేది. అది చూసినప్పుడు హీరో అవుతావా అని అడిగేవాళ్లం. తనలో ఆ కోరిక ఉండిందో, లేక మేం ఎప్పుడూ సినిమాల గురించి మాట్లాడుకునే వాతావరణం వల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందో తెలియదు. అయితే, మా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో తను డాన్స్, ఎనర్జీ చూసి తనకు ఇంట్రెస్ట్ ఉందనిపించింది. గత మూడేళ్లుగా తను శిక్షణ తీసుకున్నాడు. యు.ఎస్, బాంబే, వైజాగ్‌లో ట్రైనప్ అయ్యాడు. సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలని చాలా మందికి కోరిక ఉంటుంది. వస్తారు కూడా. అయితే ఎంత మంది సక్సెస్ అవుతారనేది నేను ఈ ఇరవై ఏళ్ల జర్నీలో నేను దగ్గర్నుంచి చూశాను. అదంత సులభం కాదు. మా బ్యానర్ ఉంది. కథలను మేం విని ఓకే చేస్తాం. అయితే వీటన్నింటికీ మించి ప్రేక్షకులున్నారు. ప్రేక్షకులు ఓ సినిమాను చూసి ఇంప్రెస్ అయ్యి, కనెక్ట్ అయితేనే లాంగ్ రన్ ఉంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లు అదంత సులభం కాదు. ఆశిష్‌కు అది చాలా పెద్ద టార్గెట్. తొలిసినిమాతో తనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆసక్తి నాకు కూడా ఉంది. ప్రేక్షకులు పాస్ మార్కులు వేసే వరకు టెన్షన్ ఉంటుంది. ఉండాల్సిందే. ప్రతి సినిమాకు టెన్షన్ పడతాం. ఈ సినిమాకు ఎక్కువ టెన్షన్ పడుతున్నాం. ఆశిష్‌కు.. హీరో కావాలనుకున్నప్పటి నుంచి నువ్వు హీరోగా సక్సెస్ అవ్వొచ్చు.. కాకపోవచ్చు. కాకపోతే ఆల్టర్ నేటివ్‌గా మరోటి సిద్ధంగా పెట్టుకోవాలని చెబుతూ వస్తున్నాను. అయితే తను సక్సెస్ అవుతాడని చాలా గట్టి నమ్మకం ఉంది. రౌడీ బాయ్స్ సినిమా విషయానికి వస్తే.. ఓ హీరోను ఇంట్రడ్యూస్ చేయాలంటే ఔట్ అండ్ ఔట్ యూత్ మూవీ కావాలి. ప్రెజెంట్ యూత్ ఆడియెన్స్ ఎలాంటి సినిమాను కోరుకుంటున్నారో, అలాంటి సినిమా ఇది. డైరెక్టర్ హర్ష ఈ సినిమా కథను అలా ప్రిపేర్ చేశాడు. హుషారు తర్వాత హర్ష నన్ను కలిసినప్పుడు ఔట్ అండ్ ఔట్ యూత్ కంటెంట్ కావాలని అడిగాను. అప్పుడు తను ఈ పాయింట్ చెప్పి.. కథను డెవలప్ చేస్తూ వచ్చాడు. సినిమా దాదాపు పూర్తయ్యింది. అక్టోబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. హర్ష సినిమాను బాగా తీశాడు. సినిమా గురించి ఇప్పుడే ఎక్కువగా చెప్పను. దేవిశ్రీప్రసాద్, మది వంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. అక్టోబర్ నెల కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నాం. సక్సెస్ఫుల్ సినిమా తీశానని ప్రొడ్యూసర్‌గా నమ్ముతున్నాను. మా బ్యానర్లో శతమానం భవతి, హలో గురూ ప్రేమకోసమే సినిమాలు చేసిన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. లగడపాటి శ్రీధర్‌గారి అబ్బాయి విక్రమ్ దీంట్లో ఆశిష్‌కి అపోజిట్ రోల్ చేశాడు. అందరూ చక్కగా చేశారు’’ అన్నారు.
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘‘దిల్‌రాజుగారు మాట్లాడుతూ ఆశిష్ సక్సెస్ కాకపోతే మరో ఆల్టర్ నేటివ్ అదీ ఇదీ అన్నారు. కానీ ఆశిష్‌కు అవేం అక్కర్లేదు. తను సినిమాల్లోనే ఉండాలి. పెద్దగా హీరో కావాలి. ఆశిష్ చిన్నప్పుడు ముద్దుగా, బొద్దుగా ఉండి అందరినీ ఎలా ఎట్రాక్ట్ చేశాడో.. అలాగే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులందరినీ ఎట్రాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రాజన్న నాకు సినిమా కథేంటో చెప్పాడు. కొన్ని సీన్స్ కూడా చూశాను. తను చాలా బాగా చేశాడు. నాకెంతో ఇష్టమైన లగడపాటి శ్రీధర్‌గారి అబ్బాయి కూడా ఇందులో చేశాడు. తనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే హృరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చాలా బాగా చేసింది. డైరెక్టర్ హర్ష సహా ఈ సినిమాకు పనిచేసిన అందరికీ అభినందనలు. శిరీషన్న ఓ తండ్రిగా.. గర్వంగా ఫీల్ అవుతాడు. ఆశిష్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
మాస్టర్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ సుకుమార్ మాట్లాడుతూ ‘‘దిల్‌రాజుగారు చెప్పినట్లు నాకు వి.వి.వినాయక్‌గారు సినిమా గురువు. లెక్కలు టీచింగ్ చేసే నేను ఆది సినిమాను చూసి షాట్ డివిజన్ ఎలా చేయాలి, ఏం చేఆయలని నేర్చుకున్నాను. ఆర్య సినిమా చేయడానికి అదే కారణం. దిల్ సినిమా సమయంలో నేను వినాయక్‌గారి క్రియేటివిటీని చాలా దగ్గర నుంచి చూశాను. వినాయక్‌గారి నెరేషన్ విని, రాజుగారికి కథ చెప్పాను. అలాగే నాకొక బాస్ దిల్‌రాజుగారు. కొత్త డైరెక్టర్‌తో సినిమా చేయాలనే సాహసం ఆయన చేసుకుండకపోతే నేనిక్కడ ఉండేవాడిని కాదు. ఆయనకు ఈ విషయంలో నేనెప్పటికీ రుణపడి ఉంటాను. మొన్న ఈ సినిమా సాంగ్‌ను చూపించి ఇది ఆశిష్ అని చెబితే, నాకు నమ్మకం కలగలేదు. ఇండస్ట్రీకి ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్‌ను పరిచయం చేసిన ఈ సంస్థ నుంచి పరిచయం అవుతున్న శిరీశ్గారి అబ్బాయి పెద్ద సక్సెస్ కావాలని, సూపర్బ్ హీరో కావాలని కోరుకుంటున్నాను. తను చాలా సింపుల్‌గా కొత్త హీరో చూస్తున్నాడనే ఫీలింగ్‌తో కాకుండా చక్కగా చేశాడు. విక్రమ్, అనుపమకి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘‘నా ఫస్ట్ మూవీ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన వినాయక్‌గారికి, సుకుమార్‌గారికి థాంక్స్. అలాగే దిల్‌రాజు బాబాయ్, నాన్న(నిర్మాత శిరీష్)కు థాంక్స్. మా ఫ్యామిలీలో నేను హీరో కావాలని అనుకున్న మొదటి వ్యక్తి మా అనిత అంటీ.. కానీ ఆమె ఈరోజు ఇక్కడ లేరు. ఆమెను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం నా బాధ్యత. అలాగే మా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఎప్పటికీ మరచిపోలేను. నా ఫ్యామిలీ అందించిన సపోర్ట్ వల్లనే ఇక్కడున్నాను. అలాగే డైరెక్టర్ హర్ష నాతో మంచి సినిమా చేశాడు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అన్నారు.
డైరెక్టర్ శ్రీహర్ష కొనుగంటి మాట్లాడుతూ ‘‘మనం కాలేజీ జాయిన్ అయిన కొత్తలో మనలో తెలియని ఓ ఎనర్జీ ఉంటుంది. దాంట్లో మనకు తెలియకుండానే మనం రచ్చ చేస్తాం. ఈ సినిమాలోనూ అంతే మా బాయ్స్ చాలా రౌడీ పనులతో రచ్చ చేస్తారు. దాని వల్ల ఏం జరిగిందనేదే సినిమా. ఇండియాలోని టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. శిరీష్‌గారి అబ్బాయి ఆశిష్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత, అందరూ ఆశిష్గారి నాన్న శిరీష్‌గారు అంటారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్’’ అన్నారు.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ ‘‘నేను ఈ బ్యానర్లో చేసిన మూడో సినిమా ఇది. శతమానం భవతి సమయంలో నేను ఆశిష్‌ను కలిసినప్పుడు, ఇద్దరం మాట్లాడుకుంటుంటే తను హీరో అవుతానని అన్నాడు. కానీ తను హీరోగా చేసిన ఈ సినిమాలో నేను పార్ట్ అవుతానని అప్పుడు అస్సలు అనుకోలేదు. ఆశిష్‌కు ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్స్. డైరెక్టర్ హర్షకు థాంక్స్. దిల్‌రాజుగారికి, శిరీష్‌గారికి థాంక్స్’’ అన్నారు.