ర‌వితేజ‌ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జులై 1 నుండి ప్రారంభం

Published On: June 28, 2021   |   Posted By:

ర‌వితేజ‌ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జులై 1 నుండి ప్రారంభం

Image

జులై 1 నుండి హైద‌రాబాద్‌లో ప్రారంభంకానున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, శ‌ర‌త్ మండ‌వ‌, ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి ప్రొడ‌క్ష‌న్ నెం.4 రెగ్యుల‌ర్ షూటింగ్‌.

`క్రాక్` సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ హీరోగా శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో  ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌వితేజను ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో చూపించ‌బోతున్నారు  ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండ‌వ‌. ర‌వితేజ స‌ర‌స‌న దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జులై 1 నుండి హైద‌రాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్ట‌రీలో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో టీమ్ అంద‌రూ పాల్గొన‌నున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు శ‌ర‌త్‌ మండ‌వ మ‌న తెలుగు వారే.గతంలో వెంకటేష్, అజిత్, కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కు రచయితగా పనిచేశారు.

తారాగ‌ణం:

ర‌వితేజ‌, దివ్యాంశ కౌశిక్

సాంకేతిక నిపుణులుః

క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: శ‌ర‌త్ మండ‌వ‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
బ్యాన‌ర్‌: ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి
సంగీతం: స్యామ్ సీఎస్‌
సినిమాటోగ్ర‌ఫి: స‌త్య‌న్ సూర్య‌న్‌
ఆర్ట్: సాయి సురేష్‌
స్టిల్స్‌: సాయి రామ్ మాగంటి