లవ్ మీ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్
‘లవ్ మీ’ చాలా కొత్త ప్రయత్నం.. ‘రావాలిరా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు
టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలై మంచి స్పందనను దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి ‘రావాలి రా’ అనే పాటను శనివారం విడుదల చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఐదుగురు సింగర్లతో పాటు వైష్ణవి చేత కీరవాణి గారు ఈ పాటను పాడించారు. నేను కూడా ఇంతలా హమ్ చేశానంటే.. అందరూ ఈ పాటను హమ్ చేస్తూనే ఉంటారు. కీరవాణి గారు ఎంతో మెలోడియస్‌గా ట్యూన్ చేశారు. ఈ స్టోరీ విన్నప్పుడు ఓ కొత్త కథ విన్న ఫీలింగ్ అనిపించింది. చాలా ఎగ్జైటింగ్‌తో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అన్నీ కొత్త కథలు దొరకవు. కొన్ని సార్లు సేఫ్ గేమ్ ఆడుతుండాలి. ఇది చాలా కొత్త కథ అని మాత్రం నమ్ముతున్నాను. ప్రేక్షకులు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. సినిమా చూస్తున్నంత సేపు కూడా నెక్ట్స్ సీన్ ఏంటన్నది ఊహించలేరు. సినిమా అంతా అయ్యాకే ఆడియెన్స్‌కు అర్థం అవుతోంది. ఇది చాలా న్యూ అటెంప్ట్. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నారు. కొత్తగా ట్రై చేస్తేనే జనాలు యాక్సెప్ట్ చేశారని ఆశిష్‌కు సలహా ఇచ్చాను. ముందు నటుడిగా ఎదగమని సూచించాను. నా ఆలోచనను ఆశిష్ అర్థం చేసుకున్నారు. ఆశిష్ కోసం ఈ కథను అనుకోలేదు. నాగ, అరుణ్ కథ చెప్పాక.. ఆశిష్ అయితే ఎలా ఉంటుందో చూడండని చెప్పాను. ఓ వారం తరువాత వాళ్లే వచ్చి ఆశిష్ బాగుంటాడని అన్నారు. పీసీ శ్రీరామ్, కీరవాణి గారికి స్క్రిప్ట్ చెప్పి ఒప్పించారు. చాలా కొత్తగా ఉందని వారు అంగీకరించారు. బడ్జెట్ ఎంతో చెప్పండి.. ఆ బడ్జెట్లోనే తీస్తామని నాగ, అరుణ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇదో ఘోస్ట్ లవ్ స్టోరీ. సినిమాను ముందే కొంత మందికి చూపించాలని అనుకున్నాం. కానీ ట్విస్టులు రివీల్ అవుతాయని ముందుగా చూపించడం లేదు’ అని అన్నారు.
ఆశిష్ మాట్లాడుతూ.. ‘ఇంత వరకు ఎన్నో హారర్ కామెడీ చిత్రాలను చూశారు. ఇది డిఫరెంట్ జానర్. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ లవ్ స్టోరీ. ఇలాంటి కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టినా కూడా మా లాంటి కొత్త వారికి పక్కన వైష్ణవి నటించింది. మాకు ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన దిల్ రాజు గారికి థాంక్స్. ఏప్రిల్ 25న మా చిత్రం రాబోతోంది’ అని అన్నారు.
వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. ‘సెల్లార్‌లో అద్భుతమైన సెట్ వేసి ఈ పాటను షూట్ చేశారు. ఆ రోజు బ్యాక్ గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుంటే నాకు ఎంతో భయం వేసింది. ఇంత మంచి పాటను ఇచ్చిన చంద్రబోస్ గారికి థాంక్స్. ఏప్రిల్ 25న మేం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా సినిమాను థియేటర్లో చూడండి. మీ అభిప్రాయాన్ని చెప్పండిద. మీకు కచ్చితంగా ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది’ అని అన్నారు.
దర్శకుడు అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. ‘ఈ కథను నమ్మిన దిల్ రాజు గారికి థాంక్స్. ఇది నా సొంత కథే. ఘోస్ట్‌ని లవ్ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనతో ఈ సినిమా కథను రాయడం ప్రారంభించాను. నేను మూడు నవలలు రాశాను. ఈ కథను కూడా నావల్‌గా రాశాను. కానీ సినిమాగా తీశాను. ఇంత వరకు చేయని, రాయని పాత్రను ఆశిష్ పోషించాడు. ఆ కారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది’ అని అన్నారు.