లవ్ మౌళి మూవీ ఆడియో జూక్ బాక్స్ విడుదల
మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా నవదీప్ లవ్, మౌళి ఆడియో జూక్ బాక్స్ విడుదల
సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తర్వాత లవ్, మౌళిగా సరికొత్తగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్‌తో పాటు ద యాంథమ్ ఆఫ్ లవ్ మౌళి సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ ప్రమోషనల్ కంటెంట్‌లో నవదీప్ డిఫరెంట్‌గా కనిపించడంతో ఈ సినిమా నవదీప్ 2.Oగా అభిమానులు వర్ణిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో జూక్ బాక్స్ ని మాస్ మహారాజా రవితేజ విడుదల చేసి చిత్రయూనిట్‌కు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్లో ఈ చిత్ర పాటలను వినూత్నంగా విడుదల చేశారు. ఈ సినిమాలోని పాటలను ఎవరైతే పాడారో.. వారితోనే ఆ పాటను ఈ ఈవెంట్లో పాడించి.. అదే పాటను వారిచేతే విడుదల చేయించారు. అనంతరం పాటలన్నీ కలిపి ఉన్న జూక్‌బాక్స్‌ని స్టార్ హీరో రవితేజ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. రవితేజ నటించిన ఈగల్ చిత్రంలో నవదీప్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈగల్ ట్రైలర్ చూస్తుంటే.. నవదీప్ పాత్రకు ఈ చిత్రంలో చాలా ప్రాముఖ్యత ఉందనేది అర్థమవుతోంది. లవ్ ,మౌళి సినిమాలోని పాటలను ఇలా వినూత్నంగా విడుదల చేయడం.. అలాగే మాస్ రాజా రవితేజగారు జూక్ బాక్స్ విడుదల చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని హీరో నవదీప్ అన్నారు. నా ఆలోచన విధానానికి, నేను చేయాలనుకుంటున్న సినిమాలకు లవ్ ,మౌళి దగ్గరగా అనిపించింది. అందుకే మీ ముందుకు సరికొత్త చిత్రంతో రాబోతున్నానని నవదీప్ తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
నటీనటులు :
నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్
సాంకేతిక వర్గం :
బ్యానర్లు: నైరా క్రియేషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్
నిర్మాణం: సి స్పేస్
సంగీత దర్శకుడు: గోవింద్ వసంత
రచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: అవనీంద్ర