లాఠీ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

Published On: April 7, 2022   |   Posted By:

లాఠీ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడి గా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వం లో రానా ప్రొడక్షన్స్ పై తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘లాఠీ’ ఫస్ట్ లుక్ విడుదల.

యాక్షన్ హీరో విశాల్ కధానాయకుడిగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుటుంది. విశాల్ ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ లో టాప్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ పర్యవేక్షణ లో ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఈ రోజు చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం ముందు సాలిడ్ గా నిలబడి, ఒక చేతిలో లాఠీ పట్టుకుని, మరో చేతికి బ్యాండేజీ కట్టుతో ఈ ఫస్ట్ లుక్ లో విశాల్ కనిపించారు. శరీరమంతా గాయాల తో పాటు భవనం నుండి లేజర్ కిరణాలు విశాల్ పై పడటం కూడా ఈ యాక్షన్ పోస్టర్ లో గమనించవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో విశాల్ పవర్ ఫుల్ గా కనిపించారు. యాక్షన్ తో నిండిన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలని పెంచింది.

సమాజంలో మార్పు తెచ్చే శక్తి లాఠీకి వుంది. విశాల్ తన ‘లాఠీ’ తో సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికారో అన్నది ఆసక్తికరం. ఈ చిత్రానికి అన్ని భాషలకు ఒకే టైటిల్ పెట్టారు. ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని దర్శకుడు వినోద్ కుమార్ సరికొత్త కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విశాల్ ఫుల్ లెంత్ యాక్షన్ కి ప్రాధాన్యత వున్న పాత్రలో నటిస్తున్నారు.

విశాల్ సరసన సునైనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ, నందా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలసుబ్రమణ్యన్ ఛాయాగ్రహకుడిగా, సామ్ సిఎస్ సంగీత దర్శకుడిగా, పొన్ పార్థిబన్ రచయితగా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

ఈ చిత్రం కోసం అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ద్వితీయార్ధంలో ఉండే 45నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దిలీప్ సుబ్బరాయన్ మరో స్టంట్ మాస్టర్ గా పనిచేశారు.

తారాగణం: విశాల్, సునైనా
సాంకేతిక విభాగం:
దర్శకత్వం:  ఎ.వినోద్
నిర్మాతలు: రమణ, నంద
బ్యానర్: రానా ప్రొడక్షన్స్
రచయిత: పొన్ పార్థిబన్
సంగీతం: సామ్ సిఎస్
ఛాయాగ్రహణం : బాలసుబ్రమణ్యన్
స్టంట్ మాస్టర్స్: పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బరాయన్