లేడీ మూవీ టీజ‌ర్ విడుద‌ల

Published On: September 6, 2020   |   Posted By:
లేడీ మూవీ టీజ‌ర్ విడుద‌ల‌
 
టాలెంటెడ్ హీరోయిన్ మాధ‌వి ల‌త “లేడీ” టీజ‌ర్ విడుద‌ల‌
 
టాలెంటెడ్ బ్యూటీ మాధవి లత హీరోయిన్ గా ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో లేడీ అనే సినిమా సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. మాధ‌వి ల‌త‌ సోలో పెర్ఫార్మన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.
 
ఛరన్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీకే స్టూడియోజ్ బ్యానెర్లు పై సత్యనారాయణ గొరిపర్తి, జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్ ఈ రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషనల్ డ్రామా నిర్మిస్తున్నారు.  ఈ మోనో ప్లే ఎక్సపెరిమెంటల్ మూవీకి సంబంధించిన టీజ‌ర్ ని తాజాగా చిత్ర బృందం విడుద‌ల చేసింది.
 
ఓ రీల్ స్టార్ రియల్ స్టోరీ తో ఈ సినిమాను రెడీ చేస్తున్నామన్నారు కళ్యాణ్. సినిమా ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో ప్రేక్షకులును ఆకట్టుకునే రీతిన తీర్చిదిద్దినట్లుగా కళ్యాణ్ చెప్పారు. అదే రీతిన తాజాగా విడుద‌ల చేసిన టీజ‌ర్ ని కూడా రెడీ చేశారు లేడీ చిత్ర యూనిట్ స‌భ్యులు. ఈ సినిమాకి మధివి లత నటన ప్రధాన ఆకర్షణగా నిలవబోతుందని, సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్లుగా చిత్రం బృందం తెలిపింది. చిత్రానికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాత సత్యనారాయణ చెప్పారు. 
 
తారాగణం : మాధవి లత 
 
సాంకేతిక వర్గం 
 
బ్యానర్ : చరణ్స్ క్రియేషన్స్, జీ ఎస్ ఎస్ ఎస్ పీ కే స్టూడియోజ్ 
 
కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే,  డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, వి ఎఫ్ ఎక్స్,  డిఐ, పబ్లిసిటీ డిజైన్స్ : జీ ఎస్ ఎస్ ఎస్ పీ కళ్యాణ్ 
 
మ్యూజిక్ : వినోద్ యాజమాన్య 
 
ఎక్క్యూటివ్ ప్రొడ్యూసర్ : వేణు కార్తికేయన్ 
 
ప్రొడ్యూసర్స్ : జీ ఎస్ ఎస్ ఎస్ పి కళ్యాణ్, సత్యనారాయణ గొరిపర్తి