లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప్రొడక్షన్ సంస్థ ప్రెస్ మీట్
తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది-లైట్ హౌస్ సినీ మ్యాజిక్
ప్రొడక్షన్ నంబర్-3 దర్శకుడు సుబ్బారావు గోసంగి
“అక్కడొకడున్నాడు, రాఘవరెడ్డి” చిత్రాలనంతరం నిర్మాణ సంస్థ ‘లైట్ హౌస్ సినీ మ్యాజిక్’ ప్రొడక్షన్ నంబర్-3తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు ప్రముఖ దర్శకులు సుబ్బారావు గోసంగి.
భోజ్ పురిలో అగ్ర దర్శకుడిగా అలరారుతున్న సుబ్బారావు గోసంగి దర్శకత్వంలో కె.శివశంకర్ రావు-రావుల వెంకటేశ్వరరావు-రాంబాబు యాదవ్-శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివ కంఠంనేని-పక్ఖి హెగ్డే, శ్రీసూర్య-ప్రీతి శుక్లా హీరోహీరోయిన్లు.
ఘంటా శ్రీనివాసరావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి కొల్లిపర శ్రీనివాస్ సహ నిర్మాత.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం హైదరాబాద్ శివారులో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన షూటింగ్ కవరేజ్ ప్రెస్ మీట్ లో..
దర్శకుడు సుబ్బారావు గోసంగి, నిర్మాత రావుల వెంకటేశ్వరరావు, చిత్ర సమర్పకులు ఘంటా శ్రీనివాసరావు, హీరోలు శివ కంఠంనేని, శ్రీసూర్య, హీరోయిన్లు పక్ఖి హెగ్డే, ప్రీతి శుక్లా, సహ నిర్మాత కొల్లిపర శ్రీనివాస్, ఛాయాగ్రాహకుడు డి.ప్రకాష్ పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు. చాలా గ్యాప్ తర్వాత లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై నిర్మాణమవుతున్న ప్రొడక్షన్ నంబర్-3తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, త్వరలోనే టైటిల్ ప్రకటిస్తామని సుబ్బారావు గోసంగి అన్నారు.
ఫన్-యాక్షన్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా మా దర్శకులు సుబ్బారావు గోసంగి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని నిర్మాత రావుల వెంకటేశ్వరరావు తెలిపారు.
హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ… “సుబ్బారావు గారి వర్కింగ్ స్టైల్, ఆయన టాలెంట్ చూసి ఫిదా అయిపోతున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని ఎంతో ప్రత్యేక శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారు. కేవలం ఆయనపై ఉన్న గౌరవంతోనే… భోజ్ పురి లో లేడి సూపర్ స్టార్ గా చలామణి అవుతున్న పక్ఖి హెగ్డే ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తున్నాము” అన్నారు.
హీరోయిన్ పక్ఖి హెగ్డే మాట్లాడుతూ..
భోజ్ పురిలో నన్ను నంబర్ వన్ హీరోయిన్ చేసిన సుబ్బాజి (సుబ్బారావు గోసంగి) దర్శకత్వంలో తెలుగులో పరిచయం అవుతుండడం గర్వంగా ఉంది. ప్రతి సన్నివేశం ఎంతో ఇష్టంగా చేస్తున్నాం. హీరో శివ కంఠంనేని నాకూ మధ్య వచ్చే సీన్స్ అన్నీ చాలా ఆసక్తిగా ఉంటాయి” అన్నారు.
సుబ్బారావు దర్శకత్వంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని సెకండ్ హీరోహీరోయిన్స్ శ్రీసూర్య-ప్రీతి శుక్లా అన్నారు.
రాజేంద్ర, గుండు సుదర్శన్, గౌతంరాజు, దేవ్ సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి
డాన్స్: రాజు పైడి, ఫైట్స్: రామకృష్ణ, కెమెరా: డి.ప్రకాష్, మాటలు: దుర్గాప్రసాద్, సంగీతం: ఓంఝా
సహ నిర్మాత: కొల్లిపర శ్రీనివాస్,
సమర్పణ: ఘంటా శ్రీనివాసరావు,
నిర్మాతలు: కె.శివశంకర్ రావు- రావుల వెంకటేశ్వరావు- రాంబాబు యాదవ్- శ్రీధర్ రెడ్డి,
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: సుబ్బారావు గోసంగి