లక్ష్య మూవీ రివ్యూ
నాగ శౌర్య ‘లక్ష్య’ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
మనకు స్పోర్ట్స్ డ్రామా సినిమాలు తక్కువే…కాదు కాదు బాగా తక్కువ. స్పోర్ట్స్ డ్రామా ముసుగేసుకుని వచ్చే సీటీ మార్ లే ఎక్కువ. అయితే అలాంటి మసాలాలు ఏమీ లేకుండా కేవలం కథనే నమ్ముకుని..అందులో స్పోర్స్ నే హైలైట్ చేస్తూ ఏదైనా వస్తే…వింటానికి బాగుంది కదా. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో ఈ రోజు థియోటర్స్ లోకి దిగిన ‘లక్ష్య’ అలాంటిదే. నేపధ్య పరంగా కొత్తగా అనిపించిన ఈ చిత్రం కథ,స్క్రీన్ ప్లే పరంగా పరమ రొటీన్ గా అనిపించింది. అందుకు కారణం ఏమిటి..అసలు ఈ చిత్రం కథేంటి, నాగ శౌర్య ఎయిట్ ప్యాక్ చేయటం ఈ కథకు నిజంగానే అవసరమా లేక పబ్లిసిటీ కోసమా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. .
స్టోరీ
ఆర్చరీ ప్లేయర్ పార్ధు (నాగశౌర్య) కు ఒకటే లక్ష్యం వరల్డ్ ఛాంపియన్ కావాలని. తండ్రి చిన్నప్పుడే చనిపోవటంతో తాత రఘురామయ్య (సచిన్ ఖేడేకర్) సాయంతో రాత్రింబవళ్లూ కష్టపడతాడు. స్టేట్ లెవల్ ఛాంపియన్ అవుతాడు.అయితే ఇప్పుడు నేషనల్ లెవిల్ కు వెళ్లాలి. మన దేశం తరుపున ఆడాలి…గెలవాలి. ఆ టైమ్ లో తాత చనిపోతాడు. ఆ బాధ నుంచి బయిటపడి స్ప్రోర్ట్స్ లో రాణించటానికి డ్రగ్స్ కు బానిస అవుతాడు. డోప్ టెస్ట్ లో దొరికిపోయి. అకాడమి నుంచి సస్పెండ్ అవుతాడు. దాంతో తను ఎంతగానో ఇష్టపడ్డ రితికా (కేతికా శర్మ) కూడా దూరం అవుతుంది. అప్పుడు పార్ధు ఏం చేసాడు. పార్దు కు సారథి (జగపతి బాబు) ఏం సాయం చేసాడు, చివరకు తన లక్ష్యాన్ని ఎలా పార్దు సాధించాడు, ఆ క్రమంలో వచ్చిన అడ్డంకులు ఏమిటి..వాటిని ఎలా అధిగమనించాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
ఈ సినిమాట్రైలర్ చూస్తే – కథేమిటన్నది ఈజీగా అర్థమైపోతుంది. దర్శకుడు ట్విస్టులు, టర్న్‌లూ అనుకుని కొన్ని రాసుకున్నాడు గానీ, అవి కూడా.. మనకు ముందే తెలిసిపోతాయి. నాగ శౌర్య చిన్నప్పటి ఎపిసోడ్ నుంచి కథ మొదలవుతుంది. తండ్రి ఆర్చరీలో ఛాంపియన్ కావాలనుకున్నాడని, యాక్సిడెంట్ లో చనిపోయాడన్నది బ్యాక్ స్టోరీగా రాసుకున్నాడు. అయితే ఇలాంటివి చూపించినంత మాత్రాన కథకొచ్చే ప్రత్యేక ప్రయోజనం ఏమీ ఉండదు. లెంగ్త్ పెరగడం తప్ప. కట్ చేస్తే.ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగి ఉంటుందో ఈజీగా ఊహించేయొచ్చు. నాగశౌర్య తాతయ్యతీసుకెళ్లటం, ట్రైనింగ్ తో బోలెడంత ఎమోషన్ రిజిస్టర్ చేయొచ్చన్నది దర్శకుడి ఫీలింగ్ కావొచ్చు. తెరపై.. నటీనటులు కష్టాలు పడటం ఒక్కటే ఎమోషన్ కాదని, అలాంటి సీన్స్ చూసి జనాలు నవ్వుకోవటం తప్ప ఏమి ఉండదు అని దర్శకుడు గుర్తిస్తే బాగుండేది. ఇలా సినిమాకు కావాల్సిన ఎమోషన్స్ ఎక్కడా పూర్తి స్దాయిలో రిజిస్టర్ కాలేదు. అలాగే ఈ స్పోర్ట్స్ గురించి దర్శకుడు కూడా రిసెర్చ్ జోలికి వెళ్లలేదు. ఈ గేమ్ గురించి చెప్పే కొన్ని టెక్నికల్ పదాలు అర్దం కాలేదు కూడా.ఇక జగపతిబాబు మోటివేషన్ వ్యవహారం అంతా ఓ స్టంట్ లా అనిపిస్తుంది. ఇప్పుడు అతను ఆర్చరీ గేమ్ లో గెలవకపోయినా వచ్చే నష్టమేమీ లేదులే అనిపిస్తుంది. ఏదైమైనా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మంచి కాన్సెప్ట్ ఉంది. మత్తు (డ్రగ్స్)కు బానిస అయ్యి మళ్లీ పైకి లేచిన మనిషి లో ఓ ధృడ సంకల్పం ఉంది. ప్రేమ కూడా ఉంది. వీటి మధ్య మంచి డ్రామా ఉంది. అయితే… వీటిని పూర్తిగా కనెక్ట్ చేసే స్క్రీన్ ప్లే లేకుండా పోయింది. అయితే క్లైమాక్స్ సీన్స్ బాగా నీరసంగా సాగాయి.
టెక్నికల్ గా చూస్తే..
దర్శకుడుగా బాగా చేసాడనిపించుకున్నా…కథ, కథనం, దర్శకత్వం వల్ల సినిమా అనుకున్న స్దాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ , సినిమాటోగ్రఫీ సోసోగా ఉన్నాయి. సంగీత దర్శకుడు కాలభైరవ మ్యాజిక్ చెయ్యలేకపోయారు. రెండు పాటలే ఉన్నాయి. అవి పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ సోసోగా ఉంది.
రీసేంట్ గా వచ్చిన ‘వరుడు కావలెను’లో లవర్ బాయ్ గా కనిపించిన నాగశౌర్య తన శరీరాన్ని పూర్తిగా మార్చుకుని ‘లక్ష్య’లో విలువిద్యకారుడుగా మన ముందుకు రావటం మామూలు విషయం కాదు. ఈ పాత్రకు తగ్గట్లుగా మారిపోవడం కోసం ఏకంగా 8 ప్యాక్ బాడీ సాధించాడు.ఈ విషయంలో అతను సక్సెస్ అయ్యారు. ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ గ్లామర్ … నటన ని డామినేట్ చేసింది. సచిన్ ఖేడేకర్ కు కీ రోల్ దక్కింది. ఆయన బాగా చేశారు. జగపతిబాబు రోల్, అందులో ఆయన నటన బాగున్నాయి.
టెక్నికల్ గా..
ఈ సినిమాకు తక్కువ పాటలు పెట్టడం కలిసొచ్చిందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. అయితే అద్బుతం కాదు. ఎడిటింగ్ సైడ్ సెకండాఫ్ లో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. రైటింగ్ సైడ్ మాత్రం పూర్తిగా మ్యాజిక్ మిస్సైంది. ప్రొడక్షన్ వాల్యూస్ బ్యానర్ కు తగినట్లుగా ఉన్నాయి. దర్శకుడు గా మొదట సినిమా సుబ్రమణ్యపురంకు ఈ సినిమాకు బాగా ఛేంజ్ కనపడింది. మంచి స్క్రిప్టు తోడైతే దర్శకుడు హిట్ సినిమా తీయగలడని అనిపిస్తుంది. డైలాగులు బాగున్నాయి. సూటిగా, ఫెరఫెక్ట్ గా వింటి నుంచి వదిలిన బాణంలా కొన్ని ఉన్నాయి. అయితే కొంత ఇలాంటి సినిమాలకు డైలాగులు ఎంత నేచరల్ గా ఉంటే అంతే బాగుంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి సినిమాల నుంచి ఆసించే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ సినిమాలో లేవు.
నటీనటుల్లో నాగశౌర్య తన కష్టం తను పడ్డాడు. అతనికి వంక పెట్టలేం. హీరోయిన్ రొమాంటిక్ ఫేమ్ “కేతిక శర్మ” జస్ట్ ఓకే. జగపతి బాబు ఉన్నంతలో ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.
బాగున్నవి:
విలువిద్యా నేపధ్యం
నాగశౌర్య స్క్రీన్ ప్రెజెన్స్
Bonding scenes between Shaurya and Sachin Khedekar
బాగోలేనివి:
ఊహకు అందే స్క్రీన్ ప్లే
డ్రామా మిస్సవటం
సరైన కాంప్లిక్ట్ లేకపోవటం
చూడచ్చా
ఆర్చరీ బ్యాక్‌డ్రాప్ లో మనకు సినిమాలు ఏమీ లేవు …కాబట్టి విలువిద్య గురించి అవగాహన కోసం ఓ లుక్కేయచ్చు.
తెర ముందు..వెనక
నటీనటులు: నాగశౌర్య, కేతిక శర్మ, సచిన్ ఖేడ్కర్, జగపతిబాబు, రవిప్రకాష్, సత్య, శత్రు, వైవా హర్ష, తదితరులు;
సంగీతం: కాల భైరవ;
కూర్పు: జునైద్;
ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి;
దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి;
నిర్మాతలు: నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు,శరత్ మరార్;
Run Time :2 hr 21 Mins
విడుదల తేదీ: 10-12-2021