పిబ్రవరి 24న రిలీజ్ అయ్యే ‘వలిమై’ సినిమా ఆడియెన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : నిర్మాత బోనీ కపూర్
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ హీరోగా జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన చిత్రం ‘వలిమై’. ఐవీవై ప్రొడక్షన్స్ ద్వారా వలిమై చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు గోపీచంద్ ఇనుమూరి అందిస్తున్నారు. ఫిబ్రవరి 24న ‘వలిమై’ విడుదలవుతుంది. మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ..
ఐవీవై ప్రొడక్షన్స్ అధినేత గోపీచంద్ ఇనుమూరి మాట్లాడుతూ ‘‘అజిత్ సార్ మూవీ అంటేనే సూపర్. ట్రైలర్ చూడగానే బాగా నచ్చేసింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడం చాలా హ్యాపీగా ఉంది. ఫిబ్రవరి 24న సినిమాను విడుదల చేస్తున్నాం. గుజ్ బమ్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ మాట్లాడతూ ‘‘‘ఖాకి’ సినిమా చూసినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంత బాగా ఎంజాయ్ చేశారో దాని కంటే బెటర్ ఎక్స్‌పీరియెన్స్‌ను వలిమై సినిమా చూసినప్పుడు కలుగుతుంది. ఫిబ్రవరి 24న వలిమై వస్తుంది. తర్వాత 25న మరో స్ట్రోమ్ వస్తుంది. దాని కంటే ముందే ఈ సినిమాను చూసేయండి. కరోనా కష్టాలు అన్ని దాటి బోనీకపూర్‌గారి సపోర్ట్‌తో భారీ బడ్జెట్‌తో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించాం. అన్ని ఎలిమెంట్స్ మెప్పిస్తాయి. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హుమా ఖురేషి మాట్లాడుతూ ‘‘అజిత్ గారితో కలిసి పనిచేయడం గొప్ప ఎక్స్‌పీరియెన్స్. గొప్ప స్టార్. భారీ యాక్షన్ సన్నివేశాలను గొప్పగా చిత్రీకరించారు. ఈ సినిమాను చిత్రీకరించడంతో చాలా కష్ట నష్టాలను ఫేస్ చేశాం. బోనీ కపూర్‌గారు మాకు సపోర్ట్‌గా నిలిచారు. కార్తికేయను స్క్రీన్‌పై చూస్తే భయమేస్తుంది. తను అంత గొప్పగా నటించాడు. సినిమా అందరినీ మెప్పిస్తుంది’’ అన్నారు.
నిర్మాత బోనీ కపూర్ మాట్లాడుతూ ‘‘నేను బాలీవుడ్ నిర్మాతనే అయినా నా మనసెప్పుడూ దక్షిణాాది సినమాలపైనే ఉంటుంది. బాపుగారు డైరెక్ట్ చేసిన మనవూరి పాండవులు సినిమాను హిందీలో హమ్ హై పాంచ్ అనే పేరుతో రీమేక్ చేశాను. అలా తెలుగు సినిమాను రీమేక్ చేయడం ద్వారానే నా కెరీర్‌ను ప్రారంభించాను. బాపుగారు దర్శకుడిగా నాకెన్నో కొత్త విషయాలను నేర్పించారు. కాదల్ కోటై, వాలి సినిమాల నుంచి అజిత్‌గారితో మంచి అనుబంధం ఉంది. కాదల్ కోటై చిత్రాన్ని హిందీలో నేనే రీమేక్ చేశాను. ఇక అజిత్‌తో మూడు సినిమాలు చేసే అవకాశం దక్కింది. మూడో సినిమాను కూడా వినోద్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సినిమాను కూడా చేస్తాం. అజిత్, వినోద్ ఇద్దరూ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఫోకస్‌గా ఉంటారు. వారు ఎంటైర్ టీమ్‌ను ముందుకు నడిపించారు. అద్భుతమైన జర్నీ. ఈ జర్నీ ఇంకా కొనసాగనుంది. ఇక కార్తికేయ చూడటానికి సింపుల్‌గా, కూల్‌గా కనిపిస్తున్నాడు కానీ.. స్క్రీన్‌పై బబ్బర్ షేర్‌లా యాక్ట్ చేశాడు. తనను చూస్తే భయపడతాం అలా నటించాడు. తెలుగులోనూ సినిమాలు చేయాలని ఎదురు చూస్తున్నాను. నా కుమార్తె జాన్వీ కపూర్ తప్పకుండా తెలుగులో సినిమా చేస్తుంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తోంది. తెలుగులోనే కాదు, తమిళం సహా ఇతర దక్షిణాది భాషల్లోనూ ఆమె నటించడానికి సిద్ధంగా ఉంది. పిబ్రవరి 24న రిలీజ్ అయ్యే ‘వలిమై’ సినిమా ఆడియెన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది ’’ అన్నారు.
కార్తికేయ మాట్లాడుతూ ‘‘2017లో నా ఆర్.ఎక్స్ 100 రిలీజ్ కాలేదు. నేను, నా ఫ్రెండ్ కలిసి ఖాకి సినిమా చూశాం. అప్పుడు ‘ఈ డైరెక్టర్ నాతో సినిమా చేస్తానంటే స్క్రిప్ట్ వినకుండానే ఒప్పుకుంటాను’ అని నా ఫ్రెండ్‌తో చెప్పాను. నిజంగా నేను అదృష్టవంతుడ్ని. మూడేళ్ల తర్వాత అదే డైరెక్టర్‌తో నాకు పని చేసే ఛాన్స్ వచ్చింది. వినోద్‌గారు చాలా కంఫర్ట్ ఇచ్చి నాతో వర్క్ చేయించుకున్నారు. ఆయన దర్శకత్వంలో అజిత్ సార్‌తో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. ఆయన ఒక శాతం కూడా స్వార్థం ఉండదు. ఆయన జెన్యూన్ పర్సన్. నాకు ఈ సినిమా ప్లస్ కావాలని బలంగా కోరుకున్నారు. నా క్యారెక్టర్‌ను ఇంకా గొప్పగా చూపించాలని ఆయనే జాగ్రత్తలు తీసుకున్నారు. నన్ను ప్రమోట్ చేశారు. అంత గొప్ప హీరోతో రిలేషన్ దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫిబ్రవరి 24న మీ అందరికన్నా సినిమా కోసం నేనే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. బోనీ కపూర్‌గారు.. మన అల్లుడు. రెండేళ్ల పాటు అనే సమస్యలను దాటి వలిమై సినిమా చేశాం. ప్రతి సమస్యను దాటించడంలో మమ్మల్ని ముందుండి నడిపించారు. ఆయన ఎంత గొప్ప నిర్మాతో ఆయనతో పనిచేసిన తర్వాత అర్థమైంది. మేమేంతో ఇష్టపడే శ్రీదేవిగారి బ్యానర్‌లో పనిచేసే అవకాశం కలిగింది. చాలా గర్వంగా అనిపిస్తుంది. ఆయనతో కలిసి మళ్లీ పనిచేయాలని అనుకుంటున్నాను. హ్యూమా ఖురేషి అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. సినిమాలతో, పెర్పామెన్స్‌లతో సంబంధం లేని హీరోలు ఇక్కడ పవన్ కళ్యాణ్‌గారైతే, తమిళనాడులో అజిత్ గారు. ఇద్దరి సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. కచ్చితంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్. 24న వలిమై చూడండి. 25న భీమ్లా నాయక్ చూడండి’’ అన్నారు.