వాట్ ది ఫిష్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
నిహారిక కొణిదెల వాట్ ది ఫిష్ ఫస్ట్ లుక్ విడుదల
నిహారిక కొణిదెల వాట్ ది ఫిష్ తో కమర్షియల్ కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఇందులో నిహారిక ప్రధాన పాత్ర పోషిస్తోస్తున్నారు. వరుణ్ కోరుకొండ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్ అనేది సినిమా ట్యాగ్‌లైన్.
వాట్ ది ఫిష్ అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో రూపొందుతోంది. 6ix సినిమాస్‌పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్లో నిహారిక స్టైలిష్‌గా నడుస్తూ కనిపించారు. తన వెనుక డాలర్ ఇమేజ్ వుంది. నిహారిక ఎలిగెంట్అవతార్లో మెరిసే వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.
ఆమె పాత్ర అష్టలక్ష్మి అకా ఏయస్ హెచ్. ఈ పాత్రని చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. తెలుగు సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని పెర్ఫార్మెన్స్ఓరియెంటెడ్, యాక్షన్ డ్రివెన్ పాత్ర. ఆమె పాత్ర ప్రేక్షకులని అద్భుతంగా అలరించబోతుందని దర్శకుడు చెప్పారు.
ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తుండగా, సూర్య బెజవాడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
వివిధ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం :
నిహారిక కొణిదెల
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: వరుణ్ కోరుకొండ
నిర్మాతలు: విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ
బ్యానర్: 6ix సినిమాస్ & afilmbyv
సంగీతం: శక్తికాంత్ కార్తీక్