వారణాసిలో ఇస్మార్ శంకర్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ
ఎనర్జిటిక్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. డబుల్ దిమాక్ హైదరాబాది` ట్యాగ్ లైన్. ఈ సినిమా భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ రేపటి నుండి వారణాసిలో చిత్రీకరించనున్నారు. సినిమా కీలక ఘట్టంలో ఈ యాక్షన్ పార్ట్ ఉంటుంది. కాబట్టి డైరెక్టర్ పూరి జగన్నాథ్ భారీ రేంజ్లో ఈ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్ నుండి సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వారణాసి వెళుతున్నారు. పూరి స్టయిల్లో రియల్ సతీష్ ఈ యాక్షన్ పార్ట్‌ను తెరకెక్కించబోతున్నారు. లీడ్ పెయిర్ రామ్, నిధి అగర్వాల్‌తో ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, దీపక్ శెట్టి, తులసి తదితరులు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.
నటీనటులు: రామ్నిధి అగర్వాల్నభా నటేష్పునీత్ ఇస్సార్సత్యదేవ్ఆశిష్ విద్యార్థిగెటప్ శ్రీనుసుధాంశు పాండే తదితరులు
సాంకేతిక వర్గం:
ఫైట్స్: రియల్ సతీష్
సాహిత్యం: భాస్కరభట్ల
ఎడిటర్: జునైద్ సిద్ధికీ
ఆర్ట్: జానీ షేక్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్
దర్శకత్వం: పూరి జగన్నాథ్.