విజిల్ మూవీ రివ్యూ
తమళ మాస్ గజల్ (‘విజిల్’ రివ్యూ)
Rating: 2.5/5
Rating: 2.5/5
ప్రతీ స్టార్ హీరోకు ప్రక్క స్టేట్ లోనూ తన సినిమాలు ఆడాలని, అక్కడా తన జెండా పాతాలని, తన మార్కెట్ ని, అభిమాన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని కోరిక ఉంటుంది. అయితే నేటివిటి సమస్య వచ్చినప్పుడు, కథలో యూనివర్శియల్ అప్పీల్ లేనప్పుడు ఆ ఆలోచన,ప్రయత్నం పనికిరాకుండా పోతోంది. దాంతో ఇప్పుడు సినిమా ప్రారంభానికి ముందే కథా చర్చల్లోనే అన్ని ప్రాంతాల ప్రజలకు నచ్చి, ఆడే కథలకు ప్రయారిటీ ఇస్తున్నారు. దానితో తన ప్రాంత నేటివిటి కథలు తగ్గిపోతున్నాయి. ఇక మనకు తమిళంకు, కొంత ప్రాంతీయ వైరుధ్యాలు ఉన్నా, చాలా భాగం మన భావోద్వేగాలకు,వాళ్లకు దగ్గర పోలిక ఉండటం కలిసి వస్తోంది.
ఆ క్రమంలో ఒకప్పుడు విజయ్ కాంత్,రజనీకాంత్, కమల్ హాసన్ వంటివాళ్లు ఆ తర్వాత విక్రమ్, సూర్య,కార్తీ వంటివాళ్లు ఇక్కడా ఏలారు. అయితే వాళ్ల సినిమాలు ఇక్కడ ఆడటానికి కారణం..వాళ్ల కథల్లో ఉండే వైవిధ్యం. అయితే కాలక్రమేణా పూర్తిగా మాస్ కే ప్రయారిటీ ఇచ్చే హీరోలు పెరగటంతో ఈ స్దాయి సినిమాలు మన దగ్గర కూడా వస్తున్నాయి అని ఆదరించటం మానేసారు. ఈ క్రమంలో విజయ్ ట్రైల్స్ ఇక్కడ పనికిరాకుండా పోయాయి. కానీ విజయ్ వదలకుండా మన భాక్సాఫీస్ పై తన ప్రతీ కొత్త సినిమాతో దండయాత్ర చేస్తూండటంతో మెల్లిగా మనం అలవాటు పడ్డాం. ఆ వరసలో వచ్చిన చిత్రం విజిల్. ఈ సినిమా విజయ్ కు ఇక్కడ బ్రేక్ ఇస్తుందా… వైవిధ్యమైన కథేనా లేక రొటీన్ యాక్షన్ సినిమానా…వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి
మైఖేల్ (విజయ్) వైజాగ్ లోకల్ రౌడీ. తనుండే మురికివాడకు రక్షకుడులా ఉంటూంటాడు. ఓ రోజు తన ఫ్రెండ్ కిరణ్(కథిర్)తో కలిసి వెళ్తూంటే కారుపై ఎటాక్ జరుగుతంది. ఆ ఎటాక్ లో కిరణ్ తీవ్రంగా గాయపడి బెడ్ కు పరిమితం అవుతాడు. దాంతో కిరణ్ లీడ్ చెయ్యాల్సిన ఆంధ్రప్రదేశ్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకి కోచ్‌గా మైఖల్ ని వెళ్లమని అడుగుతాడు. అందుకు కారణం ఒకప్పుడు మైఖేల్ నేషన్ వైడ్ ఫుట్ బాల్ క్రీడాకారుడు. అతని తండ్రి రాజప్ప(విజయ్) లోకల్ డాన్. తన కొడుకుని మంచి స్పోర్ట్స్ పర్శన్ గా చూడాలని, తన వాళ్లకి పేరు తేవాలని కోరుకుంటాడు. కానీ ఆ కల తీరకుండానే ప్రత్యర్దుల ఎటాక్ లో హత్యగావింపబడతాడు. దాంతో తప్పనిసరి పరిస్దితుల్లో … తన తండ్రి వారసుడుగా మారతాడు. తన ఫుట్ బాల్ ఆటని వదిలేస్తాడు. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి ఎప్పుడో వదిలేసిన ఫుట్ బాల్ జట్టుకు కోచ్ గా అవకాసం వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిరాశలో ఉన్న మహిళా పుట్ భాల్ జట్టుని ముందుకు నడిపించటానికి నడుం బిగిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు వస్తాయి. ముందు ఆ టీమ్ లో ఉండే అమ్మాయిలే …ఈ రౌడీ మమ్మల్ని కోచ్ చేయటం ఏమిటని నో చెప్తారు. అయినా సరే వాటన్నిటిని ఎదుర్కొని టీమ్ స్పిరిట్ తో ఎలా ముందుకెళ్లి టీమ్ ని గెలిపించాడు, నయనతారతో మైఖల్ పాత్ర లవ్ స్టోరీ ఏమైంది, ఈ సినిమాలో విలన్ ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
యాక్షన్ మసాలా…
గతంలో వచ్చిన స్పోర్ట్స్ డ్రామాలకు , యాక్షన్ బ్యాక్ డ్రాప్ కలపటమే దర్శకుడు చేసిన పని. మిగతాదంతా సేమ్ టు సేమ్. షారూఖ్ ఖాన్ చెక్ దే ఇండియా సినిమాకు యాక్షన్ సీన్స్ కలిపి వదిలినట్లుంటుంది. సినిమా మొత్తం హీరో ఎలివేషన్ సీన్స్ తో, యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేసాడు. అవన్నీ తీసేస్తే చక్కగా రెండున్నర గంటల్లో సినిమా తెమిలిపోయేది. మూడు గంటల ఇబ్బంది తప్పేoది. దానికి తోడు తమిళ అతి చాలా చోట్ల నేను తమిళ సినిమా డబ్బింగ్ నే అని పలకరిస్తుంది. ఫస్టాఫ్ అయితే మరీ ఇబ్బంది గా అనిపిస్తుంది. సెకండాఫ్ ఫుట్ బాల్ మ్యాచెస్ తో ,తెలిసిన సీన్స్ తో నడుస్తుంది. అయితే దర్శకుడు అట్లీ తన మేకింగ్ తోనూ, విజయ్ తన వేరియేషన్స్ తో కూడిన నటనతోనూ కూర్చోబెడతాడు.
స్క్రిప్ట్ ఎలా ఉందంటే..
ఈ సినిమా స్టోరీ లైన్ గానే ఓ ఫార్మెట్ లో కనపడదు. రౌడీ..కోచ్ అయితే ఎలా ఉంటుంది అనుకుని అల్లుకున్న ఈ కథ…రౌడీ అయినా మరకొరు అయినా అవే సీన్స్ అన్నట్లు గా నడుస్తుంది. ప్రత్యేకంగా కలిసివచ్చిందేమీ ఉండదు. అయితే తండ్రి కలను కొడుకు నెరవేర్చటం అనే ఎమోషన్ కాస్త పండటం కలిసొచ్చింది. సినిమా స్క్రీన్ ప్లే మరికాస్త టైట్ గా రాసుకుని ఉంటే కథలో లాగ్, రిపీట్ సీన్స్ తప్పేవి.
ఇక మహిళా ఫుట్‌బాల్ టీమ్ అనే కాన్సెప్ట్‌ను తీసుకుని మహిళా సాధికారత అన్నారు కానీ అవీ రొటీన్ సీన్సే. మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడులు సమాజంలో జరుగుతున్నవే కానీ ఎన్నో సినిమాల్లో వచ్చినవే. కొత్తగా ఏమీ టచ్ చేసినట్లుండదు. అలాగే చాలా చోట్ల క్లాసులు పీకుతున్నట్లు అనిపిస్తుంది. ఒక కోచ్‌గా తన టీమ్ ని ముందుకు నడిపించేందుకు విజయ్ చేసే పనులు, వాళ్లలో స్ఫూర్తి రగిలించేందుకు తీసుకొనే డెసిషన్స్ వంటివి స్పూర్తిదాయకంగా ఉంటాయి. క్లైమాక్స్ సీన్స్ గెలుపు నీదా నాదా అన్నట్టుగా టెన్షన్ గా సాగే మ్యాచ్‌ని చూసినట్టే అనిపించటంలో సక్సెస్ అయ్యారు.
సాంకేతికంగా…
టెక్నికల్ గా సినిమా హై స్టాండర్డ్స్ లో . రెహమాన్ మ్యూజిక్, విష్ణు కెమెరా పనితనం సినిమాకి మ్యాజిక్ లా పనిచేసాయి. అయితే లెంగ్త్ ఎక్కువైంది. దాన్ని మినిమం అరగంట తీసేస్తే బాగుండేది. ఇక దర్శకుడు అట్లీ సోషల్ మెసేజ్ ని, ఓ స్టార్ హీరో సినిమాలో కలిపి వడ్డించిన విధానం మాత్రం ఇంట్రస్టింగ్. డబ్బింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
చూడచ్చా…
మాస్ సినిమాలు ఇష్టపడేవారు, స్పోర్ట్ డ్రామాని కొత్త కోణంలో చూడాలనుకునేవాళ్లకు నచ్చుతుంది.
తెర వెనక …ముందు
టైటిల్: విజిల్ (తమిళంలో బిగిల్)
జానర్: మాస్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా
నటీనటులు : విజయ్, నయనతార, జాకీష్రాఫ్, కదీర్, యోగిబాబు
సంగీతం : ఏఆర్ రహమాన్
దర్శకత్వం : అట్లీ
నిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్