Reading Time: < 1 min

 

విడుదలైన భీమ్లా నాయక్ మొదటి పాట

పవర్ స్టార్ట్ పుట్టిన రోజు సందర్భం గా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భీమ్లా నాయక్ సినిమాలోని మొదటి పాటని విడుదల చేసారు చిత్ర బృందం. మలయాళం సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే, దర్శకత్వం సాగర్ కే చంద్ర.

పాట విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఊగిపోయేలా జోష్ ఫుల్ ట్యూన్ ఇస్తే, రచయిత రామ జోగయ్య శాస్త్రి భీమ్లా నాయక్ పాత్ర వ్యక్తిత్వానికి సరిపోయే పదాలను పేర్చుకుంటూ, పేల్చుకుంటూ ఫుల్ కిక్ ఇచ్చారు. పాట మొత్తం ప్రాసలతో నింపేసినా, “లాఠీ గాయక్, డ్యూటీ సేవక్” లాంటి ప్రయోగాలు, “గుంటూరు కారం…ఆ యూనిఫారం, లావా దుమారం…లాఠీ విహారం” లాంటి వాక్యాలు హీరోయిజం ఏ స్థాయిలో ఉండబోతోందో జనాలకి పరిచయం చేస్తున్నాయి.. మొత్తమ్మీద జనాలు “భీం భీం భీం భీం భీమ్లా నాయక్” అని పాడుకునే ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది.


పాట ప్రారంభం లో వచ్చే జానపద సాకీ, వెనుక ఉన్న అడవులని బట్టి ఇది అరకు ప్రాంత నేపధ్యం లో జరిగే కథ అని తెలుస్తోంది.