విడుదలకు సిద్ధమైన నిన్నుతలచి
ఎస్.ఎల్.ఎన్ ప్రొడక్షన్స్, నెదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం నిన్ను తలచి. అనిల్‌తోట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీఎక్కసిరి, స్టెఫీపాటిల్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఏలేంద్ర మహవీర సంగీతాన్ని అందించారు. క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో …
హీరో వంశీ మాట్లాడుతూ… నిన్ను తలచి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ చిన్నది కాదు చాలా పెద్దది, బాహుబలి, సాహో వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాలు వస్తున్న ఈ ఇండస్ట్రీ నుంచి పరిచయం అవ్వడం నిజంగా నా అదృష్టం. మా డైరెక్టర్ సినిమాని చాలా బాగా తీశారు. నా మొదటి చిత్రం మిస్ టీన్ ఇంటర్నేషనల్ స్టెఫీ పటేల్ తో చెయ్యడం లక్కీగా ఫీలవుతున్నాను. ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. మ్యూజిక్‌కి ప్రాణం పెట్టారనే చెప్పాలి పాటలు చాలా బాగా వచ్చాయి. ప్రతి తెలుగు ఆడియన్‌కి ఈ చిత్రం బాగా నచ్చుతుంది.
హీరోయిన్ స్టెఫీ పాటిల్ మాట్లాడుతూ…ముందుగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకుమా డూరెక్టర్ మరియు ప్రొడ్యూసర్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత మంచి యూనిట్‌తో కలిసి పని చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. హీరోకూడా చాలా బాగా హెల్ప్ చేశారు. హైదరాబాద్ ఫుడ్ కూడా నాకు బాగా నచ్చింది. బిర్యాని, రసం చాలా బావుంటాయి. నా చిత్ర యూనిట్ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఏలేంద్ర మహవీర్ మాట్లాడుతూ… ముందుగా మా డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. మా చిత్రం చాలా మంచి మ్యూజికల్ హిట్ అయింది. ఇప్పటివరకు 4 పాటలు వచ్చాయి చాలా బావున్నాయి. అన్నిటికంటే కోపంగా ఉండాలని అనే సాంగ్ చాలా బాగా రావాలని 25రోజుల వ్యవధి తీసుకుని మరి చెయించారు మా డైరెక్టర్‌గారు. ఆ పాట చాలా బాగా వచ్చింది. మా యూనిట్ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు.
డైరెక్టర్ తోట అనిల్ మాట్లాడుతూ… నిన్ను తలచి చిత్రం చాలా బాగా వచ్చింది. నాలుగు పాటలు విడుదలయ్యాయి. అన్ని చాలా మంచి రైటర్స్‌తో రాయించాం. పాటలు చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్లు చాలా బాగా నటించారు. ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను ఏమి అడిగినా కాదనకుండా ఆయన సహకారాన్ని అందించారు. మా చిత్రాన్ని గీతాఆర్ట్స్ ద్వారా సెప్టెంబర్‌లో విడుదల చెయ్యాలనుకుంటున్నాం. మా యూనిట్ అందరికీ థ్యాంక్స్ అని అన్నారు.
నిర్మాత అజిత్ మాట్లాడుతూ… అనిల్ గారు కథ తీసుకుని ఒకసారి వచ్చి నాకు చెప్పారు. అందరం ఒక ఫ్యామిలీలాగా మూవీని కంప్లీట్ చేశాం. ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ అందించారు. నేను ఇచ్చిన బడ్జెట్ ఎక్కడా తగ్గకుండా మంచి లవ్‌స్టోరీని అందించారు అని అన్నారు.