Reading Time: 2 mins

విమానం మూవీ నుంచి లిరికల్ సాంగ్ విడుదల

విమానం మూవీ నుంచి లిరికల్ సాంగ్ సుమతి విడుదల జూన్ 9న మూవీ గ్రాండ్ రిలీజ్అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ‌ల‌పై సాగే పాట

సుమ‌తీ సుమ‌తి
నీ న‌డుములోని మ‌డ‌త
చూస్తే ప్రాణ‌మొణిక వ‌నితా
నువ్వు పూసే రంగుల‌న్నీ
చూస్తే నేను పొంగిపొర్లుతా

అని త‌న ఆరాధ్య దేవ‌త సుమ‌తి అన‌సూయ‌ని చూసి త‌న ప్రేమికుడు కోటి రాహుల్ రామ‌కృష్ణ‌ పాట పాడుకుంటున్నాడు. పాట వింటుంటే ఆమెకు త‌న ప్రేమ‌ను చెప్ప‌కుండానే గాఢ‌మైన ప్రేమ‌ను మ‌న‌సులో పెంచుకున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. అసలు ఇంత‌కీ ఈ సుమ‌తి, ఆమె అజ్ఞాత‌ ప్రేమికుడు కోటి ఎవ‌రు?  కోటి ప్రేమ స‌క్సెస్ అయ్యిందా? అనే విష‌యాలు తెలియాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.

స్టార్ యాంకర్‌గా బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అన‌సూయ భ‌రద్వాజ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు. అందులో భాగంగా విమానం మూవీలో సుమ‌తి అనే బోల్డ్ పాత్ర‌లో న‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు అన‌సూయ చేసిన సినిమాల్లో చేయ‌న‌టువంటి పాత్ర‌. అలాంటి ఆమెను ఓ యువ‌కుడు ప్రేమించి త‌న ప్రేమ‌ను చెప్ప‌లేక అవ‌స్థ‌లు ప‌డుతుంటే ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని సుమతి అనే పాట ద్వారా తెలియజేశారు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్. ఆయ‌న సంగీతం అందిచ‌ట‌మే కాకుండా ఈ పాట‌కు లిరిక్స్ రాసి ఆయ‌నే పాడ‌టం విశేషం.

ఇప్ప‌టికే విడుద‌లైన విమానం టీజ‌ర్‌, రేలా రేలా అనే లిరికల్ సాంగ్‌తో పాటు సుమ‌తి పాత్ర ఫ‌స్ట్ లుక్‌, వీడియో గ్లింప్స్‌తో సినిమాపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు విడుదలైన సుమతి లిరికల్ సాంగ్ యూత్‌కి క‌నెక్ట్ అయ్యేలా ఉంది. పాట విటే త‌ప్ప‌కుండా అంద‌రూ హ‌మ్ చేసుకుంటార‌న‌టంలో సందేహం లేద‌నిపిస్తోంది.

విమానం సినిమా ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ. వైవిధ్య‌మైన పాత్ర‌లు చేసే ప్ర‌యాణం అస‌లు ఎలాంటి మ‌జిలీలు చేరుకున్నాయి. ఈ క్ర‌మంలో ఎద‌ర‌య్యే భావోద్వేగాలు ఏంటి? అనే విష‌యాల‌ను విమానం సినిమాలో చూడాల్సిందే. వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు.

విమానం సినిమా  జూన్ 9న వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌ విమానం చిత్రాన్ని నిర్మించారు.

న‌టీన‌టులు:

స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్

సాంకేతిక వ‌ర్గం:

ప్రొడ్యూస‌ర్స్‌:  జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  శివ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌పీ:  వివేక్ కాలేపు
ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌:  చ‌ర‌ణ్ అర్జున్‌