ముఖచిత్రం మూవీ రివ్యూ
విశ్వక్ సేన్ ముఖచిత్రం రివ్యూ
Emotional Engagement Emoji
ప్లాస్టిక్ సర్జరీ, ఫేస్ మార్పిడి బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ముఖచిత్రం. విశ్వక్ సేన్ లాయిర్ గా కనిపించిన ఈ చిత్రం అతని పేరు మీదే క్రేజ్ తెచ్చుకుంది. మూడేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన ఓ క్రైమ్ స్టోరీని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. దానికి తోడు జాతీయ అవార్డు అందుకున్న కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ కథ, కథనం, మాటలు అందించిన సినిమా కావటం మరో ప్లస్ అయ్యింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది వర్కవుట్ అయ్యే కాన్సెప్టు యేనా అయినా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
హైదరాబాద్ కు చెందిన ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ డా రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట) అతను తన భార్య మహతిని (ప్రియ వడ్లమాని)ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అనుకోని పరిస్దితుల్లో ఆమె చనిపోతుంది దాంతో ఆమె ముఖాన్ని తన స్నేహితురాలు మాయా ఫెర్నాండెజ్ (అయేషా ఖాన్) ఫేస్ తో రీ ప్లేస్ చేస్తాడు. అక్కడ నుంచి రాజ్ జీవితంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి రాజ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అసలు ఇలా ఫేస్ మార్పడి చేయటం వెనుక రాజకుమార్ ఆలోచన ఏమిటి .మాయా ఫెర్నాండెజ్ నే అందుకు ఎందుకు ఎంచుకున్నాడు ఈ కథలో విశ్వక్ సేన్ కథేమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
స్టోరీ లైన్ గా మంచి పాయింట్ ఉన్న కథ ఇది. అయితే ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు మొదటి గంట చాలా డల్ గా బోరింగ్ గా ఉంది మొత్తం సెకండాఫ్ లో పెట్టుకున్నారు. మెయిన్ స్టోరీ లోకి వెళ్ళడానికి డైరెక్టర్ చాలా సమయం తీసుకున్నాడు.స్క్రీన్ ప్లే కూడా చాలా సాదా సీదాగా ఉంది. డైలాగులతో కథను నడుపుదామనే ప్రయత్నం చేసారు దాంతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్లు ఉంటుంది. మొదటి గంట మొత్తం ప్లాట్‌కు సంబంధించి పెద్దగా ఏమీ ఉండదు. మెయిన్ లీడ్ మధ్య రొమాంటిక్ ట్రాక్ అంత ఎఫెక్టివ్ గా లేదు ఇంటర్వెల్ నుండి మాత్రమే కొంచెం ఆసక్తికరం గా మారుతాయి.
యాక్సిడెంట్ తర్వాత ముఖ మార్పిడి తర్వాత కథ ప్రారంభమవుతుంది అప్పటిదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇలాంటి కథలు చాలా ఇంటెన్స్ గా ఆసక్తికరంగా అనిపిస్తేనే నడుస్తాయి. అయితే కొన్ని ట్విస్టు లు చాలా నచ్చుతాయి. కొన్ని సన్నివేశాలు సెకండాఫ్ లో బాగా జస్టిఫై చేసారు చివరి గంటలో సినిమా చాలా బాగా ఆకట్టుకుంది. కామెడీ వర్కవుట్ కాలేదు కొంచెం కథ మీద దృష్టి పెట్టి వుంటే, చివర అరగంట ఇంకా ఇంట్రస్టింగ్ గా తీస్తే బాగుండేది అనిపిస్తుంది.
ఎవరెలా చేసారంటే
మొదటగా ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఉండేది కాసేపే గెస్ట్ రోల్ అది గుర్తుకుని చూడాలి. అతని ఇంపాక్ట్ కూడా పెద్దగా లేదు. ఇక ఈ చిత్రం లో లీడ్ రోల్ లో నటించిన ప్రియా వడ్లమాని సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆమె కీలక సన్నివేశాలలో చాలా బాగాగా నటించింది. సాంప్రదాయ అమ్మాయిగా ప్రియా నటన చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. వికాస్ వశిష్ఠ తన పాత్రలో బాగానే నటించాడు. చైతన్య, అయేషా ఖాన్‌లు తమ బెస్ట్ ను అందించారు. చైతన్య రావు వికాస్ స్నేహితుడుగా బాగా చెయ్యడమే కాకుండా, నవ్వించే ప్రయత్నం చేసాడు. చాలా వరకూ సక్సెస్ అయ్యాడు.
టెక్నికల్ ఫెరఫార్మెన్స్
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాలభైరవ అయినా అతని స్దాయి, మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేకపోయారు. శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. కొత్త దర్శకుడు సినిమాలో ఎక్కడా సినిమాటిక్ ఫీల్ కలగకుండా బాగా జాగ్రత్తపడ్డాడు. అదే ప్లస్ అదే మైనస్ తెరపై ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో ఫెయిలయ్యాడు. పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కూడా ఛల్తాహై, జంప్ కట్స్ కూడా ఒక స్పెషల్ ఎఫెక్ట్ అనే ఫీల్ అన్నట్లు ఎడిట్ చేసారు. ఈ సినిమాకు స్టోరీ లైన్ బాగున్నా కథా విస్తరణ సరిగ్గా జరగలేదు. డైలాగుల్లో ప్రాసలు ఎక్కువగా కనపడి విసిగించాయి.
ప్లస్ లు
లీడ్ ఆర్టిస్ట్ లు ఫెరఫార్మెన్స్
స్టోరీ లైన్
మైనస్ లు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ప్రెడిక్టుబుల్ గా సాగిన స్టోరీలైన్
నీరసం అనిపించే స్క్రీన్ ప్లే
చూడచ్చా
పనిగట్టుకుని థియేటర్ కు వెళ్లి చూడాలంటే కష్టం కానీ ఓటిటిలో వచ్చినప్పుడు ఓ లుక్కేయచ్చు.
సంస్థ: పాకెట్ మనీ పిక్చర్స్;
నటీనటులు: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్, విష్వక్‌సేన్ (ఓ కీలకపాత్రలో), రవిశంకర్ తదితరులు
సంగీతం: కాల భైరవ
కూర్పు: పవన్ కళ్యాణ్
సమర్పణ: ఎస్ కే ఎన్
నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల
కథ స్క్రీన్ ప్లే, మాటలు: సందీప్ రాజ్;
దర్శకత్వం – గంగాధర్
రన్ టైమ్: 126 minutes
విడుదల: 09 -12-2022