“వెల్‌కం జిందగీ” ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల
శ్రీనివాస కళ్యాణ్ – పోద్దార్ లను హీరో-హీరోయిన్‌లుగా పరిచయం చేస్తూ నూతన నిర్మాణ సంస్థ `పిల్లర్ 9 ప్రొడక్షన్స్` నిర్మిస్తున్న మొదటి సినిమా `వెల్‌కం జిందగీ`. ఈ ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌కి శాలు – లక్ష్మణ్ దర్శకత్వ ం వహిస్తున్నారు. చుట్టూ ఉన్న పదిమందికి సాయపడితే ఆ సాయం వారి జీవితాల్లో వెలుగులు నింపితే ఆ ఆనందమే వేరు! అనేది కాన్సెప్ట్. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ ,మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు
దర్శకులు శాలు- లక్ష్మణ్ మాట్లాడుతూ -“మనం చేసే చిన్న సాయం ఇతరుల జీవితాల్లో ఎలాంటి ఆనందాన్ని, వెలుగును నింపుతుందో చెబుతూ సాయం ప్రాముఖ్యతను వివరించే చిత్రమే ఇది. ఫ్యామిలీ డ్రామాతో పాటు ప్రేమకథ ఆకట్టుకుంటుంది. ఇదో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. కొత్తవారే అయినా నాయకానాయికలు చక్కగా నటించారు. మధుమణి, కమల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. వారి నటన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. జబర్ధస్త్ ఫేం కొమురం హీరో స్నేహితుడుగా నటించాడు. తన కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. సినిమాటోగ్రాఫర్ శ్రీసాయి ప్రతి ఫ్రేమ్‌ను అందంగా తెరకెక్కించారు. 5 విభిన్నమైన పాటలున్నాయి. గౌతమ్ రవిరామ్ సంగీతం అద్భుతంగా కుదిరింది. ప్రస్తుతం
నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్నాయి. తాజాగా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాం“ అన్నారు. ఈ చిత్రానికి కథ-కథనం -దర్శకత్వం : శాలు- లక్ష్మణ్