వైభవంగా సంతోషం అవార్డ్స్‌ 17వ వార్షికోత్సవ కర్టెన్‌రైజర్‌

Published On: September 26, 2019   |   Posted By:
వైభవంగా సంతోషం అవార్డ్స్‌ 17వ వార్షికోత్సవ కర్టెన్‌రైజర్‌
 
‘సంతోషం సౌతిండియా 17వ అవార్డుల’ కర్టెన్‌ రైజర్‌ బుధవారం రాత్రి వైభవంగా జరిగింది. జూబ్లీహిల్స్‌లోని పాస్తా రాస్తాలో జరిగిన ఈ వేడుకకు ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నభా నటేష్‌, బర్నింగ్‌ స్టార్‌ సుంపూర్ణేష్‌ బాబు అథితులుగా విచ్చేశారు. పాపులర్‌ సింగర్‌ సింహా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దక్షిణ భారత సినీ రంగంలో ప్రధానమైన అవార్డుల్లో ‘సంతోషం ఫిలిం అవార్డ్స్‌’ కూడా ఒకటి. ప్రతి ఏటా జరిగే సంతోషం అవార్డ్స్‌ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించనున్నారు.
 
29న జరగబోయే ఈ అవార్డుల ఫంక్షన్‌కు ముందుగా కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.
 
వ్యాఖ్యాత సింహా అతిథులను ఆహ్వానిస్తూ స్వాగతోపన్యాసం గావించారు.  సుధాకర్‌రెడ్డిగారు. రోబో టెక్నాలజీస్‌ మారుతిగారు, ఎర్రచీర దర్శకుడు సుమన్‌బాబు, వెంకటగోవింద్‌గారు, సాయి కన్‌సల్‌టెన్స్‌ ఇవన్నీ పక్కన పెడితే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేశారు. ఈ సంవత్సరంలో చెప్పుకోదగ్గ మంచి హిట్‌ సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌. ఇస్మార్ట్‌ శంకర్‌లో తెలంగాణ లాంగ్వేజ్‌తో అదరగొట్టేసిన నభానటేషాగారిని, అలాగే మా అందరిహీరో మన హీరో బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు కొబ్బరిబోండాం చిత్రం తో పెద్ద హిట్‌ కొట్టారు. మా స్పాన్సర్స్‌ అందరూ వారి ఆనందాన్ని పంచుకోవల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా చెప్పవలసింది మంచి ఎనర్జీ కోసం ప్రతిసంవత్సరం సంతోషం సురేష్‌గారు ఒక పాట పెడతారు. ఈ సంవత్సరం కూడా పాట పెట్టారు. ఆ పాటకి సాదిక్‌ మ్యూజిక్‌ చెయ్యగా అద్భుతమైన లిరిక్స్‌ను అందించారు. ఈ అవార్డ్స్‌ వల్ల ఎవరు ఎవరు హ్యాపీ ఫీలవుతారు అన్నది చూపించారు. అర్జున్‌రెడ్డి వంటి మంచి చిత్రానికి పాటలు రాసిన రాంబాబు గోసాల.. అంటూ ఒక్కోక్కరిని సింహా పరిచయం చేశారు.
 
ఈ సందర్భంగా నబానటేశ్‌.. అవార్డు ఫంక్షన్‌ లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సంతోషం 17వ సంత్సరం అవార్డుల్లో నేను పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.  ఈ సంవత్సరం నేను పర్ఫామ్‌ కూడా చేస్తున్నాను. సురేష్‌గారికి చాలా చాలా థ్యాంక్స్‌. ఇక్కడకు విచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్‌ అని అన్నారు.
 
రాంబాబుగోసాల మాట్లాడుతూ… సంతోషం అవార్డ్స్‌కి విచ్చేసిన వారందరికీ, స్పాన్సర్స్‌కి ప్రత్యేక క తజ్ఞతలు. అవార్డులనేవి ఈ రోజుల్లో ఇవ్వడం అనేది చాలా చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కానీ ఆయన చాలా కష్టపడి అందర్నీ కూడగట్టుకుని కత్తిమీదసాములాగా ఏదీ ఆశించకుండా కేవలం కళాకారులను ప్రోత్సహించాలి. 24క్రాట్స్‌ అవార్డులు ఇస్తూ టెక్నీషియన్లును ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఒకరోజు సురేష్‌గారు నన్ను పిలిచి  ఈ అవార్డులకు సంబంధించిన పాటను రాయమన్నారు. నేను చాలా సంతోషంగా ఫీలయ్యి ఈ సంతోషం అవార్డులకు పాటను రాశాను. అలాగే నేను చాలా చిత్రాలకు పాటలను రాశాను. అర్జున్‌రెడ్డి, మజిలి, ఉయ్యాలజంపాల,  కానీ వేరు వేరు సిట్యువేషన్స్‌కు పాట రాయడం వేరు  దీంట్లో అందరి కళాకారులను కలుపుకుని అవార్డులను ఇచ్చి. చాలా ఇన్‌పుట్స్‌ ఇచ్చి నాతో ఈ పాటని రాయించారు. చాలా బాగా కుదిరింది. అదే విధంగా ఈ ఫంక్షన్‌ని మీడియావాళ్ళుగాని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవారుగాని అందరూ సపోర్ట్‌ చేసి సురేష్‌కొండేటిగారిని ఎంకరేజ్‌ చేసి ఈ ఫంక్షన్‌ని చాలా విజయవంతం చెయ్యాలని కోరుకుంటూ ఇక్కడకు విచ్చేసిన ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నభానటేష్‌, హీరో సంపూర్ణేష్‌బాబుగారికి ఈ పాటకి మ్యూజిక్‌ చేసిన సాకేత్‌గారికి చాలా అద్భుతంగా పాడిన సింహాగారికి నా ప్రత్యేక కతజ్ఞతలు అన్నారు ఆల్‌ ద బెస్ట్‌ సురేష్‌కొండేటిగారు.
 
గోవింద్‌రావ్‌ మాట్లాడుతూ… సంతోషం అవార్డ్స్‌ అంటే పేరులోనే సంతోషం ఉంది. అందరూ కలిసి కట్టుగా సంతోషంగా చేసుకునే పండగే సంతోషం అవార్డ్స్‌ ఇంత వర్షంలో కూడా చాలా మందివచ్చారంటే ఇదంతా ఆయన మీదున్న అభిమానం  ఆల్‌ ద బెస్ట్‌ టు ద సంతోషం అవార్డ్స్‌.
 
‘ఎర్రచీర’ నిర్మాత, దర్శకుడు సుమన్‌బాబు మాట్లాడుతూ… ఇప్పటికే పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఇంకా మరెన్నో సంవత్సరాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్యూ వెరీ మచ్‌ అని అన్నారు.
 
మానిక్‌చంద్‌ ప్రతినిధి మాట్లాడుతూ.. సంతోషం అవార్డ్స్‌ చేస్తుంన్నందుకు మానిక్‌చంద్‌ నుంచి స్పార్స్‌ ఇస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం సురేష్‌కొండేటిగారికి ఆల్‌ ద బెస్ట్‌ 29న జరగబోయే సంతోషం అవార్డ్స్‌కి చాలా సంతోషిస్తున్నాం చాలా సంతోషం అన్నారు.
 
శ్రీవెంకటేష్‌ మాట్లాడుతూ… సంతోషం అవార్డ్స్‌ పదిహేను సంవత్సరాల నుండి నాకు ఆయన పరిచయం ఆయన ఒక మ్యాగ్‌జైన్‌ 17ఇయర్స్‌ బ్యాక్‌ మొదలుపెట్టారు. అప్పట్లో యాడ్స్‌కోసం వచ్చేవారు. పదిహేడు సంవత్సరాలనుంచి మంచి నడుపుతూ మంచి ఎత్తుకు ఎదగడమే కాక ఆ మ్యాగ్‌జైన్‌ పేరుతో అవార్డ్‌ ఫంక్షన్‌ చెయ్యడం చాలా అభినందనీయం. అంతేకాక గత రెండు నెలలు గా అవుట్‌డోర్‌లో పార్టనర్‌షిప్‌ ఉండాలి సహకరించాలని అడుగుతున్నారు. లాస్ట్‌ ఇయర్‌ స్పాన్సర్‌ చేశాం. ఈ ఇయర్‌ కూడా స్పాన్సర్‌ చేస్తున్నాం. మేం రోషన్‌ యాడ్స్‌ నుంచి మాట్లాడుతున్నాను. ఈ యొక్క పదిహేడు సంవత్సర సంతోషం అవార్డ్స్‌ గ్రాండ్‌ సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్యూ వెరీ మచ్‌ అని అన్నారు.
 
సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ… సురేష్‌కొండేటి చాలా గొప్పవారు ఆయన ఒక ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌,  ఒక యాక్టర్‌ ఆల్‌ రౌండర్‌. ఇలా అవార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప పని. ఆయనకి నా ప్రత్యేక క తజ్ఞతలు అని అన్నారు.
 
మధు మాట్లాడుతూ… సంతోషం అవార్డు ఫంక్షన్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మేం వీడియాకాన్‌ స్పాన్సర్‌షిప్‌వాళ్ళం. ఆల్‌ ద బెస్ట్‌ గుడ్‌ లక్‌ అన్నారు.
 
రోబోటెక్‌ మారుతి మాట్లాడుతూ… ముందుగా సురేష్‌కొండేటిగారికి ప్రత్యేక కతజ్ఞతలు. మొదటిసారి రోబోటెక్‌నుంచి స్పానర్స్‌షిప్‌ ఇస్తున్నాము. ఆర్టిస్టులను గౌరవించి ఇలాంటి అవార్డులు ఇవ్వడం అనేది చాలా సంతోషమైన పని. అందులో మేం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఆల్‌ ద బెస్ట్‌ టు ద ఈవెంట్‌ అని అన్నారు.
 
సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ…సంతోషం అవార్డ్స్‌ చాలా రోజుల నుంచి ఎంతోమంది కళాకారులను ఎంకరేజ్‌ చేస్తూ అవార్డులు ఇస్తున్నటువంటి సురేష్‌ భయ్యాకు చాలా థ్యాంక్స్‌. ఆల్‌ ద బెస్ట్‌ అన్న ఎంతో పెద్ద నటుల దగ్గర నుంచి నాలాంటి ఇంత చిన్న నటుడ్ని కూడా ఎంకరేజ్‌చేస్తున్నటువంటి మీరు ఇంకా చాలా అవార్డు ఫంక్షన్లు చాలా మందికి చాలా సార్లు చేసి వాళ్లందరికీ ఎదుగుదలకు మీరు కారణమై వాళ్ళకు సపోర్ట్‌ ని అందజయ్యాలని కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్‌బాబు. 
 
సమీర్‌ మాట్లాడుతూ… పదిహేడో తారీఖున సంతోషం సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2019 ఇవ్వడం  చాలా ఆనందం. అవార్డు అనేది ఒక ఆర్టిస్ట్‌కి ఎంకరేజ్‌మెంట్‌, బేస్ట్‌ అప్‌ వంటిది. ఒక యాక్టర్‌కి, ఒక టెక్నీషియన్‌కి 24క్రాఫ్ట్స్‌కి అలాంటిది ఒక్క లాంగ్వేజ్‌తో అవార్డు ఇవ్వడం కష్టం. కానీ సౌత్‌ ఇండియా మొత్తం కవర్‌ చేస్తారు.  ఏదన్నా పట్టుకుంటే వదలడు మొండి మనిషి. వర్షం పడుతుంది ఎలాగా అనుకుంటుంటే  వర్షం ఆగిపోతుంది అన్నాడు. అలాగే ఆగిపోయంది. ఇలాగే ప్రతి సమయం ఆయనకి కలిసిరావలని కోరుకుంటూ మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సురేష్‌కొండేటి చాలా మంచి మనిషి. ఆల్‌ ద బెస్ట్‌ అని అన్నారు.
 
     సురేష్‌ కొండేటి మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత మంచి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా ప్రత్యేక కతజ్ఞతలు  తెలిపారు.