వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ

Published On: April 2, 2021   |   Posted By:

వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ

టైర్డ్ డాగ్: నాగ్  ‘వైల్డ్ డాగ్’ రివ్యూ

Rating:2/5
 
నిజ జీవిత సంఘటనలతో సినిమాలు తీయటం అంటే కత్తి మీద సామే. అయితే నాగార్జున కు అలాంటి సాహసాలు చేయటమే ఇష్టం. అలా గోకుల్ ఛాట్ బాంబ్ బ్లాస్ట్ ,పూనే బాంబు పేలుడు వంటి సంఘటనలు స్పూర్తితో అల్లుకున్న కథతో ఈ సినిమా చేసారు. ఈ సినిమా ట్రైలర్ బాగానే వర్కవుట్ అయ్యింది. దాంతో సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది. నాగ్ కు సక్సెస్ ఇచ్చిందా..కథేంటి .సామాన్య ప్రేక్షకుడుకి ఈ సినిమా నచ్చుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టో రీలైన్

నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారి విజయ్‌ వర్మ(నాగార్జున అక్కినేని) …టెర్రరిస్ట్ లను అరెస్ట్ చేయటం కన్నా ఎనకౌంటర్ చేసేయటం బెస్ట్ అని అనుకుంటూంటాడు. చాలా సార్లు పై అధికార్లు అతన్ని ఈ విషయంలో కోప్పడుతూంటారు. వైల్డ్ డాగ్ అని ముద్దు పేరుతో పిలుచుకుంటూంటారు. ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్న అతన్ని డిపార్టమెంట్ మళ్లీ పిలుస్తుంది. పూనే జాన్స్ బేకరీలో జరిగిన బాంబ్ పేలుడు కేసులో అతని సాయిం కోరుతుంది. ఓకే అన్న విజయ్ తన టీమ్ తో రంగంలోకి దూకుతాడు. ఆ ఇన్విస్టిగేషన్ లో  ఈ బ్లాస్ట్‌ను ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఖాలిద్ చేసాడని తేలుతుంది. అక్కడ నుంచి అతని వెంటబడతాడు. ఖాలిద్ ముంబై  లో ఉన్నాడని తెలిసి వెంటాడతాడు. అయితే ఆవిషయం తెలిసిన ఖాలిద్ నేపాల్ వెళ్లిపోతాడు.  నేపాల్ వెళ్లి అతన్ని ట్రేస్ చేసి ఎలా పట్టుకున్నాడు..  ఈ కథలో  ‘రా’ ఏజెంట్‌  ఆర్యా పండిట్‌ (సయామీ ఖేర్‌) పాత్ర ఏమిటి.. ?  వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
స్క్రీన్  ప్లే ఎనాలసిస్ …
 
ఫలానా చోట బాంబు పేలుతుంది..దాన్ని ఆపటానికి హీరో ట్రై చేస్తున్నాడు అంటే కొంతలో కొంత ఎమోషనల్ లాక్, ఇంటెన్స్ కథలో ఉంటాయి. అలా కాకుండా బాంబు ఆల్రెడీ పేలిపోయింది. నష్టం జరిగిపోయింది. దాన్ని పేల్చిన వాడిని పట్టుకోవటానికి హీరో బయిలుదేరాడు అనేది కాసేపు ఇంట్రస్ట్ జనరేట్ చేసినా, సినిమా మొత్తం అదే కథ అనే సరికి ఇబ్బంది ఎదురైంది. పోనీ వైల్డ్ డాగ్ గా నాగ్ క్యారక్టర్ ఏమన్నా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. దానికి తగ్గట్లే ప్లాట్ నేరేషన్..పెద్దగా ట్విస్ట్ లు,టర్న్ లు లేవు. ఇలాంటి సినిమాలు మనం చాలా చూసి ఉండటం కూడా మైనస్ గా మారింది. ఉన్నంతలో క్లైమాక్స్ బాగుంది. అయితే  ఆ క్లైమాక్స్  హాలీవుడ్ చిత్రం‘Argo’ నుంచి తీసుకున్నది. అలాగే సినిమాలో ప్రేక్షకుడు కనెక్ట్ కావటానికి సరపడ ఎమోషన్స్ కు చోటు లేకుండా పోయింది. థ్రిల్లర్ ఫార్మెట్ లో తీసిన సినిమా కాబట్టి… థ్రిల్స్ కు చోటు ఇస్తే బాగుండేది. అలాగే స్క్రీన్ ప్లే పై మరింత కసరత్తు చేసి ఉంటే రిపీట్ సీన్స్ తగ్గేవి. అయితే పాటలు లేకపోవటం, అనవసర కామెడీ ఇరికించకపోవటం వంటివి చేయటం ఈ సినిమాకు ఉన్నంతలో ప్లస్ పాయింట్స్ గా నిలిచింది. అలాగే కథలోకి వేగంగా వెళ్లటం,సెటప్ కు ఎక్కువ సమయం తీసుకోకపోవటం కూడా బాగుంది 
 
డైరక్టర్ ఎలా చేసారు..మిగతా డిపార్టమెంట్స్

నిజానికి ఓ రైటర్ …డైరక్టర్ అవుతున్నాడంటే …ఎక్కువగా రైటరే డామినేట్ చేస్తాడు.కానీ చిత్రంగా ఇక్కడ ఎక్కువగా డైరక్టర్ కు స్పేస్ లేదు. డైరక్టరే డామినేట్ చేసుకుంటూ పోయాడు. మేకింగ్ విషయానికి వస్తే…అద్బుతం కాదు కానీ కొన్ని షాట్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లతో కథ చెప్తాముకునే ప్రయత్నం కొంతవరకూ సక్సెస్ అయ్యింది. ఇక నటీనటుల్లో నాగ్..ఎందుకలో మైల్డ్ గా ఉన్నారు. టైటిల్ జస్టిఫికేషన్ కు తగ్గట్లుగా కూడా లేరు. మిగతా ఆర్టిస్ట్ లలో రా ఏజెంట్ గా సయామీ ఖేర్ బాగా చేసింది. విజయ్‌ వర్మ టీమ్‌ సభ్యుడిగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీరెజా ఫెరఫెక్ట్.

టెక్నికల్ గా చూస్తే..శనేయిల్ డియో సినిమాటోగ్రఫీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. విజువల్స్ తో  స్పై థ్రిల్లర్ ఫీల్ తెచ్చారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ బాగా ఇచ్చాడు.  శ్రవణ్ ఎడిటింగ్ కూడా బాగుంది.   ప్రొడక్షన్ డిజైనింగ్ , కిరణ్ కుమార్ డైలాగ్స్ బాగున్నాయి. నిరంజన్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాను నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి.

చూడచ్చా…

ఓ లుక్కేయచ్చు కానీ ఎక్సపెక్టేష్స్ లేకుండా అయితేనే

తెర వెనక..ముందు

సంస్థ: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌;
నటీనటులు: నాగార్జున, దియా మీర్జా, సయామీఖేర్‌, అతుల్‌ కులకర్ణి, అలీ రెజా, అవిజిత్‌ దత్‌ తదితరులు;
సంగీతం: ఎస్‌.తమన్‌;
సినిమాటోగ్రఫీ: షానెల్‌ డియో;
ఎడిటింగ్‌: శ్రావణ్‌ కత్తికనేని;
సంభాషణలు: కిరణ్‌ కుమార్‌;
నిర్మాత: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి;
రచన, దర్శకత్వం: అహిషోర్‌ సాల్మన్‌;
రన్ టైమ్ : 2 గం 9 నిమిషాలు
విడుదల: 02-04-2021