శాసనం చిత్రం ప్రారంభం
శ్రీ లిఖిత మూవీ మేకర్స్ పతాకంపై శ్రీను ముదిరాజ్ దర్శకత్వంలో నిర్మితమవుతున్న మూడో చిత్రం శాసనం పాటల రికార్డింగ్ కార్యక్రమం తో ప్రారంభమైనది. అభినయ శ్రీనివాస్ రాసిన నింగి నేల సింగిడి జతగా.. అంటూ సాగే గీతాన్ని నందన్ రాజ్ బొబ్బిలి సంగీత దర్శకత్వంలో తొలి పాటగా రికార్డు చేశారు. ఈ చిత్రానికి శ్రీమతి మంజుల ముదిరాజ్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. భారీ తారాగణంతో పాటు, నూతన నటీ నటుల ఎంపిక కూడా జరుగుతుంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి మూడు షెడ్యూల్స్ లో షూటింగ్ పూర్తి చేస్తామని దర్శకులు శ్రీను ముదిరాజ్ తెలియజేశారు. శాసనం చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్, ప్రేమ కధాచిత్రం.ఈ చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందని, సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు శ్రీను ముదిరాజ్ తెలిపారు.
సాంకేతిక వర్గం :
మాటలు: చిట్టిశర్మ
పాటలు: అభినయ శ్రీనివాస్, సాయి సిరి
సంగీతం: నందన్ రాజ్ బొబ్బిలి
కొరియోగ్రఫి: రమేష్ ఎర్రోళ్ళ
సినిమాటోగ్రఫి: ఆర్. మణిప్రసాద్
సమర్పణ: మంజుల ముదిరాజ్
నిర్మాణం: శ్రీ లిఖిత మూవీ మేకర్స్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను ముదిరాజ్.