Reading Time: < 1 min

శివకార్తికేయన్  తెలుగు చిత్రంలో ఉక్రేనియన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క

శివకార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వంలో రూపొందుతోన్న ఎస్.కె. 20లో హీరోయిన్గా ఉక్రేనియన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క.

ప్రముఖ హీరో శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేస్తున్నాడు. `జాతి రత్నాలు` బ్లాక్బస్టర్ విజయం సాధించిన తర్వాత ప్రముఖ దర్శకులలో ఒకరిగా మారారు అనుదీప్.  తెలుగులో ఇటీవలే `వరుణ్ డాక్టర్`తో విజయం పొందిన శివకార్తికేయన్ కోసం సక్సెస్ ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశాడు.

ఈ చిత్రంలో కథానాయికగా ఉక్రేనియన్ నటి మరియా ర్యాబోషప్క ఎంపికైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు సోమవారంనాడు ప్రకటించాయి. ఆమె ఇప్పటికే రెండు ఉక్రేనియన్ సినిమాల్లో నటించింది అంతేకాక ప్రసిద్ధ భారతీయ వెబ్-సిరీస్ స్పెషల్ ఆప్స్లో ప్రధాన పాత్ర పోషించింది. మరియాకు సంబంధించి నేడు విడుదల చేసిన పోస్టర్ లో ఆమె అందంగా కనిపిస్తోంది.

ఈ చిత్రం శివకార్తికేయన్ కు 20వ చిత్రం. #SK20 విభిన్నమైన కాన్సెప్ట్ తో కూడిన వినోదభరితమైన రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందబోతోంది. ఈ చిత్ర కథ బ్యాక్ డ్రాప్ పాండిచ్చేరి, లండన్ నేపథ్యంలో ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్ ల పై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు,  సురేష్ బాబు నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాత.

తారాగణం: శివకార్తికేయన్, సత్యరాజ్, మరియా ర్యాబోషప్క

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: అనుదీప్ కె.వి
సంగీత దర్శకుడు: ఎస్. ఎస్. థమన్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు,  సురేష్ బాబు
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్
సహ నిర్మాత: అరుణ్ విశ్వ