శ్యామ్ సింగ రాయ్ మూవీ రివ్యూ
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ రివ్యూ
Emotional Engagement Emoji (EEE)
ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీలో ఇప్పటివరకూ చేయని అత్యంత ఆసక్తికర పాత్రను నాని చేస్తున్నారని అని ట్రైలర్స్ చూస్తే అర్దమైంది. అలాగే ఈ సినిమా కోసం నాని కొత్తగా మేకోవర్ అయ్యారు కూడా. దానికి తోడు కలకత్తా నేపధ్యం,పీరియడ్ సబ్జెక్టు కావటం, సాయి పల్లవి జోడి…ఇవన్నీ ఎక్సపెక్టేషన్స్ పెంచేసాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంది. అసలు ఈ కథ ఏంటి, దేవదాసి,పునర్జన్మ అంటూ ఈ సబ్జెక్టు గురించి జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
storyline
వాసు(నాని) కు పెద్ద డైరక్టర్ కావాలనే కల. అందుకోసం ఓ షార్ట్ ఫిలిం తీసి ప్రూవ్ చేసుకోలానుకుంటాడు. కీర్తి(కీర్తి శెట్టి)ని ఒప్పించి హీరోయిన్ గా తన షార్ట్ ఫిల్మ్ ని ఫినిష్ చేస్తాడు. దాంతో ప్రొడ్యూసర్ ని ఒప్పించి సినిమా చేస్తాడు. ఆ సినిమా సూపర్ హిట్టై హిందీ రీమేక్ ఆఫర్ తెచ్చి పెడుతుంది. వాసు ఆ ఆనందంలో ఉండగానే అతని పై కాపీ కేసు పడుతుంది. అతను చేసిన సినిమా కథ…యాజటీజ్ గా 1960 లలో శ్యామ్ సింగరాయ్ అనే బెంగాళి రచయిత రాసిన కథను పోలి ఉంటుంది. చివరకు పాత్రల పేర్లు కూడా అవే. దాంతో ఆ స్టోరీ రైట్స్ కలగిన కలకత్తాకు చెందిన సంస్ద వారు కేసు వేస్తారు. అయితే వాసు అసలు తాను ఆ రచయిత పేరు ఎప్పుడూ వినలేదంటాడు. లై డిటెక్టర్ తో టెస్ట్ చేయిస్తుంది కోర్టు. అతను అబద్దం చెప్పటం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలో వాసుని క్లినికల్ హిప్నాసిస్ చేయగా ఊహింజచని ఓ కొత్త విషయం రివీల్ అవుతుంది. అదే ‘శ్యామ్ సింగ రాయ్’..ఇప్పటి వాసుగా పునర్జన్మ ఎత్తారని. ఇంతకీ అసలు ఈ శ్యామ్ సింగ రాయ్ ఎవరు? తనకు వాసు దేవ్ కు ఉన్న సంబంధం ఏంటి? శ్యామ్ వెనుక ఉన్న కథేంటి?మరి అతని కథేంటి? దేవదాసి మైత్రీ అలియాస్ రోజీ (సాయిపల్లవి)తో అతని ప్రేమ కథేంటి? అసలు వాళ్లిద్దరికీ ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్..
ఇలాంటి పునర్జన్మల కథలు మన తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ఎన్నో ఇప్పటికి వచ్చాయి. దాదాపు అన్ని కమర్షియల్ హిట్స్ సాధించాయి. ఇప్పుడు మరోసారి అదే ఫంధాలో వచ్చింది. అయితే కథగా పాతదైనా కథనం కొత్తగా ఉండాలే చూసుకోవాల్సిన భాధ్యత మేకర్స్ పై ఉంటుంది. స్క్రీన్ ప్లేను సైతం రొటీన్ గానే లాగేసారు. పెద్ద శ్రమ పడకుండా సీన్స్ వేసుకుంటూ వెళ్ళారు. ఫస్టాఫ్ మొత్తం వాసు పాత్రకు కేటాయించి…ఇంట్రవెల్ కు వచ్చేసరికి ‘శ్యామ్ సింగ రాయ్’పాత్రను ప్రవేశపెట్టారు. ఇక సెకండాఫ్ అంతా కలకత్తాలో ‘శ్యామ్ సింగ రాయ్’ పాత్ర చుట్టూ నడిపారు.
అయితే ఫస్టాఫ్ లో వాసు పాత్రకు పెట్టిన సమస్యకు, ‘శ్యామ్ సింగ రాయ్’ పాత్రకు ఉన్న సంభందం క్లైమాక్స్ లో ప్రూవ చేసి ఎండ్ చేసారు. అంతే తప్ప శ్యామసింగరాయ్ పాత్ర మళ్లీ పుట్టడం వల్ల కథకు కొత్తగా కలిసి వచ్చిందేమీ ఉండదు. ‘శ్యామ్ సింగ రాయ్’ పాత్ర పర్శనల్ లవ్ స్టోరీకి జస్టిఫికేషన్ ఇచ్చారు తప్ప…ఈ పాత్ర ఈ కాలంలో చేయాల్సిన లేదా పూర్తి చేయాల్సిన పనులు ఉండి ఉంటే మరింత గ్రిప్ గా ఉండేది. అలాగే ‘శ్యామ్ సింగ రాయ్’ పాత్ర సోషల్ రిఫార్మర్ అయినా ఆ పాత్ర వాసుగా పునర్జన్మ ఎత్తినా …ఇప్పటికాలంగా ఏమీ ఆ పాత్ర ప్రభావం ఉండదు. ఆ కథలను షార్ట్ ఫిల్మ్ లుగా రాసుకోవటం తప్పించి ఏమీ జరగదు. దానికి తోడు ‘శ్యామ్ సింగ రాయ్’ పాత్ర హత్య చేయబడటం వల్ల సెంటిమెంట్ తప్ప కథలో పెద్దగా మార్పు రాలేదు. దానికి తోడు ఫస్టాఫ్ లో కథ ఏమీ జరిగినట్లు కనపడదు. సెకండాఫ్ లోనే ఉన్నంతలో కథ ఉంటుంది.
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మన్స్ ..
నాని తను పోషించిన రెండు పాత్రలకు వైవిధ్యం చూపుతూ తనలోని నటుడుని సంపూర్తిగా ఆవిష్కరించేసారు. ‘శ్యామ్ సింగ రాయ్’గా వేరొకరని ఊహించని విధంగా చేసారు.సాయి పల్లవి పాత్ర వంక పెట్టడానికి లేదు. కీర్తి శెట్టి..జస్ట్ ఓకే అనిపించుకుంది. మురిళి శర్మ, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్ వంటి వారు రెగ్యులర్ గా చేసుకుంటూ పోయారు.
టెక్నికల్ గా …
మిక్కీ జె మేయర్ పాటలు పర్వాలేదు కానీ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ రేంజ్ లో ఉంది. సిరివెన్నెల, రైజ్ ఆఫ్ సింగరాయ్ పాటలు హత్తుకునేలా ఉన్నాయి. సాను జాన్ వర్గీస్ కెమెరా పనితనం బ్రిలియంట్. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. 1970ల కాలం నాటి బెంగాల్ ఎట్మాస్మియర్ ని చక్కగా చూపించటంలో ఆర్ట్ డిపార్టమెంట్ ప్రతిభ స్పష్గంగా కనిపిస్తోంది. అవినాష్ సెట్ వర్క్, జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం కలిసి సెకండాఫ్ లో మ్యాజిక్ చేసాయి.
ప్లస్ పాయింట్స్:
కలకత్తా నేపధ్యం
సాయి పల్లవి నాట్యం
నాని నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ లో లాగిన సీన్స్
కోర్ట్ ఎపిసోడ్స్
వీక్ క్లైమాక్స్
చూడచ్చా
ఓ పునర్జన్మ కథగా కాకుండా లవ్ స్టోరీగా ఈ సినిమా మెప్పిస్తుంది. నాని అభిమానులు నిరాశపరచదు.
తెర ముందు..వెనక..
నటీనటులు:
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
నాని, సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం తదితరులు.
ఒరిజినల్ స్టోరీ: సత్యదేవ్ జంగా
మ్యూజిక్: మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రఫీ: సను జాన్ వర్ఘీస్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్)
ఎడిటింగ్: నవీన్ నూలి
డైరెక్టర్: రాహుల్ సాంకృత్యాన్
ప్రొడ్యూసర్: వెంకట్ ఎస్. బోయనపల్లి
రన్ టైమ్ : 2 గంటల 37 నిమిషాలు
రిలీజ్ డేట్ : 24 డిసెంబర్ 2021