శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు
ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది. 24 మంది డైరెక్టర్స్ తో ఒక టైటిల్ ని లాంచ్ చేయడం చాలా అరుదు. సినిమాలో సరికొత్త వైబ్ కనిపిస్తోంది. మంచి వినోదం వుటుందని నమ్మకం కలుగుతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. ఇంతమంది మధ్యలో మా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ కావడం చాలా ఆనందంగా వుంది. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక పజిల్ లాంటిది. ఏం జరుగుతుందనే క్యురియాసిటీ వుంటుంది. ఆ పజిల్ ని డైరెక్టర్ మోహన్ గారు చాలా అద్భుతంగా ఫిల్ చేశారు. చాలా మంచి నిర్మాణ విలువలతో తీసిన చిత్రమిది. చాలా ఫన్ తో ఈ చిత్రం చేశాం. ప్రేక్షకులకు కూడా ఆ చిత్రం మంచి వినోదాన్ని పంచుతుంది అన్నారు.
దర్శకుడు రైటర్ మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా 24 మంది దర్శకులకు కృతజ్ఞతలు. ఈ వేడుకు విచ్చేసి మమల్ని బ్లెస్ చేసిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. ఇందులో వెన్నల కిశోర్ గారు షెర్లాక్ హోమ్స్ ప్రధాన పాత్ర పోషించారు. షెర్లాక్ హోమ్స్ లో మూడు పాత్రలు వున్నాయి. షెర్ అంటే శర్మిలమ్మ (అమ్మ).. లోక్ అంటే లోకనాధం(నాన్న) హోం అంటే ఓం ప్రకాష్. రూరల్, 91 రెట్రో బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేశాం. ఫన్నీగా థ్రిల్లింగా వుంటుంది. నిర్మాత రమణ రెడ్డిగారి ధన్యవాదాలు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ రామ్ బాల ఎంతగానో సపోర్ట్ చేశారు. వెన్నెల కిశోర్ గారు చాలా వోన్ చేసుకొని ఈ పాత్ర చేశారు. ఇది ఫస్ట్ బ్లాస్ట్ మాత్రమే. మున్మందు మరిన్ని పంచ్ లు రివిల్ చేస్తాం. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ రామ్ బాల మాట్లాడుతూ.. ఈ వేడుకు విచ్చేసిన దిల్ రాజు గారికి ధన్యవాదాలు. 24 మంది డైరెక్టర్స్ టైటిల్ లాంచ్ చేయడం చాలా అరుదైన విషయం. అందుకు సహకరించిన దర్శకులకు, అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. దర్శకుడు అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. అందరికీ ధన్యవాదాలు తెలిపారు
నాగ మహేష్ మాట్లాడుతూ… ఇందులో వెన్నెల కిశోర్ గారికి తండ్రి పాత్ర చేశాను.ఈ పాత్ర చాలా తృప్తిని ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో భద్రం, ప్రభావతితో పాటు మిగతా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక న నిపుణులు పని చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. మల్లికార్జున్ ఎన్ డీవోపీ, అవినాష్ గుర్లింక ఎడిటర్ గా పని చేస్తున్నారు. బేబీ ఫేం సురేష్ బిమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. రాజేష్ రామ్ బాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
నటీనటులు :
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, అనిష్ కురివిల్లా, రవితేజ మహాదాస్యం, షియా గౌతం, నాగ మహేష్, భద్రం, కాలకేయ ప్రభాకర్, ప్రభావతి, మురళిధర్ గౌడ్
టెక్నికల్ టీం :
రచన, దర్శకత్వం: రైటర్ మోహన్
నిర్మాత : వెన్నపూస రమణ రెడ్డి
బ్యానర్: శ్రీ గణపతి సినిమాస్
మ్యూజిక్ : సునీల్ కశ్యప్
డీవోపీ: మల్లికార్జున్ ఎన్
ఎడిటర్ : అవినాష్ గుర్లింక