శ్వాగ్ చిత్రం రుక్మిణి దేవిగా రీతూ వర్మ పరిచయం
ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న రీతూ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా శ్వాగ్ మేకర్స్ ఆమె పాత్రను వింజమర వంశంలోని మహారాణి రుక్మిణి దేవిగా పరిచయం చేశారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో రీతూ వర్మ శ్రీవిష్ణు వ్యాఖ్యలను పరిహాసం చేస్తూ కనిపించారు. మగవారి కంటే స్త్రీలు గొప్పవారు, శక్తివంతులు అని చెప్పారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన శ్రీవిష్ణు, ‘శ్వాగ్’ అనేది మగవారి కథ, శ్వాగనికి వంశం కథ అని స్పష్టం చేశారు.
వీడియో హిలేరియస్ గా ఉంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న శ్వాగ్- శ్రీ విష్ణు, హసిత్ గోలీల నుండి మరొక యూనిక్ మూవీ.
ఈ చిత్రానికి వేదరామన్ శంకరన్ కెమెరా డీవోపీ పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకురుస్తున్నారు. విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ని చూస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.
తారాగణం: శ్రీవిష్ణు, రీతూ వర్మ
సాంకేతిక విభాగం:
నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్
రచన & దర్శకత్వం: హసిత్ గోలి
సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్
సినిమాటోగ్రాఫర్: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ఆర్ట్ డైరెక్టర్: GM శేఖర్
స్టైలిస్ట్: రజనీ
కొరియోగ్రఫీ: శిరీష్ కుమార్
స్టంట్స్: నందు మాస్టర్
పబ్లిసిటీ డిజైన్స్: భరణిధరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనునాగవీర
సాహిత్యం: భువన చంద్ర, రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల, నిఖిలేష్ సుంకోజీ, స్వరూప్ గోలి