షాదీ ముబారక్ సినిమా ట్రైలర్ విడుదల
నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిన ‘షాదీ ముబారక్’ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. నాది గ్యారంటీ: హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలనే కాదు.. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ హృదయాలు హత్తుకునేలా కూల్ అండ్ ప్లెజెంట్ మూవీస్‌ను అందిస్తూ ఎన్నో సూపర్ డూపర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ బ్యానర్ నుంచి తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోన్నమరో ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘షాదీ ముబారక్’. వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. ‘షాదీ ముబారక్’ మార్చి 5న విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ట్రైలర్‌ను హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా…
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ – ‘‘2020లో కోవిడ్ రావడం ఏంటో కానీ.. 2021లో సినిమాలు విడుదలవుతున్న తీరు చూస్తుంటే, 90లో ప్రతి వారం రెండు, మూడు సినిమాలు విడుదలయ్యేరోజులు గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు సినిమాల ఫ్లో స్టార్ట్ అయ్యింది. చిన్న, పెద్ద సినిమాలు ఫ్లో అవుతున్నాయి. ఈ ఏడాది మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు కానీ, ఇతర నిర్మాతలతో కలిసి సహ నిర్మాణంలో చేస్తున్న సినిమాలు ఫ్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక ‘షాదీ ముబారక్’ సినిమా విషయానికి వస్తే.. యూనిట్ సినిమాను పూర్తి చేసుకున్న తర్వాత ఓరోజు సాగర్ నాకు సినిమా ట్రైలర్‌ను చూపించాడు. చాలా ఆసక్తికరంగా అనిపించడంతో సినిమా చూస్తానని అన్నాను. సినిమా చూశాను. అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ తప్పితే సినిమా అంతా హిలేరియస్ ఎంటర్టైనర్గా అనిపించింది. సినిమాను చాలా బాగా తెరకెక్కించారు. నాకు సినిమాపై ఉన్న ఆలోచనను ఎలా చేయాలో శ్రీనివాస్ రెడ్డిగారికి, సాగర్‌కి చెప్పాను. వాళ్లు బాల్ని నా కోర్టులో వేశారు. నేను నాకు అనిపించిన కరెక్షన్స్ గురించి చెప్పాను. వాళ్లు దాన్ని కరెక్షన్స్ చేశారు. తర్వాత సినిమాను రిలీజ్ చేయమని మరోసారి బాల్‌ను నా కోర్టులోనే వేశారు. మంచి సినిమాను మా బ్యానర్ నుంచి రిలీజ్ చేద్దామని నిర్ణయించుకుని సినిమాను టేక్ ఓవర్ చేసుకున్నాం. సినిమా మ్యూజికల్‌గా కానీ, ఎంటర్టైన్మెంట్కానీ అన్నీ బావున్నాయి. దర్శకుడు పద్మశ్రీ ఓ కొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ చూస్తే సినిమా హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిందని అర్థమై ఉంటుంది. రెండు గంటల పదిహేను నిమిషాల వ్యవథిలు న్న ఈ సినిమా అంతా నవ్విస్తూనే ఉంటుంది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మూవీ. సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు అది నా గ్యారంటీ. థియేటర్‌కు వచ్చి ప్రేక్షకులు సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎంటైర్టీమ్కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
చిత్ర దర్శకుడు పద్మశ్రీ మాట్లాడుతూ – ‘‘షాదీ ముబారక్’ సినిమా కథను రాసుకున్న తర్వాత దిల్‌రాజుగారికే చెప్పాలనుకున్నాను. కానీ ఆయన యు.ఎస్‌కు వెళ్లి ఉన్నారు. అయితే తిరిగి తిరిగి సినిమా దిల్‌రాజుగారి దగ్గరికే వచ్చింది. కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డిగారు, వినోద్‌గారు, సాయిగారు, సాగర్‌గారికి థాంక్స్. కథ చెప్పగానే సాగర్‌గారు ఓకే చేసి నటించినందుకు ఆయనకు స్పెషల్ థాంక్స్’’ అన్నారు.
సహ నిర్మాత శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘సినిమా స్క్రిప్ట్ నుంచి నేను, వినోద్, సాయి కలిసి చేసుకుంటూ వస్తున్నాను. స్క్రిప్ట్ విన్నప్పుడు సాగర్గారికైతే ఈ సినిమా పక్కాగా సరిపోతుందనిపించింది. ఆ నమ్మకంతో ముందుకెళ్లాం. తర్వాత దిల్‌రాజుగారి సపోర్ట్ మరచిపోలేం. ఆయన సపోర్ట్ వల్లనే సినిమా క్వాలిటీ చాలా బాగా వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ థాంక్స్. సాగర్‌కు సక్సెస్ రావాలని కసితో చేసిన సినిమా ఇది’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మాట్లాడుతూ – ‘‘దిల్‌రాజుగారి బ్యానర్లో పనిచేయాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. అలాగే నిర్మాత శ్రీనివాస్రెడ్డిగారికి కృతజ్ఞతలు. డైరెక్టర్ పద్మశ్రీగారు నాపై నమ్మకంతో ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్. సాగర్‌గారికి స్పెషల్ థాంక్స్’’ అన్నారు.
హీరో వీర్ సాగర్ మాట్లాడుతూ – ‘‘దిల్‌రాజుగారి బ్యానర్లో నా పేరు పడుతుందని నేను అనుకోలేదు. ఆయన బ్యానర్లో నా పేరు రావాలనే కోరిక మాత్రం ఉండింది. అది ఈరోజు నిజమైంది. నా కలను నిజం చేసిన దిల్‌రాజుగారికి థాంక్స్ అనే పదం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. చాలా చిన్న విషయాల్లో ఆయన తన వంతు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగే శిరీష్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా దిల్‌రాజు, శిరీష్‌గారి చేతుల్లోకి వెళ్లడం అనేది మిరాకిల్ అనే చెప్పాలి. లాక్డౌన్ తర్వాత శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌గారి వకీల్‌సాబ్ సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటే మధ్య వీడెవడ్రా షాదీ ముబారక్ అంటూ దూరాడు అని మెగా ఫ్యాన్స్, పవర్‌స్టార్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వాళ్లు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నేను ఎనిమిదేళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. పవర్‌స్టార్‌గారి సినిమా ఎప్పుడేసినా జనాలు చూస్తారు. కానీ మాలాంటి వాళ్ల సినిమాలకు చిన్న టైమ్ స్టార్ట్ మాత్రమే దొరుకుతుంది. అప్పుడు సినిమాను రిలీజ్ చేస్తే సక్సెస్‌తో పాటు నిర్మాతలకు లాభాలు కూడా వస్తాయి. రాజుగారు మంచి ఉద్దేశంతో ఎంకరేజ్ చేయడానికి తీసుకున్న నిర్ణయమిది. నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. మెగాభిమానిగా స్టార్ట్ అయిన నేను బుల్లితెరపై మెగాస్టార్‌గా ఇమేజ్ను సొంతం చేసుకుని మళ్లీ బిగ్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాను. ఎస్వీసీ బ్యానర్ అంటే అందరూ భారీగా ఊహిస్తారు. అందరితో నేను కూడా వకీల్‌సాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మధ్యలో ఈ మూవీని ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. నా స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డి, వినోద్, సాయిలతో పాటు మేం కలిసి ట్రావెల్ అయ్యాం. నా ఫ్రెండ్స్‌కు నాకు ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందా అనే చిన్న సందేహం కూడా ఉండేది. అయితే వాళ్లు నా సక్సెస్ కోసం ఈ సినిమా చేశారు. నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి సినిమా చేశాను. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. టీజర్, ట్రైలర్లో ఉన్న టెంపో సినిమాలోనూ ఉంటుంది. ఎక్కడ బోర్ ఫీల్ కారు. మార్చి 5న సినిమాను విడుదల చేస్తున్నాం. అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’’ అన్నారు.
నటీనటులు:
వీర్‌సాగర్, దృశ్యా రఘునాథ్, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్, ప్రియదర్శి రామ్, హేమంత్, శత్రు, భద్రమ్, మధునందన్, అదితి, అజయ్ ఘోష్ తదితరులు
సాంకేతిక వర్గం:
ఆర్ట్: నాని
ఎడిటర్: మధు
సంగీతం: సునీల్ కశ్యప్
కెమెరా: శ్రీకాంత్ నారోజ్
నిర్మాతలు: రాజు, శిరీష్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ.