సత్య భామ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
స్టోరీ లైన్ :
సత్యభామ(కాజల్ అగర్వాల్) షి టీం లో వర్క్ చేస్తూ ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యలని సాల్వ్ చేస్తూ తన భర్త అమర్ (నవీన్ చంద్ర) తో హ్యాపీగా జీవిస్తుంటుంది. ఒకరోజు హసీనా (నేహా) తన భర్త యాదు (అనిరుద్ పవిత్రన్) తనని కొడుతూ చిత్రహింసలు చేస్తున్నాడని సత్యభామ ని ఆశ్రయిస్తుంది. దీంతో కోపోద్రిక్తుడైన యాదు సత్యభామ ముందే హసీనా ని చంపేస్తాడు. హసీనా చనిపోయే ముందు తన తమ్ముడు ఇక్బాల్ ని జాగ్రత్తగా చూస్కోమని సత్యభామకి చెప్తుంది. ఈ క్రమంలో ఈ ఇక్బాల్ ఒక ఉగ్రవాది అని ముద్ర పడుతుంది. మరి అతడు నిజంగానే ఉగ్రవాదా? అక్క అంటే అమితమైన ప్రేమ ఉన్న ఇక్బాల్ అసలు ఏం చేస్తాడు? సత్యభామ అతని విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? ఈ క్రమంలో ఆమెకి ఎదురైన సవాళ్లు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.
ఎనాలసిస్ :
భర్త వేధిస్తున్నాడని ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే.. చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేయడం వలన.. తానూ ఎంత తప్పు చేసానని పోలీస్ ఆఫీసర్ బాధపడటం.
ఆర్టిస్ట్ ల ఫెరఫార్మెన్స్ :
కాజల్ నటన పర్వాలేదు. ఎమోషన్ సీన్స్ లో బాగా నటించింది. యాక్షన్ సీన్స్ లో పర్వాలేదు. కానీ ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే డిఫరెంట్ గా ఈ సినిమాలో కనపడుతుంది. యంగ్ నటీనటులు అంకిత్, అనిరుద్ లు పెర్ఫామెన్స్ బాగుంది. అలాగే నేహా మంచి ఎమోషన్స్ ని కనబరిచింది. ఇక వీరితో పాటుగా ప్రముఖ నటులు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్ లు తమ పాత్రలు పరిధి మేరకు బాగా చేశారు.
టెక్నికల్ గా :
సుమన్ చిక్కాల దర్శకత్వం పర్వాలేదు. . శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే పర్వాలేదు. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి.
శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ బాగుంది. ఇంకా కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ పర్వాలేదు కానీ చాలా కొన్ని అనవసర సీన్స్ తగ్గించాల్సింది.
చూడచ్చా :
చూడలేము
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల యాక్టింగ్,
బీజీఎమ్.
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
తీర్పు :
మెప్పించలేని సత్యభామ..
నటీనటులు:
కాజల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నేహా పఠాన్, అంకిత్ కొయ్య, అనిరుద్ పవిత్రన్ ,నాగినీడు, హర్షవర్ధన్, తదితరులు
సాంకేతికవర్గం :
సినిమా టైటిల్ : సత్యభామ
బ్యానర్: ఆరం ఆర్ట్స్
విడుదల తేదీ: 07-06-2024
సెన్సార్ రేటింగ్: “ U/A “
దర్శకత్వం: సుమన్ చిక్కాల
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్
నిర్మాత: శశికిరణ్ తిక్క, బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
రన్టైమ్: 133 నిమిషాలు
మూవీ రివ్యూ :
రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్