సమిధ చిత్రం టైటిల్ లోగో పోస్టర్ రిలీజ్
షార్ట్ ఫిలిం మేకింగ్ ద్వారా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం మరొక షార్ట్ ఫిలిం మేకర్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తున్నారు. ‘మర్మం’ ,’కనులు కలిసాయి’ లాంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించి ఇప్పుడు వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు సతీష్ మాలెంపాటి.
సెప్టెంబర్ 30 దర్శకుడు సతీష్ మాలెంపాటి పుట్టినరోజు సందర్భంగా ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలిచిత్రం ‘సమిధ` టైటిల్ లోగో పోస్టర్‌ని రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ మాలెంపాటి మాట్లాడుతూ – ” నేను గతంలో ఐదు షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాను. అలాగే చాలా యాడ్ ఫిలిమ్స్ చేసిన అనుభవం కూడా ఉంది. ఆ అనుభవంతో ఇప్పుడు ఒక మూవీకి దర్శకత్వ భాద్యతలు చేపట్టాను. ఒక యదార్ధ గాథని ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సమిధ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. నా బర్త్ డే రోజు `సమిధ` లోగో పోస్టర్ రిలీజ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అరుణం ఫిలిమ్స్ వారికి థాంక్స్. ‘సమిధ’ అనేది అచ్చ తెలుగు పదం. ఈ కథకు హండ్రెడ్ పర్సెంట్ ఈ టైటిల్ యాప్ట్. ఇది మంచి కంటెంట్ బేస్డ్ ఫిలిం. `చావు రెండు సందర్భాల్లో వస్తది ఎవరికైనా..` అనేది ఈ సినిమా క్యాప్షన్. ఈ పాయంట్ చూట్టూ కథ రన్అవుతుంది. అన్వేషణ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాల జోనర్‌లో చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా అందరినీ థ్రిల్ చేస్తుంది. ప్రముఖ హీరోహీరోయిన్‌లు నటించే ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, రవికాలేతో పాటు మరికొంతమంది ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తారు. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేసి 2021 సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేస్తాం“ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
సినిమాటోగ్రఫి: జవహర్ రెడ్డి,
కొరియోగ్రఫి: గణేష్, భాను,
ఎడిటర్: బి. నాగేశ్వర రెడ్డి,
ఆర్ట్: నారాయణరావు ముప్పాల,
నిర్మాణం: అరుణం ఫిలిమ్స్ యూనిట్,
రచన, దర్శకత్వం : సతీష్ మాలెంపాటి.