సమ్మతమే చిత్రం ట్రైలర్ విడుదల
కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ ట్రైలర్ విడుదల చేసిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం “సమ్మతమే” చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. యుజి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్, ఐటీ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
మూడు నిమిషాల నిడివిగల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. డైలాగ్స్ ఆసక్తికరంగా వున్నాయి. టెక్నికల్ గా ట్రైలర్ ఉన్నతంగా ఉంది. సతీష్ రెడ్డి మాసం అందించిన విజువల్స్ సూపర్ కూల్ గా వున్నాయి. ట్రైలర్ కి శేఖర్ చంద్ర అందించిన బీజీయం చాలా రిఫ్రెషింగ్ గా వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ట్రైలర్.. సినిమా పై అంచనాలు పెంచింది.
ట్రైలర్ లాంచ్ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ అయినా చాలా బాగా చేశారు. ఈనెల 24న సినిమా రిలీజవుతోంది. అందరూ థియేటర్లకు వెళ్లి, సినిమా చూసి ఆదరించండి. టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్” అన్నారు.
నిర్మాత కంకణాల ప్రవీణ మాట్లాడుతూ, “మా అబ్బాయి చిన్నప్పుడు సినిమాకి పోతా అని ఏడ్చేవాడు, ఇప్పుడు ఏకంగా సినిమానే తీశాడు. ఈ మూవీకి పనిచేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈనెల 24న ఈ సినిమాని చూసిన వాళ్లందరూ ‘సమ్మతమే’ అంటారని ఆశిస్తున్నాను. అందరూ అలాగే అనాలని కోరుకుంటున్నాను. ఫ్యామిలీతో వెళ్లి చూడాల్సిన చిత్రం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ నచ్చుతుంది. మీరందరూ వచ్చి, సినిమా చూసి సమ్మతమే అని మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను.” అని అన్నారు.
డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, “మాది నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొల్లపల్లి అనే చిన్న ఊరు. నా చిన్నతనంలో మా ఊళ్లో సినిమా చూడాలంటే అది రెండోసారి రిలీజవ్వాలి. అంటే సినిమా రిలీజైన మూడు నాలుగు నెలలకు కానీ అది మా ఊరికి వచ్చేది కాదు. అలాంటి ఊరి నుంచి వచ్చిన మాలాంటి వాళ్లకు సపోర్ట్ చేయడానికి వచ్చిన కేటీఆర్ గారికి చాలా థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర రాత్రి 9.30కు ఈ ట్రైలర్‌కు ఆర్ఆర్ స్టార్ట్ చేస్తే, ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకు పూర్తయింది. మార్నింగ్ ఫైనల్ మిక్స్ చేశాం. అంతగా కష్టపడ్డారు. డీవోపీ సతీశ్‌రెడ్డి చాలా సపోర్ట్ చేశారు. హీరోయిన్ చాందిని గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. సినిమా గీతా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రిలీజవుతోంది. హీరో కిరణ్ అన్న వల్లే ఓటీటీ బిజినెస్ కూడా క్లోజ్ అయ్యింది. తను దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. తనకూ, నాకూ మొదట్నుంచీ మంచి రాపో కుదిరింది.” అని చెప్పారు.
హీరోయిన్ చాందిని మాట్లాడుతూ, “సమ్మతమే ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, ఇలాంటివి చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకున్నవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. నా మనసుకు నచ్చి చేసిన క్యారెక్టర్స్ మాత్రం వర్కౌట్ అయ్యాయి. ఈ స్టోరీ వినగానే నా మనసుకి ఇది చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి సినిమా అనిపించింది. అందుకే వెంటనే అంగీకరించాను. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను.” అన్నారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ట్రైలర్ లాంచ్ చేసిన కేటీఆర్ గారికి కృతజ్ఞతలు. మీకు ట్రైలర్ నచ్చిందని చెప్పడం, కొత్తవాళ్ళు రావాలని మీరు ఎంకరేజింగ్ గా మాట్లాడటం ఆనందంగా ఉంది. మా సినిమా నచ్చి, ఈ సినిమాని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సాయం చేస్తున్న అల్లు అరవింద్ గారికి, బన్నీ వాసు గారికి ధన్యవాదాలు. సమ్మతమే ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సినిమా గురించి ఇక చెప్పడాలు ఏం లేవు. సినిమా పట్ల మేం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. జూన్ 24న అన్నింటికీ మీతో సమ్మతమే అని మేం చెప్పిస్తాం. ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు.” అన్నారు.
తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు.
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ
బ్యానర్: యూజీ ప్రొడక్షన్స్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్: విల్పవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల