Reading Time: < 1 min
సరిలేరు నీకేవ్వరు చిత్రం శతదినోత్సవ  వేడుకలు
 
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అభిమనుల ఆధ్వర్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకేవ్వరు” శతదినోత్సవ  వేడుకలు ఘనంగా నిర్వహించారు.
 
చిలకలూరిపేట సినీ చరిత్రలో  2 ధియేటర్లలో, 4 ఆటలతో 50రోజులు ప్రదర్శింపబడి టౌన్ రికార్డ్స్ సృష్టింపబడి , కరోనా లాక్ డౌన్ ముందు వేంకటేశ్వర ధియేటర్లో 68రోజులు 4 ఆటలతో ప్రదర్శింపబడి , లాక్ డౌన్ తరువాత 32రోజులు 4ఆటలతో ప్రదర్శింపబడి , టోటల్ గా 100రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుని, చిలకలూరిపేట సినీ చరిత్రలో  ” భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నేకెవ్వరు”  3 చిత్రాలు 100రోజుల ప్రదర్శింపబడి హ్యాట్రిక్ దిశగా రికార్డ్ క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ” సరిలెరు నేకేవ్వరు” 100రోజుల వేడుకలను చిలకలూరిపేట కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు ఇ. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధియేటర్ యాజమాన్యానికి 100రోజుల షీల్డ్ ను అందజేసి, బాణసంచా కాల్చారు,  ధియేటర్ సిబ్బందికి కుక్కర్లను బహూకరించి , శీతాకాలం కారణంగా రొడ్డు పై పడుకున్న అనాధలకు దుప్పట్లు అందజేసి తమ అభిమాన హీరోకి ఆదర్శంగా నిలిచారు.
 
ఈ కార్యక్రమంలో అభిమానులు యస్.కె.నాసరవలి , షంషుద్దీన్ ,  నరేంద్ర సాయి ,సిద్ధిక్ , నటరాజ్, శివ, ప్రిన్స్ ,బాబీ ,శివజ్యోతి ,  అంజి ,దిలీప్, చంటి,కిరణ్, జిలానీ,  కుమార్ ,బాషా ,తేజ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.