సర్కారు నౌకరి మూవీ పాట విడుదల
సర్కారు నౌకరి సినిమా నుంచి నీళ్లా బాయి లిరికల్ సాంగ్ రిలీజ్
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా సర్కారు నౌకరి. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నీళ్లాభాయ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
శాండిల్య పీసపాటి స్వరపర్చిన ఈ పాటకు పసునూరి రవీందర్ సాహిత్యాన్ని అందించగా సోని కొమండూరి ఆకట్టుకునేలా పాడారు. నీళ్లా భాయి నిమ్మళంగా అడిగే .ఈ సక్కని సుక్కా లగ్గమెప్పుడని, ఎగిరే గువ్వ, ఎన్నెలోలె నవ్వేఆ పప్పు బువ్వ సందడెప్పుడనిఅంటూ పెళ్లి చూపుల సందర్భంగా అమ్మాయి మనసులో కలిగే ఎమోషన్స్, కాబోయో భర్త గురించి మొదలయ్యే ఊహలతో ఈ పాట సాగుతుంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
టెక్నికల్ టీమ్ :
నిర్మాత : కె రాఘవేంద్ర రావు
సినిమాటోగ్రఫీ, రచన, దర్శకత్వం : గంగనమోని శేఖర్
సంగీతం : శాండిల్య, నేపధ్య సంగీతం : సురేష్ బొబ్బిలి
ఎడిటర్ : రాఘవేంద్ర వర్మ